Minister Niranjan Reddy: హైదరాబాద్ సచివాలయం మూడో అంతస్తు సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు , అన్ని జిల్లాల డీఎఓలు తదితరులు హాజరయ్యారు.
అన్ని రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం మనకు గర్వకారణం అని ప్రభుత్వం వ్యవసాయానికి, రైతాంగానికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ తరపున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలని అన్నారు.
Also Read: Soil pH: చౌడు నేలల సంరక్షణ చర్యలు.!
వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. 3వ తేదీన రైతువేదికలను సుందరంగా ముస్తాబుచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విజయాలను తెలియపరుస్తూ పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు అవి అర్ధమయ్యేలా సమావేశంలో ప్రసంగాలలో వివరించి, కరపత్రాలు అందజేయాలని మంత్రి తెలియజేసారు.
రైతువేదికలలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించాలని వ్యవసాయ మార్కెట్లను మామిడి తోరణాలతో , లైట్లతో అలంకరించి రైతులతో సమావేశాలు నిర్వహించాలని ఆయా మార్కెట్ల పరిధిలో ఉత్తమ రైతులు, ఉత్తమంగా, నాణ్యమైన పంటలు పండించే రైతులను గుర్తించి సత్కరించాలని మంత్రి తెలియచేసారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ముస్తాబు చేసి ఉత్సవాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి జరిగిన మేలును వివరించాలని భవిష్యత్ లో కూడా వ్యవసాయరంగానికే పెద్దపీట వేస్తున్నాం అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
Also Read: Lemongrass Cultivation: లెమన్ గ్రాస్ పెంచండి ఆదాయం పెంచుకోండి.!