May Gardening To-Do List – పండ్ల తోటలు: మామిడి కాయకోతకు 30`40 రోజులకు ముందు నీరు పెట్టడం ఆపితే కాయ నాణ్యత పెరుగుతుంది. అభివృద్ధిపరచిన కోత పరికరాలను ఉపయోగించి చల్లటి వేళల్లో మాత్రమే కాయల్ని కోయాలి. కాయలను 5`7 సెం.మీ. తొడిమతో కోసి పూర్తిగా సొన కారేవరకు తల క్రిందులుగా వుంచి కాయలకు సొన అంటకుండా జాగ్రత్తపడాలి. కాయసైజు మరియు బరువును బట్టి గ్రేడిరగ్ చేసుకొని అట్టపెట్టెలలో (జ.ఖీ.దీ. పశీఞవం) తగినంత కాగితపు ముక్కలను ఒత్తుగా వేసి ప్యాకింగ్ చేసుకోవలెను. దూర ప్రాంత రవాణా కొరకు కాయలను కోసిన 10 గంటల లోపల శీతల గిడ్డంగులలో (12.50 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80`90% తేమ వద్ద) నిల్వ ఉంచాలి. కాయకోత అనంతరం చెట్టుకు 15 రోజులు విశ్రాంతి ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టాలి.
అరటి నాటుటకు ముందు భూమిని 30 – 40 సెం.మీ. లోతుగా దున్నాలి. తోటలలో తొలకరి వర్షాలకు గొర్రుతో 3`4 సార్లు మెత్తగా దున్నాలి.
జామలో చెట్లను బెట్టకు గురిచేయడం ద్వారా చెట్లు ఆకులను రాలుస్తాయి. ఎండిన, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను మరియు కాపు కాసిన రెమ్మల చివర్లను (5`6 సెం.మీ.) కత్తిరించాలి.
ద్రాక్షకు వేసవి కత్తిరింపుల తర్వాత 9వ ఆకు ఏర్పడిన దశలో కొమ్మల కొనలను గిల్లడం ద్వారా పిల్ల కొమ్మ (సబ్‌కేన్) ల అభివృద్ధి జరుగుతుంది. ఎకరానికి 20 కిలోల నత్రజనితోపాటు కత్తిరించిన 30`60 రోజులలో సిఫారసు చేసిన 50 పిపియమ్ యురాసిల్ స్ప్రే చేయడం వలన పూమొగ్గలు ఏర్పడడానికి దోహదపడుతుంది. క్రొత్త చిగుర్లలో పక్షికన్ను తెగులు సోకకుండా కార్బెండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 7 రోజుల వ్యవధిలో 3`4 సార్లు పిచికారి చేయవలెను.
సపోటాలో అవసరాన్ని బట్టి ముదురు తోటలకు నీటి తడులు ఇవ్వాలి. తయారైన కాయలను ఉదయం వేళ చల్లగా ఉన్న సమయంలో తొడిమతో సహా కోయాలి. తయారైన కాయలపై ఉన్న పొడి వంటి పదార్ధం రాలిపోయి కాయలు బంగాళాదుంపలాగా కనపడతాయి.
పనసలో అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. కళ్ళు పూర్తిగా విచ్చుకొని లేత పసుపు పచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోయాలి. కాయలను కోసిన తరువాత ఎండిన రెమ్మలను తీసి వేసి కాండం మీద వెలుతురు పడే విధంగా చేసుకొని, కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును (3 గ్రా./లీ.కి) పిచికారి చేసుకోవాలి.
దానిమ్మలో మొక్కలలో కత్తిరింపులు చేయడం, పాదుల తవ్వకం మరియు ఎరువులు వేయడం లాంటివి చేయకుండ విశ్రాంతి నివ్వాలి. బ్యాక్టీరియా తెగులును అదుపులో ఉంచడానికి 1% బోర్డోమిశ్రమమును 20 రోజుల వ్యవధిలో 2`3 సార్లు పిచికారి చేయాలి.
