జాతీయంరైతులు

Baroda Kisan Credit Card (BAHFKCC) Scheme: బరోడా పశు సంవర్ధక మరియు మత్స్య కిసాన్ క్రెడిట్ కార్డ్ (BAHFKCC) పథకం

1
Baroda Kisan Credit Card (BAHFKCC) Scheme
Baroda Kisan Credit Card (BAHFKCC) Scheme

Baroda Kisan Credit Card (BAHFKCC) Scheme: బ్యాంకు ఆఫ్ బరోడా రైతులకు వివిధ రకాలైన లోన్లను అందిస్తుంది, అందులో ఒకటే ఈ బరోడా పశు సంవర్ధక మరియు మత్స్య కిసాన్ క్రెడిట్ కార్డ్ (BAHFKCC) పథకం. ఈ లోన్ పశుసంవర్ధక మరియు మత్స్య పరిశ్రమకు సంబంధించిన రైతులకు తగిన మరియు సకాలంలో రుణ సహాయాన్ని అందించడం మరియు జంతువులు, పక్షులు, చేపలు, రొయ్యలు, ఇతర జలచరాల పెంపకం మరియు చేపలను పట్టుకోవడం వంటి పశుసంవర్ధక మరియు మత్స్య పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే రైతుల స్వల్పకాలిక & దీర్ఘకాలిక క్రెడిట్ అవసరాలను తీర్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

లాభాలు:

రూ. 3.00 లక్షల వరకు మొత్తం రుణానికి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు.

రూ.2.00 లక్షల ఇన్‌బిల్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌తో రూ. 3.00 లక్షల వరకు మొత్తం రుణం కోసం రుపే డెబిట్ కార్డ్‌కు ఎటువంటి తనిఖీ ఛార్జీలు వర్తించవు.

రుణం తిరిగి చెల్లించే గడువు తేదీ వరకు సాధారణ వడ్డీ వర్తించబడుతుంది.

రూ. 25000.00 పరిమితి వరకు ఎలాంటి జరిమానా వడ్డీ విధించబడదు.

ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా రూ. 50000.00 వరకు పొందవచ్చు.

సకాలంలో తిరిగి చెల్లించే రుణగ్రహీతలకు రూ. 2.00 లక్షల వరకు రుణాలకు సంవత్సరానికి 3% తక్షణ రీపేమెంట్ ప్రోత్సాహకం ఉంటుంది.

మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) కింద రూ. 10.00 లక్షల వరకు రుణాలకు క్రెడిట్ గ్యారెంటీ అందుబాటులో ఉంది.

Also Read: Ashoka Tree Uses: ఆడవాళ్లలో ఈ సమస్యలను తరిమికొట్టే అశోక చెట్టు గురించి మీకు తెలుసా?

Baroda Kisan Credit Card (BAHFKCC) Scheme

Baroda Kisan Credit Card (BAHFKCC) Scheme

అర్హత ప్రమాణాలు:

పాడి జంతువులు/గొర్రెలు/మేకలు/ పందులు/కుందేలు/కోళ్ల పక్షులను పెంచుతున్న రైతులు మరియు స్వంతంగా/అద్దెకు/లీజుకు తీసుకున్న షెడ్‌లను కలిగి ఉన్న రైతులు, పాడి/కోళ్ల రైతులు, వ్యక్తిగత లేదా ఉమ్మడి రుణగ్రహీత, జాయింట్ లయబిలిటీ గ్రూప్‌లు లేదా కౌలు రైతులతో సహా స్వయం సహాయక బృందాలు ఈ లోన్ పొందడానికి అర్హులు.

మత్స్యకారులు:
మత్స్యకారులు, చేపల రైతులు (వ్యక్తిగత & సమూహాలు/భాగస్వామ్యులు/షేర్ క్రాపర్లు/కౌలు రైతులు), స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు మరియు మహిళా సంఘాలు.
చెరువు, ట్యాంక్, ఓపెన్ వాటర్ బాడీలు, రేస్‌వే, హేచరీ, పెంపకం యూనిట్, చేపల పెంపకం మరియు ఫిషింగ్ సంబంధిత కార్యకలాపాలు మరియు ఏదైనా ఇతర రాష్ట్ర నిర్దిష్ట ఫిషరీస్ మరియు అనుబంధ కార్యకలాపాలకు అవసరమైన లైసెన్స్‌ని కలిగి ఉన్నవారు కూడా ఈ లోన్ పొందడానికి అర్హులే.

అవసరమైన పత్రాలు:

దరఖాస్తు ఫారం.
రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ వంటి ID రుజువు. వీటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్ తప్పనిసరి. RBI సర్క్యులర్ ప్రకారం ఆధార్ నంబర్‌తో పాటు పాన్ నంబర్ లేదా ఫారం 60, కస్టమర్ డ్యూ డిలిజెన్స్ విధానాన్ని నిర్వహించడానికి తప్పనిసరి.
రెవెన్యూ అధికారులచే సక్రమంగా ధృవీకరించబడిన ఆన్‌లైన్ భూ రికార్డులు లేదా భూమిని కలిగి ఉన్న వివరాలను తెలిపే పత్రాలు.
ఈస్ట్యూరీ మరియు సముద్రంలో చేపలు పట్టడానికి అవసరమైన ఫిషింగ్ లైసెన్స్/అనుమతి.
చేపల పెంపకం మరియు ఫిషింగ్ సంబంధిత కార్యకలాపాలకు అవసరమైన లైసెన్స్ మరియు సంబంధిత శాఖ నుండి ఏదైనా ఇతర రాష్ట్ర నిర్దిష్ట ఫిషరీస్ మరియు అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన లైసెన్స్.

చార్జీలు:

లోన్ విధానాన్ని బట్టి మరియు మీరు తీసుకునే మొత్తం డబ్బు ని బట్టి చార్జీలు వర్తిస్తాయి.

మిగతా లోన్ సంబంధిత వివరాలు https://www.bankofbaroda.in/ అధికారిక వెబ్ సైట్ లో లభిస్తాయి.

Also Read: PM Kisan Scheme: PM కిసాన్ పథకానికి మీరు అర్హులేనా? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి..!

Leave Your Comments

Ashoka Tree Uses: ఆడవాళ్లలో ఈ సమస్యలను తరిమికొట్టే అశోక చెట్టు గురించి మీకు తెలుసా?

Previous article

PM Kisan Samman Nidhi: అర్హులు కాకపోయినా.. PM కిసాన్ అందించే రూ. 2 వేలు పొందుతున్నారా? అయితే ఇక మీరు జైలుకే..!

Next article

You may also like