ఆరోగ్యం / జీవన విధానం

Home Remedies Uses: మన ఇంటి పెరటి వైద్యం – ఆరోగ్య చిట్కాలు.!

2
Home Remedies
Home Remedies

Home Remedies Uses: మన ఇంటి పెరటి వైద్యం – ఆరోగ్య చిట్కాలు.! మనదేశంలో వేలల్లో ఔషదమొక్కలున్నాయి. ప్రస్తుతం పల్లెల్లో, పట్టణాల్లోనే కాకుండా నగరాల్లోనూ ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వైద్యులు 90 శాతం ఔషధ మొక్కలపైనే ఆధారపడుతున్నారు. అల్లోపతి, హోమియోలు వైద్యంలోనూ ఎక్కువగా ఔషధ మొక్కలను వినియోగిస్తున్నారు. ఆధునిక ఔషధాలు, సౌందర్య సాధనాలు, హెల్త్సప్లిమెంట్స్లో రసాయనాలు, సింథటిక్సు వినియోగిస్తుండడంవల్ల కలుగుతున్న దుష్ప్రభావాలను గ్రహిస్తున్న పాశ్చాత్యదేశీయులు సైతం ఔషధ మొక్కల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు.

మొక్కల వివిధ భాగాలను అంటే వేరు, బెరడు, ఆకు, పువ్వు, గింజలను కషాయం, రసం, చూర్ణం, తైలంరూపాలలో తయారు చేసి ఔషధంగా తీసుకుంటారు. ఎన్నోరకాల మొక్కలు మనచుట్టూ పెరుగుతున్న మార్పులవల్ల వీటి గురుంచిన విలువైన విజ్ఞానాన్ని తరవాతి తరాలకు అందకుండా చేస్తుంది. ఇటువంటి ఔషధ విలువలు గల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచటం, ఉపయోగించడం ద్వారా చిన్న చిన్న అనారోగ్యాలకు వైద్యసదుపాయం దొరుకుతుంది. అనేక చిన్నరోగాలకు సొంతంగా నివారణ చేసుకోవచ్చు. కొంత వరకు కుటుంబ ఖర్చు భారాన్ని తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్‌ ఎఫెక్టు లేకపోవడంవలన వీటిని నిరభ్యతరంగా వాడుకోవచ్చు. మనచుట్టూ ఔషధ ఉపయోగాలున్న పలురకాల మందు మొక్కల ప్రాముఖ్యత వాటిని ఉపయోగించి సాధారణ అనారోగ్యాల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..

కలబంద(అలోవెర) :
కలబంద ఎన్నో ఔషధగుణాలు కలిగిన గుబురుగా పెరిగే మొక్క కుండీల్లోను, నేల పైనపెంచుకోవచ్చు. కలబంధ ఆకులలో 94 శాతం నీరు ఉంటుంది. ఎక్కువ ఉపయోగాలు ఉండటం వలన వాణిజ్య పంటగా కూడా వేస్తున్నారు.
ఉపయోగాలు :
. కలబందఆకులను మెత్తగా నూరి రసంతీసి దానిని పుండ్లు, కురుపులపై లేపనంగా వాడవచ్చు.
. కలబంద అంతగా ముదరని ఆకులను తీసి వాటిని చీల్చి గుజ్జు లాంటి పదార్థానికి చిటికెడు ఉప్పు, పసుపు కలిపి 15 రోజులపాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే జీర్ణకోశంలోని సూక్ష్మక్రిములను చంపేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
. క్లోమగ్రంధిని శుద్ధి చేస్తుంది, కాలేయ విధులను సక్రమం చేస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది, వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
. నేత్రరోగాలలో, కాలిన గాయాలు దీర్ఘకాలిక పుండ్ల నివారణకు, ప్లీహము, కాలేయం మూత్రకోశ సంబంధ వ్యాధులలోనూ, గర్భాశయ రుతుసంబంధ చికిత్సలకు ఉపయోగపడుతుంది.
. ఆకులనుండితీసిన ‘ఆలోయిన్‌’ను ఎండబెడితే ముసాంబ్రం అనే నల్లని పదార్థం తయారవుతుంది. ఇదినొప్పులను, వాపులను తగ్గిస్తుంది.
. జీర్ణప్రక్రియ వ్యవస్థను శుద్ధిచేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది.

