తెలంగాణ

Minister Niranjan Reddy: పంటనష్టం తీవ్రతను పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తా – మంత్రి నిరంజన్ రెడ్డి

0
Paddy Crop
Paddy Crop

Minister Niranjan Reddy: అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రేపు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పర్యటించనున్నారు. వారితో పాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

Ts Agriculture Minister Niranjan Reddy Garu

Ts Agriculture Minister Niranjan Reddy Garu

వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలో వడగళ్ల వాన తీవ్ర ప్రభావం చూపి పంటనష్టం కలిగించినట్లు ప్రాథమిక సమాచారం.
మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన, కొంతమేర మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది.

ప్రత్యక్షంగా రేపు పంటనష్టం తీవ్రతను పరిశీలించి రైతులకు భరోసా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కల్పించనున్నారు. మంత్రితో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పర్యటనలో పాల్గొంటారు.

Leave Your Comments

March Month Horticultural Crops: మార్చి మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు

Previous article

Minister Niranjan Reddy: ఆత్మీయులను కలుసుకునేందుకే సమ్మేళనం – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like