రేగులో కొమ్మలు కత్తిరించి తోట బయటకు చేర్చి కాల్చి వేయాలి. కత్తిరింపులు అయిన వెంటనే 1% బోర్డోమిశ్రమం లేదా 0.3% కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారి చేయాలి. చెట్టు పాదు దగ్గర మట్టిని తిరగ త్రవ్వినట్లైతే నిద్రావస్థ దశలో ఉన్న కాయ తొలుచు పురుగును నాశనం చేయవచ్చు.
నిమ్మలో అధిక ఉష్ణోగ్రతలు (గ420సి) తట్టుకోవడానికి 5`10గ్రా. సున్నాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకొని, 15 రోజుల తర్వాత 10 గ్రా. యూరియా లేదా పొటాషియం నైట్రేటును 1లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. కొమ్మ కత్తిరింపులు చేయడానికి అనువైన సమయం. డబుల్ రింగు పద్ధతి లేక డ్రిప్ పద్ధతిలో నీటిని అందించాలి.
బొప్పాయిలో ప్రతి మొక్కకి (5 నెలల మొక్క) రోజుకు 25`30 లీటర్లు నీరు అందేలాగా డ్రిప్‌ను అమర్చుకోవాలి. సూక్ష్మపోషక లోపాలను సవరించుకోవాలి.
1.5 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 80 గ్రా. ఎస్.ఎస్.పి., 150 గ్రా. ఎం.ఓ.పి. ఒక్కో మొక్కకు వేయాలి. మొక్క నుండి 30 సెం.మీ. లోపు ఉన్న మట్టిని చెట్టు కాండం దగ్గర ఎగతోయాలి. వచ్చే వర్షాకాలంలో నీరు కాండాన్ని తాకరాదు.
వాతావరణంలో ఉష్ణోగ్రతలు మరియు గాలిలో తేమ శాతం పెరిగేకొద్దీ ఆకుముడత తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పొలంలో తెల్లదోమ ఉధృతిని గమనించడానికి పసుపు రంగు జిగురు పూసిన కార్డులను ఎకరాకు 15 చొప్పున, మూడు అడుగుల ఎత్తులో అమర్చాలి. తెల్లదోమ ఉధృతిని గమనించిన వెంటనే ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మి.లీ./లీటరు లేదా డయాఫెన్‌థ్యూరాన్ 1గ్రా./లీటరు నీటికి కలిపి మొక్కలపైన పిచికారి చేసుకోవడం వల్ల తెల్లదోమ నుంచి మొక్కలను కాపాడుకోవచ్చును.
Also Read: Healthy Ragi Recipes: రాగి పిండితో ఆరోగ్యకరమైన వంటలు – వాటి తయారీ విధానం
కూరగాయ పంటలు:
తీగ జాతి కూరగాయలు పాకడానికి వీలుగా పందిర్లను వేసుకోవాలి. వేసవి దుక్కులు లోతుగా చేసుకొని నేలలో దాగి ఉన్న పురుగుల యొక్క కోశస్థ దశలు చనిపోయే విధంగా చేసుకోవాలి. కలుపు ఎక్కువగా ఉండే భూములలో మొదటి దఫా తడి పెట్టిన తరువాత హెక్టారుకు పెండిమిథాలిన్ లేదా ప్లూక్లోరాలిన్ 2.5 లీటర్ల మందును 500 లీటర్ల నీటిలో కలిపి తేమగా ఉన్న నేలపై పిచికారి చేసి వెడల్పాటి ఆకులు కలిగిన కలుపు మొలకెత్తకుండా అరికట్టవచ్చును.
పెండలం, చేమ దుంపలకు వేసవిలో భూమిని 30`40 సెం.మీ. లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు 3`4 సార్లు గొర్రుతో మెత్తగా దుక్కిచేయాలి.
