తెలంగాణ

Mamnoor Kisan Mela 2023: మామునూరు కెవికె ఆధ్వర్యంలో కిసాన్‌ మేళ.!

2
Mamnoor KVK Conducted Kisan Mela
Mamnoor KVK Conducted Kisan Mela

Mamnoor Kisan Mela 2023: పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, జాతీయ మాంసాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌, మరియు పసంవర్ధక శాఖ ములుగు జిల్లా సహకారంతో కెవికె ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రాజన్న అధ్యక్షతన మల్లంపల్లిలో కిసాన్‌ మేళ నిర్వహించడం జరిగింది. ఈ కిసాన్‌ మేళకు ములుగు జిల్లా అదనపు జిల్లా కలెక్టర్‌ గణేష్‌ గారు ముఖ్య అతిథిగా, డాక్టర్‌ షేక్‌ మీరా, సంచాలకులు అటారి, పదవ జోన్‌ హైదరాబాద్‌ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తర్వాత చూడి పశువుల పోషణలో మెళకువలు మరియు స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనే కరదీపికను అతిథులు విడుదల చేయడం జరిగింది. కిసాన్‌ మేళకు ముందుగా జాకారం గ్రామంలో పశువైద్య శిబిరాన్ని కెవికె ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రాజన్న ప్రారంభించారు. ఇందులో సుమారుగా 51 పశువులకు గర్భకోశ వ్యాధులకు శిక్ష నిర్వహించడం జరిగింది.

శ్రీ గణేష్‌ గారు మాట్లాడుతూ ములుగు జిల్లాలో పాడి పరిశ్రమకు చాలా అవకాశాలు ఉన్నాయని రైతులు, శాస్త్రవేత్తలు సూచించిన ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించాలని మరియు మహిళా రైతులు ఈ పెరటి కోళ్లలో అనువైనటువంటి రాజశ్రీ కోళ్ల పెంపకం పైన శ్రద్ధ చూపాలని అన్నారు.

Also Read: Soybean Pest Management: రబీ సోయా చిక్కుడులో ఆశించిన తెగుళ్ళు నివారణ

Mamnoor Kisan Mela 2023

Mamnoor Kisan Mela 2023

డాక్టర్‌ షేక్‌ మీరా, సంచాలకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్నటువంటి ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులు శ్రద్ధ చూపాలని తెలియజేశారు. కె వి కే శాస్త్రవేత్తలు ములుగు జిల్లాల్లో 4500 రాజశ్రీ కోళ్లను పంపిణీ చేశారు ఇవి దేశవాళీ కోళ్ల కన్నా అదనంగా గుడ్లను ఇస్తాయని తెలియజేశారు, అదేవిధంగా ఈ జిల్లాలో చేపల పెంపకానికి చాలా స్కోప్‌ ఉంది కాబట్టి రైతులని చేపల పెంపకం వైపు మళ్ళించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వము సుమారుగా 120 నూతన కెవికెలను ఏర్పాటు చేయబోతుందని అందులో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలానికి రెండు నుంచి మూడు కె.వి.కెలు రావడానికి ఆస్కారం ఉందని తెలియజేశారు. అదేవిధంగా ములుగు జిల్లాలో రాబోయే రోజుల్లో గిరిజన ఉపప్రణాలకి కింద గుర్తించి నిధులు సాంక్షన్‌ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు

డాక్టర్‌ మల్ల మహేందర్‌ విస్తరణ సంచాలకులు రైతులు కెవికె సేవల వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లాలో శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి సేవలు స్లాగనీయమని కొనియాడారు. డాక్టర్‌ విజయభాస్కర్‌ అసమర్ధక శాఖసంయుక్త సంచాలకులు మాట్లాడుతూ కేవీకే ద్వారా జగ్గన్నపేట పులిగుండం పోట్లాపూర్‌, చిట్యాల మరియుబండారుపల్లిలో పెరటి కోళ్లు పెరటిలో పెంచుకునేటువంటి కోళ్లను పంపిణీ చేయడం జరిగిందని అవి ఇప్పుడు గుడ్లు కూడా పెడుతున్నాయని తెలియజేశారు.

కిసాన్‌ మేళలో ప్రదర్శనకు పెట్టినటువంటి నెల్లూరు గొర్రె పొట్టేలు, రాజశ్రీ కోళ్లు మరియు కె.వికే వారు పెట్టినటువంటి వివిధ రకాలైన పశుగ్రాసాలు రైతులను విపరీతంగా ఆకర్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ మాంసాభివృద్ధి సంచాలకులు డాక్టర్‌ బార్‌ బుద్దే, డాక్టర్‌ బసవ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ కుమారస్వామి, శాస్త్రవేత్తలు అరుణ జ్యోతి సౌమ్య, హనుమంతరావు, సంవర్ధక సహాయ సంచాలకులు కరుణాకర్‌, రవీందర్‌, వెంకటేష్‌, స్థానిక పశువైద్యాధికారి శ్రీధర్‌ రెడ్డి డాక్టర్‌ నరసింహ, డాక్టర్‌ నవత ములుగు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

Also Read: Red Rice Benefits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎర్ర బియ్యం గురించి తెలుసా?

Leave Your Comments

Soybean Pest Management: రబీ సోయా చిక్కుడులో ఆశించిన తెగుళ్ళు నివారణ

Previous article

Raja Varaprasad: రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్.!

Next article

You may also like