PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పీఎం కిసాన్ పథకం యొక్క నిభందనలు రోజు రోజుకి కఠినతరం అవుతున్నాయి. ఈ నింబంధనలు అన్ని కరెక్టుగా ఉంటేనే డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 27న రైతులకు పీఎం కిసాన్ 13వ ఇన్స్టాల్మెంట్ విడుదల చేసింది. త్వరలోనే కేంద్రం పీఎం కిసాన్ 14వ ఇన్స్టాల్మెంట్ (ఏప్రిల్ – జులై కి సంబంధించిన వాయిదా) డబ్బులు విడుదల చేయనుంది. అయితే ఈ డబ్బులు అకౌంట్లలో జమ కావాలంటే వివరాలన్నీ సరిగ్గా ఉండాల్సిందే. కేంద్రం ఈ 14వ ఇన్స్టాల్మెంట్ మే లేదా జూన్ నెలలో విడుదల చేయవచ్చని అంచనా.
దీనికంటే ముందు ఈ స్కీమ్ కి అర్హులైన రైతులందరూ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది, అలా అయితేనే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఇ – కేవైసీ, ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ చేసిన రైతులకే పీఎం కిసాన్ డబ్బులు అందుతాయి. వీటితో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఇతర డాక్యూమెంట్లలో పేరు తప్పుగా లేకుండా చూసుకోవాలి. గతంలో పేరు మ్యాచ్ కాకపోవడం వల్ల లక్షలాది మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందలేదు.
పీఎం కిసాన్ ఇ- కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి గతంలో చివరి తేదీ ఉండేది, కానీ ఇప్పుడు చివరి తేదీ అంటూ ఏమి లేదు. రైతులు ఎప్పుడైనా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్కోవచ్చు. ఇందుకోసం https://pmkisan.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో ఇ – కేవైసీ లింక్ ఆక్టివ్ గానే ఉంది. రైతులు ఈ క్రింది ప్రాసెస్ ద్వారా ఇ – కేవైసీ చేస్కోవచ్చు.
Also Read: Utthareni Medicinal Plant: ఉత్తరేణి… అద్భుతమైన ఔషధాల గని.!
ఇ – కేవైసీ ప్రాసెస్:
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
తర్వాత ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి, Consent Given పైన టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
ఇ – కేవైసీ విజయవంతంగా పూర్తి అవుతుంది.
ఒకవేళ మీ ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల, గతంలో పీఎం కిసాన్ డబ్బులు రానట్లయితే ఈ వివరాలను ఎడిట్ చేస్కోవచ్చు. దానికోసం ముందుగా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Farmers Corner సెక్షన్ లో Edit Aadhaar Failure Records పైన క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫార్మర్ నేమ్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి.
వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
తర్వాత రైతు పేరు, ఇతర వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
తప్పుగా ఉన్న వివరాలను Edit పైన క్లిక్ చేసి సరిచేస్కొవచ్చు.
ఇలా ప్రతీ ఒక్క వివరాలు సరిగ్గా ఉంటేనే పీఎం కిసాన్ అందించే డబ్బులు మీ అకౌంట్లలో జమ అవుతాయి.
Also Read: PM Kisan Mandhan Yojana: వృద్ధ రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయల పెన్షన్ పథకం