తెలంగాణ

Rythu Bandhu Scheme: రైతుబంధుకు ఐదేళ్లు .. వర్ధిల్లాలి వెయ్యేళ్లు – మంత్రి నిరంజన్ రెడ్డి

1
Minister Niranjan Reddy with Farmers in Rythu Bandhu Scheme Completed 5 years Programme
Minister Niranjan Reddy with Farmers in Rythu Bandhu Scheme Completed 5 years Programme

Rythu Bandhu Scheme: 2018 మే 10న కరీంనగర్ జిల్లా శాలపల్లి బహిరంగసభలో ధర్మరాజుపల్లి రైతులకు చెక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాలు ఇచ్చి రైతుబంధు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గారు ప్రారంభించారు. రైతుబంధు పథకం ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సంధర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రైతులతో కేక్ కట్ చేసి రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Singireddy Niranjan Reddy)  గారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధుకు ఐదేళ్లు – వర్ధిల్లాలి వెయ్యేళ్లు అని అన్నారు. రైతును గుర్తించిన ఏకైక నాయకుడు ఒక్క కేసీఆర్ గారే అని ఆయన పేర్కొన్నారు. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చెయ్యబడింది. ఈ యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు 144.35 లక్షల ఎకరాలకు 7217.54 కోట్ల సాయం అందజేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రపంచ ఆహార సంస్థ (FAO) 2018 – 19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాలలో రైతుబంధు, రైతుభీమాను గుర్తించడం దీనికి నిదర్శనం అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.

Rythu Bandhu Scheme Completed 5 years

Rythu Bandhu Scheme Completed 5 years

ఏటా రూ.10,500 కోట్ల రూపాయలతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందించడం జరిగిందని రూ.32,700 కోట్లతో విద్యుత్ మౌళిక సదుపాయాల కల్పించామని ఇప్పటి వరకు రూ.17,351.17 కోట్ల రుణమాఫీ చేశామని రైతుభీమా పథకం కింద ఇప్పటి వరకు 99,297 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4964.85 కోట్ల భీమా పరిహారం అందించామని రూ.5349 కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్దరణ చెయ్యడం జరిగిందని రూ.572 కోట్లతో 2601 రైతువేదికల నిర్మాణం చేపట్టడం జరిగిందని లక్ష 21 వేల కోట్లతో 671.22 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ చేశామని రూ.10,719 కోట్లతో ఇతర పంటల సేకరణ జరిగిందని రూ.1.59 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.

దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్దఎత్తున చేదోడు, వాదోడుగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ పథకాల మూలంగా సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి అని అన్నారు. ఒకప్పుడు ధీనంగా ఉన్న రైతన్న నేడు ఎవ్వరికీ బెదరకుండా గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాడు అని తెలిపారు.

Also Read: Minister Niranjan Reddy: రైతులను పచ్చి రొట్ట ఎరువుల వినియోగంపై నిరంతరం చైతన్యం చేయాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Rythu Bandhu Scheme

Rythu Bandhu Scheme

కష్టం చేసుకునే రైతు ఎంత కరంటు వాడినా, ఎంత భూమి సాగుచేసిన అడిగేవారు లేరని తెలంగాణ వ్యవసాయ పథకాల మూలంగా వచ్చిన మార్పేంటి ? సమాజానికి జరిగిన మేలేంటి ? అని మహారాష్ట్ర నుండి వచ్చిన బృందం అధ్యయనం చేస్తున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా ఇక్కడి సమాజంలో శాంతి నెలకొన్నది చెప్పారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న గొప్పగా బతికినప్పుడే సమాజం బాగుంటుందన్నదని ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆశా భావం వ్యక్తపరిచారు.

వ్యవసాయరంగం పట్ల కేంద్రం తిరోగమన విధానంలో ముందుకుసాగుతుంటే తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో పురోగమన విధానంలో ముందుకుపోతున్నదని అత్యధిక శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచన అని మంత్రి సగర్వంగా తెలిపారు. అందుకే అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీఅర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ముందుకుపోతున్నది వెల్లడించారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, జాతీయ నినాదం దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, మేధావులను, బుద్దిజీవులను ఆలోచింపచేస్తున్నది చెప్పారు.

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఅర్ఎస్ జెండా ఎగురుతుందని నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్న చరిత్ర బీజేపీది అని రాబోయే ఎన్నికల్లో ప్రజాగ్రహంలో దేశవ్యాప్తంగా బీజేపీ పతనం ఖాయమని మోడీ అనాలోచిత విధానాలు దేశాన్ని సంక్షోభం వైపు నెడుతున్నదని రైతులను, రైతుకు అండగా నిలిచే కేసీఆర్ పార్టీని కాపాడుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. కొన్ని నిర్ణయాలు సమాజంలో మార్పుకు ఎలా నాంది పలుకుతాయో తెలంగాణ ప్రభుత్వ పథకాలు దానికి నిదర్శనం అని మంత్రి చెప్పారు.

Also Read: Nano Urea: నానో యూరియాతో విప్లవాత్మక మార్పులు – ఫలితాలు

Leave Your Comments

Minister Niranjan Reddy: రైతులను పచ్చి రొట్ట ఎరువుల వినియోగంపై నిరంతరం చైతన్యం చేయాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Previous article

Minister Kakani Govardhan Reddy: వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులతో మంత్రి కాకాణి సమీక్ష 

Next article

You may also like