Okra Cultivation: బెండను మనదేశంలో వ్యాపార సరళిలో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పండిస్తున్నారు. భారతదేశంలో 5,33,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడి హెక్టారుకు 11.9 టన్నుల సగటు దిగుబడితో మొత్తం 63,46,000 టన్నుల దిగుబడి వస్తుంది.
ఎరువుల యాజమాన్యం :
చివరి దుక్కిలో ఎకరాకు 5-1 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 20 కిలోల భాస్వరం మరియు ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. హైబ్రీడ్ వేసుకుంటే రసాయనిక ఎరువులు 50 శాతం పెంచి వేసుకోవాలి.48 కిలోల నిచ్చే నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి, ఒక వంతును ఆఖరి దుక్కిలో మిగిలిన రెండు భాగాలు విత్తిన 30వ, 45వ రోజున వేసి నీరు పారించాలి. హైబ్రీడ్ 25% నత్రజని ఎక్కువగా వేసుకోవాలి. అంటే ఎకరాకు 60 కిలోల నత్రజని వేసుకోవాలి.
Also Read: Pests of Papaya: బొప్పాయిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం.!
జీవన ఎరువులు :
ఎకరాకు 2 కిలోలు అజటోబాక్టరు 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి, నీళ్ళు చల్లుతూ 7-10 రోజులు మాగనిచ్చి, తర్వాత ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. దీనితో పాటుగా ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబాక్టీరియా (పి.యస్.బి.)ను కూడా పొలం అంతా నమంగా చల్లుకోవాలి. ఈ జీవన ఎరువులు వేసుకున్నప్పుడు సిఫార్సు చేసిన దానిలో 75% నత్రజని భాస్వరం, పూర్తిగా పొటాష్ వేసుకుంటే సరిపోతుంది.
నీటి యాజమాన్యం:
గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తర్వాత 4-5 రోజులకు రెండవసారి నీరు పారించాలి. వానాకాలం పంటకు సకాలంలో వర్షాలు కురవకుంటే. భూమిలో తేమను బట్టి నీరు పారించాలి. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు పెట్టాలి.
Also Read: Minimum Support Price: 40 కోట్ల మంది రైతులకు కనీస మద్దతు ధర పెంచనున్న కేంద్ర ప్రభుత్వం