కందకు వేసవిలో భూమిని 30`40 సెం.మీ. లోతుగా దుక్కి దున్నాలి. తొలకరి వర్షాలకు 2`3 సార్లు మెత్తగా దుక్కి చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు మరియు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేటును వేసి కలియదున్నాలి. రెండు నుంచి మూడు నెలలు నీడలో బాగా ఆరి, 300`500 గ్రా. బరువున్న దుంపలను విత్తనంగా వాడాలి. ఎకరానికి 3.5 నుండి 5.5 టన్నుల విత్తనం వాడాలి. విత్తన దుంపలను 10 లీటర్ల నీటికి 50 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 25 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 ని॥ ముంచి తీసి నీడలో ఆరబెట్టి వెంటనే నాటాలి. విత్తన దుంపలను 60I60 సెం.మీ. దూరంలో 2I2 1/2 అంగుళాల లోతులో నాటి వెంటనే తడి ఇవ్వాలి. తడి ఇచ్చిన వెంటనే ఎకరాకు 2.0 లీ. బుటాక్లోర్ లేదా లీటరు పెండిమిథాలిన్ కలుపు మందును 200 లీ. నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి.
నాణ్యమైన ఉల్లి విత్తనాన్ని ఖరీఫ్ సాగుకు అనువైన రకాలైన అగ్రిఫౌండ్ డార్క్‌రెడ్, బళ్ళారి రెడ్, నాసిక్ రెడ్ మరియు అర్క కళ్యాణ్ రకాలను ఎన్నుకోవాలి.
పూలతోటలు:
క్రొత్తగా పూల తోటలు వేయుటకుగాను వేసవిలో లోతుగా దుక్కులు చేయాలి.
గులాబిలో ఎండిన కొమ్మలను కత్తిరించి బోర్డో పేస్టు పూయాలి. వీలైనంత వరకు నీరు ఇవ్వాలి.
క్రొత్తగా నాటిన కనకాంబరం తోటల్లో నులిపురుగుల నివారణకు కార్బోఫ్యూరాన్ (3G) గుళికలు ఎకరానికి 6 కిలోల చొప్పున భూమిలో వేయాలి.
తోటపంటలు:
కొత్తగా కొబ్బరి మొక్కలు నాటుటకు 1 I 1 I 1 మీ. గోతిని తీసి మొక్కల మధ్య దూరం 8I8 మీ.ఉండునట్లు నాటుకోవాలి. వారం రోజుల కొకసారి చెట్టుకు నీరు పెట్టాలి. కొబ్బరి తోటలో పెరిగిన పచ్చి రొట్టను కోసి పళ్ళెంలో వేసుకోవాలి. కాయ దింపు తీయాలి. కొబ్బరిపై ఆశించు నల్లి, ఆకుతేలు, గానోడెర్మా తెగులు మరియు నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి.
ఇరియోఫిడ్ నల్లి యాజమాన్యము: నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలను, కాయలను ఏరి నాశనము చేయవలెను. వేపపిండి 5`10 కిలోలు/చెట్టుకు/సంవత్సరమునకు వేయవలెను. వేపపిండితో పాటు ఇతర సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు విరివిగా వాడవలెను. సారవంతమైన భూములలో అరటి, కంద, కోకో, పసుపు లేక కూరగాయలు వంటి అంతరపంటలు పండిరచుట ద్వారా నల్లి తాకిడిని తగ్గించవచ్చును. వేప నూనె (అజాడిరక్టిన్’ 10000 పిపియమ్.) 5 మి.లీ./లీటరు నీటికి చొప్పున కలిపి గెలలపై పిచికారి చేయవలెను (లేక) 10 మి.లీ. మందు G 10 మి.లీ. నీరు/చెట్టుకు చొప్పున వేరు ద్వారా ఎక్కించవలెను. ఈ విధముగా ఒక సంవత్సరములో మూడు సార్లు పెట్టవలెను.
