తెలంగాణ

PJTSAU: ఘనంగా జరిగిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం.!

1
Registrar Professor S. Sudhir Kumar Retirement
Registrar Professor S. Sudhir Kumar Retirement

PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిధ్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం పరిపాలన భవనంలో ఘనంగా జరిగింది. ఉపకులపతి ఎం. రఘునందన్ రావు డి.ఆర్ డాక్టర్ వెంకటరమణ రిజిస్ట్రార్ ను, డాక్టర్ రత్న కుమారిని ఘనంగా సన్మానించారు. అలాగే విశ్వవిధ్యాలయ బోధన, భోదనేతర సిబ్బంది, శాస్త్రవేత్తలు ఆయనను ఘనంగా సన్మానించారు. 37 ఏళ్లుగా వివిధ హోదాల్లో విశ్వవిధ్యాలయానికి సుధీర్ కుమార్ అంధించిన సేవలను కొనియాడారు.

PJTSAU

PJTSAU

ఈ సంధర్భంగా సుదీర్ కుమార్ విశ్వవిధ్యాలయానికి తనకీ వున్న సుధీర్ఘ బంధాన్ని, ఎదుర్కొన్న అనుభవాల్ని వివరించారు. అందరి సహకారంతోనే విశ్వవిధ్యాలయంలో సంస్కరణల్ని తీసుకురాగలిగానన్నారు. ప్రతిఒక్కరూ విశ్వవిధ్యాలయాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి అంకితభావంతో పనిచేయాలని సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పదవి విరమణ చేసిన కమ్యూనిటీ సైన్స్ డీన్ డాక్టర్ రత్నకుమారిని కూడా సన్మానించారు. విశ్వవిద్యాలయంలో తన 35 ఏళ్ల అనుభవాలను ఆమె పంచుకున్నారు.

Registrar Professor S. Sudhir Kumar Retirement Programme

Registrar Professor S. Sudhir Kumar Retirement Programme

తన కిందిస్థాయి సిబ్బంది, బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో తనకిచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో PJTSAU ఇంచార్జ్ ఉపకులపతి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు, IAS ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరిశోధనలక కి పెద్ద సంఖ్యలో పేటెంట్ హక్కులు రావడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయ ఇన్చార్జి రిజిస్ట్రార్ బాధ్యతల్ని పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ కి అప్పగిస్తున్నట్లు ఉపకులపతి ప్రకటించారు. అదేవిధంగా దశలవారీ అన్ని యూనివర్సిటీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలన భవనంతో పాటు పలు విభాగాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave Your Comments

QR Code System for Quality Seeds: నాణ్యమైన విత్తనాల కోసం -QR కోడ్ సిస్టమ్.!

Previous article

Micro Greens: ఇంటిలో పండించుకునే పంటలతో లక్షలు సంపాదించడం ఎలా ?

Next article

You may also like