Soybean Pest Management: సోయా చిక్కుడు పప్పు జాతి మరియు నూనె గింజల పంట. ఈ పంటలో ప్రొటీన్లు 30% శాతం మరియు నూనె 20% శాతం ఉంటుంది. రాష్ట్రంలో సోయా చిక్కుడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సారవంతమైన నల్లరేగడి, బలమైన మధ్యస్ధ నేలలో వానాకాల పంటగా సాగు చేస్తారు.
ఈ మధ్యకాలంలో నాణ్యమైన విత్తనోత్పత్తికై సోయా చిక్కుడు సాగు రబీకాలంలో చేపట్టడం జరుగుతున్నది. పూత మరియు కాయదశలో సోయా చిక్కుడులో ప్రధానంగా ఆశించే తెగుళ్ళును చూసినట్లయితే, సర్కోస్పోరా ఆకు మచ్చతెగులు, ఆంత్రక్నోస్ ఆకుమచ్చ తెగులు మరియు మొవ్వ కుళ్ళు తెగులు ముఖ్యమైనది.
ఆకాశం మేఘావర్ణమైనప్పుడు మబ్బులతో కూడిన వర్షం ఉన్నప్పుడు ఈ ఆకు మచ్చతెగుళ్ళు వచ్చే ఆవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ తెగుళ్ళు గాలి ద్వారా ఎక్కువగా వ్యాపిస్తాయి.
సర్కోస్పోరా ఆకు మచ్చతెగులు :
ఆకులపై లేత ఎరుపు ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత క్రమంలో ఆకు యొక్క అంచుల నుండి లోపల భాగాల్లోకి వ్యాప్తి చెంది ముదురు రంగుకి మారి ఆకు యొక్క పై భాగాన్ని అంతటా వ్యాపిస్తాయి. ఆకుల సముదాయం ముదురు, ఎరుపు ఊదా రంగు వర్ణం సంతరించుకుంటాయి. మొక్కపై భాగాన ఉన్న కాయలపై గుండ్రని, ఎరుపు ముదురు రంగు మచ్చలు కనిపిస్తాయి. తెగులు ఆశించిన విత్తనాలపై ఎరుపు ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి.
Also Read: Red Rice Benefits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎర్ర బియ్యం గురించి తెలుసా?
ఆంత్రక్నోస్ ఆకు మచ్చతెగులు :
వలయకారపు గోధుమ రంగు మచ్చలు ఆకులపై ఏర్పడి అనుకూల వాతావరణంలో మచ్చలు కలిసిపోయి ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. ఈ ఆకు మచ్చతెగులు కాయలపై కూడ గోధుమ రంగు వలయకారపు మచ్చలు ఏర్పడి, గింజ/విత్తనం యొక్క నాణ్యతను కోల్పోతాయి. ఈ ఆకు మచ్చ తెగులు నివారణకై మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బండజిమ్ 1 గ్రా. లేదా క్లోరాంధ్రానిలిప్రోల్ 2 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను.
మొవ్వ కుళ్ళు తెగుళ్ళు :
వాతావరణంలో బెట్ట పరిస్థితులు నెలకున్నప్పుడు ఈ తెగులు ఆశించు అవకాశం ఎక్కువగా ఉంటుంది. తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు లేత మొక్కలలో ఆకులను చిన్నగా చేసి గిడసబారి పోతాయి. తరువాత క్రమంలో మొక్క యొక్క మొగ్గ ఎండిపోవడం జరుగుతుంది. ఈ తెగులు వ్యాప్తికారకాలjైున పురుగుల నివారణకై లీటరు నీటికి మోనోక్రొటోఫాస్ 1. 6 మీ . లీ లేదా డైమిథోయేట్ 2 మి. లీ కి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Okra Cultivation: బెండలో ఎరువులు మరియు నీటి యాజమాన్యం.!