ఆకుతేలు యాజమాన్యము: పురుగు గొంగళిపురుగు దశలో ఉన్నప్పుడు, పిడియోబియాస్ ఇంబ్రియస్ బదలికలను చెట్టుకు 60 చొప్పున 15 రోజులకొకసారి విడుదల చేసుకోవాలి. క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% ూజ మందును 0.3 మి.లీ./లీటరు చొప్పున పిచికారి చేయాలి. ఇంకా పురుగు తీవ్రత తగ్గకపోతే ద్‌ీ 5 గ్రా/లీటర్ చొప్పున పిచికారి చేయాలి
గానోడెర్మా తెగులు యాజమాన్యము: గానోడెర్మా తెగులు ఉన్న నేలల్లో ప్రతి సంవత్సరము చెట్టుకు 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి వేయాలి. ఈ ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని ఖచ్చితముగా వేపపిండితో కలిపి వేయవలెను. కొబ్బరి తోటలో ఏ ఒక్క చెట్టుపై గానోడెర్మా తెగులు లక్షణాలు కనిపించినా, ఆ తోటలోని అన్ని చెట్లకు పైన వివరించిన విధముగా చర్యలు చేపట్టవలయును.
నల్ల మచ్చ తెగులు యాజమాన్యము: కొబ్బరి చెట్టు కాండముపై ఎటువంటి గాయము కలిగించరాదు. ఈ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆ భాగముపై ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రపు పొడిని పేస్ట్‌గా తయారుచేసి పూయవలెను (50 గ్రా. పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్ తయారగును).
కర్రపెండలం`వేసవిలో భూమిని 30`35 సెం.మీ. లోతుగా దుక్కిదున్నాలి. తొలకరి వర్షాలకు 2`3 సార్లు మెత్తగా దుక్కి చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌ను వేసి కలియదున్నాలి.
తమలపాకు మొదటి సంవత్సరం తోటలలో భూమిని బాగా దున్ని దుక్కిలో ఎకరాకు 40 బండ్ల పశువుల ఎరువు, 40 కిలోల భాస్వరం మరియు 40 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. జీవన ఎరువులైన అజోస్పైరిల్లమ్ మరియు ఫాస్పో బాక్టీరియాలను ఎకరానికి 2 కిలోల అవిశ విత్తనాలను వేసే ముందు పొలంలో చల్లుకోవాలి. హోక్టారుకు 40`50 కిలోల అవిశ విత్తనాలను సాలుకు సాలుకు మధ్య ఒక మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. అవిశ విత్తనాలను ఉత్తరం నుండి దక్షిణం దిక్కుకు మాత్రమే విత్తాలి. తొలి దశలో అవిశ మొక్కలను ఆశించు చిత్త పురుగుల నివారణకు క్లోరోపైరిఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రెండవ సంవత్సరపు తోటల్లో వేసవిలో తోటలోనికి వేడిగాలులు రాకుండా అధిక సూర్యరశ్మి నుండి కాపాడటానికి తోట చుట్టూ దడులు కట్టాలి.
జీడిమామిడిలో మల్చింగ్ పద్ధతి పాటించి నేల తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవాలి. వర్షాధారపు జీడి తోటలు, కొండ వాలులో సాగు చేస్తున్న తోటలలో వాలుకు అడ్డుగా చెట్టుకు పై భాగాన కందకాలను త్రవ్వుకొని నీరు నిలిచేటట్లు చేసుకోవాలి. నీరు నిలిచే విధంగా మొక్క చుట్టూ పాదులు చేసుకోవాలి.
సుగంధద్రవ్య పంటలు:
మిరప: వేసవిలో పొలాన్ని లోతుగా దుక్కి చేసి, చెత్త చెదారాన్ని ఏరి కాల్చివేయాలి. సిఫారసు మేరకు ఎంపిక చేసుకున్న రకాల విత్తనాలను సేకరించుకోవాలి.
