సేంద్రియ వ్యవసాయం

Organic Farming: సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి ?

1
What is Organic Farming
What is Organic Farming

Organic Farming: సహజంగా దొరికేవి అనగా వ్యవసాయ వ్యర్ధాలు పశు -పక్షాదుల విసర్జనాలను వాటి ఇతర ఉత్పత్తులని ఎరువులుగా, ఎర్రలని వాడి తెగుళ్ళను, పురుగులని నియంత్రించడం వంటి పద్ధతులు మరియు జంతు వృక్ష సంభంద (వేప, పొగాకు, వెల్లుల్లి మొదలైనవి) క్రిమి సంహారాలను వాడి ఎటువంటి రసాయనాలను వాడకుండా పంటలు పండిరచడమే. సేంద్రీయ వ్యవసాయం. దీని వల్ల పంటలకు సూక్ష్మ పోషకాలు అందటం ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు వాటి అవశేషాలకు ఎటువంటి చోటు లేకపోవటం వల్ల ఆరోగ్యకరమైన ఉత్తమమైన పంటలు పండిరచవచ్చు.

Also Read: Organic Farming Precautions:సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యలు.

Organic Farming

Organic Farming

సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు :
. సేంద్రీయ వ్యవసాయం కాలుష్య నివారణకు ఉపయోగపడుతుంది. సహజ వనరులు ఉపయోగపడటమే గాక రాబోయే తరాలకి, అందుబాటులో ఉంటాయి.
. నేలలో తేమ గాలి, మొక్క సంబంధాలలో అనుకూలత పెరుగుతుంది. వేర్లు బాగా లోపలికి చొచ్చుకుపోయే లక్షణం కలిగి ఉంటాయి
. మొక్కికి పోషకాలు పుష్కలంగా అందుతాయి, నేలకి వాటిని పట్టించుకునే గుణం పెరుగుతుంది.
. ఆహారంలో విషపదార్ధాలు ప్రవేశించే అవకాశం ఉండదు.
. రైతులకి ఆర్థికంగా నష్టం వస్తుందేమో అనే భయం తగ్గుతుంది.
. నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురి కావు.
. చీడ పీడల తాకిడి తగ్గిపోతుంది ఒక వేళ వచ్చిన ప్రకృతి పరంగా సహజంగానే తొలగిపోతాయి.
. నేల వల్ల అందే పోషకాలు పూర్తిగా మొక్కలకు చేరతాయి.
. పరిసరాల మిత్రత్వానికి దోహద పడుతుంది.
. జీవ వైవిధ్యానికి నాంది పలుకుతుంది.
. మంచి జన్యు వైవిధ్యం ఎర్పడుతుంది.
. నేల గుల్లబారుతుంది, మురుగు సౌకర్యం పెరుగుతుంది.
. నేల పునరుద్దరణ జరుగుతుంది.
. పంట నాణ్యత ఉంటుంది.
. నేలలో పంటకి హాని కలిగించే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది.

Also Read: Useful Agricultural Tools: వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్లు.!

Leave Your Comments

Organic Farming Precautions:సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యలు.

Previous article

Organic Farming:సేంద్రీయ వ్యవసాయం.!

Next article

You may also like