తెలంగాణ

Minister Niranjan Reddy: తెలంగాణ మొక్కజొన్న రైతులకు శుభవార్త.!

2
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: తెలంగాణ మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. తెలంగాణ వ్యాప్తంగా యాసంగిలో పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Biogas Production: వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ.!

తెలంగాణ వ్యాప్తంగా రైతులు యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు. దీన్ని బట్టి చూస్తే 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు.

Maize Crop

Maize Crop

Also Read: Nelavemu Farming: ఆయుర్వేద మొక్క నేలవేము సాగు.!

తెలంగాణ ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్నకు రూ.1962 గా ప్రభుత్వ మద్దతుధరను నిర్ణయించింది. ఈ మేరకు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

Also Read: AI and Bioengineering: వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు, బయో ఇంజినీరింగ్ ల పాత్ర.!

Leave Your Comments

AI and Bioengineering: వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు, బయో ఇంజినీరింగ్ ల పాత్ర.!

Previous article

Silver Date Palm: వేసవి కాలంలో ఈత పళ్ళను అస్సలు మిస్ కాకూడదు! ఎందుకో తెలుసా?

Next article

You may also like