అల్లములో చేతితో ఒకసారి కలుపు తీయించాలి. మురుగు నీటి కాలువలు సరిచేసుకోవాలి. రెండవ సారి సేంద్రియ ఎరువులు వేసుకోవచ్చు (నాటిన 40 రోజుల తరువాత). ఎరువు వేసుకున్న తదుపరి మొక్కల మొదళ్ళ దగ్గర మట్టి ఎగదోసుకోవాలి. డైమిథోయేట్ 0.05% (167 మి.లీ./100 లీ. నీటిలో)తో పిచికారి చేసి కాండము తొలుచు పురుగును నివారించుకోవాలి. దుంపకుళ్ళు సోకిన మొక్కలు పెరికివేసి నాశనం చేయాలి. మళ్ళను 0.3% మాంకోజెబ్ లేదా 0.3% కాపర్‌ఆక్సీక్లోరైడ్‌తో తడిపి శుద్ధి చేసుకోవాలి.
పసుపు పంటకు వేసవిలో భూమిని లోతుగా దుక్కి దున్నాలి. తొలకరి వర్షాలకు 2`3 సార్లు మెత్తగా దుక్కి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 188 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. స్వల్పకాలిక రకాలైన కస్తూరి, సుగుణ, సుదర్శన వంటి రకాలను మే నెల చివరిలో నాటుకోవాలి.
ఔషధ మరియు సుగంధ పంటలు: ఎకరానికి 2 కిలోల చొప్పున పామరోజా విత్తనాన్ని ముందు రోజు రాత్రి తడి ఇసుకతో కలిపి మూట కట్టి ఉంచి మరుసటి రోజు నారుమళ్ళలో విత్తుకోవాలి.
కలబంద పంటకు నేలను బాగా కలియదున్ని ఎకరాకు సుమారు 5 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేయాలి. దీనితో పాటుగా 20 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ వేసుకోవాలి. వర్మీ కంపోస్టును 2 టన్నులు/ఎకరాకు వేసినప్పుడు అధిక దిగుబడి వచ్చును. అజోస్పైరిల్లం కూడా వాడుకోవచ్చును.
నిమ్మగడ్డి పిలకలు నాటుటకు పొలం బాగా దున్ని, ఎకరాకు ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్పేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
అశ్వగంధ పంట వేర్లను నీటితో శుభ్రంగా కడిగి 7`10 సెం.మీ. పొడవు గల ముక్కలుగా కత్తిరించి నీడలో ఆరబెట్టాలి. ఎండిన తరువాత ప్రక్కన ఉన్న పిల్ల వేర్లను మరియు వేరు పైభాగాన ఉన్న కాండం మొదలును కత్తిరించాలి. ఎండిన వేర్లను పౌడరుగా చేసుకొని మార్కెట్ చేసుకోవాలి. 7 సెం.మీ. పొడవు కన్నా ఎక్కువ ఉండి 11.50 సెం.మీ. మందంగా, గుండ్రంగా ఉన్న వేర్లను ‘‘ఎ’’ గ్రేడ్ క్రింద వేయాలి. పొలం బాగా దున్నుకొని ఆఖరి దుక్కిలో ఎకరాకు 4`5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ వేసుకోవాలి.
పిప్పలిని కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. 5 కణుపులున్న ముక్కలను పాలీథీన్ సంచుల్లో నాటుకొని వేర్లు వచ్చిన తరువాత వీలైనంత వరకు వర్షాకాలంలో నాటుకోవాలి. ఎకరానికి సుమారు 11,000 మొక్కలు (60I60 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి) అవసరం. ఏక పంటగా సాగు చేసే యెడల త్వరగా పెరిగి నీడనిచ్చే చెట్లను 4`5 నెలలు ముందుగా నాటితే మంచి నీడ మరియు ఆధారం దొరుకుతుంది. నాటిన తొలి రోజుల్లో వర్షం లేకపోతే వారానికొకసారి నీరు పెట్టాలి. బాగా ఎదిగిన తరువాత 10 రోజులకొకసారి నీరు పెట్టాలి.