తెలంగాణ

Minister Niranjan Reddy: విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

1
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో మార్కెట్లోకి  విజయ బ్రాండ్ వేరుశెనగ గానుగనూనె ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

కల్తీలేని ఉత్పత్తులు ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు. విజయ బ్రాండ్ నుండి నాణ్యమైన వంటనూనెలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉత్పత్తులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారని మంత్రి అన్నారు. నాణ్యమైన వంటనూనెల తయారీపై ఆయిల్ ఫెడ్ దృష్టిపెట్టిందని వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి, రైస్ బ్రాన్, పామాయిల్, గానుగ నూనెలు ఆయిల్ ఫెడ్ ఉత్పత్తి చేస్తున్నదని మంత్రి అన్నారు.

Also Read: Chicken Price: కొండెక్కిన కోడి! తాళలేక చనిపోతున్న కోళ్లు.. తగ్గిన కోళ్ల పెంపకం

Minister Niranjan Reddy

Vijaya Brand Oil

విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలని శుద్ధమయిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని హైదరాబాద్ లోని అన్ని రైతుబజార్లలో విజయ ఔట్ లెట్లు ఉన్నాయని మంత్రి అన్నారు. మొత్తం 33 జిల్లాకేంద్రాలలో ఔట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టబోతున్నారని ఖమ్మం, కరీంనగర్ లో విజయ ఔట్ లెట్లు ప్రారంభమవుతున్నాయని సిద్దిపేట, వనపర్తిలలో జూన్ లో ప్రారంభం అవుతాయని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లాభాల బాటలో ఆయిల్ ఫెడ్ ఉందని ఏటా వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించి వంద కోట్ల లాభాలలో ఆయిల్ ఫెడ్ ఉందని .. కేవలం నూనె ఉత్పత్తులపై పది కోట్ల లాభం విజయ బ్రాండ్ పొందిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Also Read: Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్

Leave Your Comments

Chicken Price: కొండెక్కిన కోడి! తాళలేక చనిపోతున్న కోళ్లు.. తగ్గిన కోళ్ల పెంపకం

Previous article

Flying Robot: కూలీలు లేకుండా పండ్లను కోయడం ఎలా ?

Next article

You may also like