వార్తలు

Nano Urea: నానో యూరియాతో విప్లవాత్మక మార్పులు – ఫలితాలు

3
Nano Urea
Nano Urea

Nano Urea: గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కలోల్‌లో దేశంలోనే తొలి లిక్విడ్‌ నానో యూరియా ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. పేటెంట్‌ పొందిన ఉత్పత్తి దిగుమతి చేసుకున్న యూరియాను ప్రత్యామ్నాయం చేయడమే కాకుండా పొలాల్లో మెరుగైన ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. ఏడాదిలోపు ఏర్పాటైన మూడు యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి జరుగుతూనే ఉంది.

నానో యూరియా అంటే ఏమిటి..?
నానో యూరియా ఒక రసాయన నైట్రోజన్‌ ఎరువు, ఇది తెలుపు రంగులో ఉంటుంది. ఇది మొక్కలకు అవసరమైన ప్రధాన పోషకమైన నత్రజనిని కృత్రిమంగా అందిస్తుంది. పంట పోషకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నానోటెక్నాలజీని ఉపయోగించి లిక్విడ్‌ నానో యూరియాను ఉత్పత్తి చేస్తారు. ఈ నానో లిక్విడ్‌ యూరియా సంప్రదాయ యూరియా కంటే బాగా పనిచేస్తుంది. అంతేకాదు దాని అవసరాన్ని 50 శాతం తగ్గిస్తుంది. పంటపై 500 ఎంఎల్‌ సీసా ప్రభావం 45 కిలోల యూరియాకు సమానం.

సాంకేతికత ఎందుకు అభివృద్ధి చేశారంటే..?
నానో యూరియా పరిశోధన ట్రయల్స్‌లో పాల్గొన్న ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అగ్రోనమీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త ప్రవీణ్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ.. నత్రజని ఎరువుల మోతాదును తగ్గించే ప్రయత్నంలో సాంకేతికతను అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రభుత్వం నత్రజని కలిగిన ఎరువులపై సబ్సిడీని అందించడానికి భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతోంది. అందుకోసం మరింత సమర్థవంతమైన, దేశీయమైన వాటిని ఉత్పత్తి చేయాలనే యోచనలో ఉందని ఉపాధ్యాయ్‌ చెప్పారు.

Also Read: Precautions in Organic Farming:సేంద్రియ, సహజ వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు – రాజీలేని సూత్రాలు

ప్రయోగాల సమయంలో శాస్త్రవేత్తలు రెండు నానో యూరియా స్ప్రేలు సాంప్రదాయ యూరియా అవసరాన్ని 50 శాతం వరకు తగ్గించగలవని గమనించారు. ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో సమాచారం ప్రకారం. నానో యూరియా, యూరియాలోని ఒక కణం 55,000 చిన్న నానో యూరియా కణాలకు సమానం. నేరుగా మట్టికి బదులుగా ఆకులపై, ఈ చిన్న కణాలు నేరుగా మొక్కల కణానికి పంపిణీ చేయబడతాయి. తద్వారా కణాల లోపల నైట్రోజన్‌ విడుదల అవుతుంది. ఈ ప్రక్రియ నత్రజని వినియోగ సామర్థ్యాన్నిపెంచడమే కాకుండా పర్యావరణ అనుకూలమైనది అని  పేర్కొంది. టెక్నాలజీకి అతిపెద్ద సవాలు దేశంలోని రైతులు పెద్ద ఎత్తున దీనిని స్వీకరించడం.

Nano Urea

Nano Urea

నానో యూరియా, గ్రాన్యులర్‌ యూరియా ఎందుకు కాదు..? తగ్గిన ధర :
లిక్విడ్‌ నానో యూరియా రూ. 240 ధరతో సగం లీటర్‌ బాటిల్‌లో ఎలాంటి సబ్సిడీ లేకుండా వస్తుంది. దీనికి విరుద్ధంగా, భారీ సబ్సిడీ యూరియా 50 కిలోల బస్తాకు ఒక రైతు సుమారు రూ. 300 చెల్లిస్తాడు. దీనికి కేంద్రం రూ.3,500 ఖర్చవుతుంది.

వాడుకలో సౌలభ్యం :
గ్రాన్యులర్‌ యూరియా ఒక్కొక్కటి 50 కిలోల స్థూలమైన సంచులలో వస్తుంది, ఒక చిన్న బాటిల్‌ నానో యూరియా కూడా అదే ప్రయోజనాన్ని అందిస్తుంది. రైతులు కూడా దీనిని ఉపయోగించడం చాలా సులభం. ఒక ఎకరం పొలంలో రెండు స్ప్రేలకు ఒక 500 ఎంఎల్‌ నానో యూరియా బాటిల్‌ సరిపోతుంది. ఇప్పుడు 45 కిలోల యూరియా బస్తాను భుజంపై మోయడానికి బదులు 500 మి.లీ. నానో యూరియా బాటిల్‌ను రైతు సులభంగా తీసుకెళ్లవచ్చు.

లాజిస్టిక్‌, వేర్‌హౌసింగ్‌ ఖర్చులు :
అధిక బరువు,పెద్ద సంచులతో, ప్రస్తుతం యూరియా రవాణా, నిల్వకు వెళ్లే సరుకు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేసేటప్పుడు చిందటం వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.

మరింత సమర్థవంతమైనది : నానో యూరియా క్షేత్ర సామర్థ్యం దేశవ్యాప్తంగా 11,000 మంది రైతు క్షేత్ర పరీక్షల ద్వారా పరిశోధనా సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ధృవీకరించినట్లు  తెలిపింది. వాస్తవానికి, మొక్కల నత్రజని వినియోగ సామర్థ్యం పరంగా, సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా ఉత్తమం. గ్రాన్యులర్‌ యూరియాను ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. పొలంలో చల్లిన యూరియా ఒక మొక్క ద్వారా 50 శాతం మాత్రమే నానుతుంది. మిగిలినవి మట్టిలోకి వెళ్తుంది.

ఉత్పాదకత పెంపుదల :
నానో ఎరువుల వాడకం మెరుగైన నేల ఆరోగ్యం, గాలి, నీరు పరంగా తగిన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది పంటల ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Also Read: Summer Plant Care: వేసవిలో పెంచుకునే మొక్కలు మరియు జాగ్రత్తలు

Leave Your Comments

Precautions in Organic Farming:సేంద్రియ, సహజ వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు – రాజీలేని సూత్రాలు

Previous article

Minister Niranjan Reddy: రైతులను పచ్చి రొట్ట ఎరువుల వినియోగంపై నిరంతరం చైతన్యం చేయాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like