తెలంగాణ

Minister Niranjan Reddy: ఆత్మీయులను కలుసుకునేందుకే సమ్మేళనం – మంత్రి నిరంజన్ రెడ్డి

0
Telangana Agriculture Minister Niranjan Reddy
Telangana Agriculture Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మ వారికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులను, శ్రేయాభిలాషుల కుటుంబాలను ఒక చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని కరోనా నేపథ్యంలో ఆగిన మొక్కులు అమ్మవారికి చెల్లించునే సంధర్భంగా అభిమానులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో సమ్మేళనం మరింత ఆనందాన్ని కలిగింప చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.

ప్రత్యేక పూజల అనంతరం వనపర్తి నియోజకవర్గ ప్రజలు, హైదరాబాద్ లో నివసిస్తున్న వనపర్తి వాసులతో సమ్మేళనం ఏర్పాటు చేశారు. దాదాపు పదివేల మంది రాకతో కిక్కిరిసిన అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. కరోనా విపత్తు నేపథ్యంలో ఎక్కువ మందిని కలవలేక పోయానని, ఇప్పుడు ఇన్ని వేల మందిని కలుసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.

Also Read: March Month Horticultural Crops: మార్చి మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, వీఎం అబ్రహం, బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు బండారు భాస్కర్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Also Read: Murrah Buffaloes: తక్కువ వయసులోనే ముర్రా జాతి గేదెల్లో గర్భధారణ – సరికొత్త పరిశోధనలో వెల్లడి..!

Leave Your Comments

Minister Niranjan Reddy: పంటనష్టం తీవ్రతను పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తా – మంత్రి నిరంజన్ రెడ్డి

Previous article

Akarapu Narendra: మూడు గోశాలలకు నిత్యం ఆహారం అందజేస్తున్న ప్రకృతి ప్రేమికుడు ఆకారపు నరేందర్

Next article

You may also like