ఆరోగ్యం / జీవన విధానం

విరిగి కాయల ప్రయోజనాలు ..

0

విరిగి కాయల చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయల చెట్టు, బంకీర్ కాయల చెట్టు ఇలా రకరకాలుగా, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఏ ప్రాంతంలో ఎలా పిలిచినప్పటికీ వీటి ప్రయోజనం మాత్రం సమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్కెర చెట్టు అనేది బోరాగినిస్ అనే కుటుంబానికి చెందింది. దీనిని ఇంగ్లీషులో లాసోరా గంబేరి. ఇండియన్ చెర్రీ అనే పేర్లతో పిలుస్తుంటారు. చుట్టూ దాదాపు మూడు నుండి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరిగి,వీటి కొమ్మలు అన్ని దిశలలో వ్యాపించి, కొంచెం వంగిపోయి, విశాలంగా పెరుగుతూ కనిపిస్తాయి. ఈ చెట్టుని మన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు యొక్క ఆకులు, పండ్లు, పై బెరడు, విత్తనాలు ఇలా అన్నింటిలో యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, ఫాస్ఫరస్ ఇలా ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ పండ్లు ఎర్రగా మాగిన తరువాత తినడం వల్ల పూత సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా శరీరానికి చలువను కూడా చేస్తుంది.
ఈ పండ్లు తినడం మూలంగా మన రక్తంలోని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ద్వారా నక్కెర పండ్లకు డయాబెటిస్ ను కంట్రోల్ చేయగల శక్తి ఉంది. వీటిని తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉంటుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సుఖ విరేచనం కూడా అవుతుంది. ఈ చెట్టు యొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో మందులుగా ఉపయోగించేవారు. చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ చెట్టు యొక్క బెరడు ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో తడిపి చర్మంపై అప్లై చేస్తూ ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా దురద ఎక్కువ అయినప్పుడు ఈ చెట్టు యొక్క విత్తనాలను మెత్తటి పేస్ట్ లా చేసుకొని దురద వున్న ప్రాంతాల్లో అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

Leave Your Comments

బిందు పద్ధతిలో పంటల సాగు..

Previous article

రంగు రంగుల క్యాలీఫ్లవర్ పంటల సాగు..లాభదాయకం

Next article

You may also like