తులసి :
తులసి కుండీలలోనైనా సులువుగా పెంచగలిగే మొక్క ఔషధగుణాలు మెండుగా ఉండడంవలన సర్వరోగ నివారిణి అని పేరుంది. తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చేదుగా, వగరుగా ఉంటాయి.
ఉపయోగాలు :
6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి రసం వడగట్టి అరస్పూనేతితో కలిపిరోజులో రెండుసార్లు 3-4 చుక్కలుగా తీసుకోవాలి. గొంతు గరగరను తగ్గించి మృదువుగా చేస్తుంది, కఫాన్ని వదిలేస్తుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండుచెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది. తులసి ఆకులను పరగడపున కొన్ని రోజులపాటు 2-3 ఆకులను నమిలినట్లైతే ముక్కుదిబ్బడవంటి శ్వాసలోపాలు సవరించబడతాయి, గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధినిరోధకశక్తి కలుగుతుంది. సుగంధభరితమైన తులసిఆకుచుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది, క్రిమికీటకాలను, రోగాలను అరికడుతుంది.

పుదీనా :
. పుదీనాకుండీలిలోను, నేలపైన అల్లుకొని పెరుగుతుంది.
. 10-15ఆకులనుఒకగ్లాసు నీటిలో ఉడికికించి, వడగట్టి, చల్లార్చి, దానికి చిటికెడు ఉప్పు, మిరియాల పొడికలిపి రోజుకొకసారి తీసుకోవాలి. కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు తగ్గుతాయి. కాలేయం, క్లోమగ్రంధులను శుద్ధిచేస్తుంది.
. దగ్గు, తుమ్ము, ఆయాసంకలవారు పుదీనారసాన్ని వాడితే ఉపశమనం కలుగుతుంది.
. పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి నోటిదుర్వాసనను పోగొట్టవచ్చు. దంత సంరక్షణ గుణం పుదీనాలోవుంది.
. పరకడుపున పుదీనారసం తీసుకోవడంద్వారా కడుపులో బద్దెపురుగు ఏలికపాము వంటివి మలము ద్వారా బయటపడిపోతాయి.
. పుదీనఆకులను బాగా నలిపి, ఆఆకులవాసననుగట్టిగా పీలుస్తూ ఉంటే తలనొప్పి, తలతిరుగుడు తగ్గిపోతాయి.
. ఆస్త్మారోగులు పుదీన క్రమంతప్పకుండా వాడితే శ్వాసక్రియ ఇబ్బందిని తగ్గించి, ఉపశమనం కలిగిస్తుంది.
. పుదీనా పసరును శరీరంమీద రాసుకుంటే చర్మం మెరుగ్గా కనిపిస్తుంది.
. ఎండాకాలంలోవడదెబ్బతగలకుండాఉండాలంటేమజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి.

Also Read: Bengal gram Cultivation: శనగ కోత మరియు నిల్వలో పాటించాల్సిన మెళకువలు.!

Home Remedies Uses

Home Remedies Uses

కరివేపాకు :
కరివేపాకు బహువార్షిక చెట్టు. సాధారణంగా సువాసన కోసం ఆహరంలో కరివేపకు ఉపయోగించబడినప్పటికి, దీనిలో ఔషధ గుణాలు చాలా అధికం.
. పది కరివేపాకులు రోజునమిలితే బరువు తగ్గవచ్చు.
. అజీర్తి సమస్య నుండి ఉపశమనం కలగాలంటే కరివేపాకు రసంలో ఒక నిమ్మకాయ, చిటికెడు చెక్కెర వేసుకొని తాగాలి.
. గర్భవతులు పరకడుపున ఒక కప్పు కరివేపాకు రసానికి రెండు స్పూన్ల నిమ్మ రసం, ఒక స్పూన్‌ చెక్కెర కలుపుకొని తాగితే వాంతులు, వికారం నుండి ఉపశమనం పొందవచ్చు.
. కరివేపాకు పొడిని తీసుకోవడం వల్ల కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
. వెంట్రుకలు ఒత్తుగా పెరగాలంటే కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆనూనెను తలకు రాసుకోవాలి.
. బ్లడషుగర్‌ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపాకును విరివిగా వాడటంవల్ల ఆవ్యాధి అదుపులోకి వస్తుంది.
. ఒళ్లంతా దురదతో బాధపడేవారు కరివేప, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
. కరివేపరసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్ల కింద పూస్తుంటే కంటి కింది వలయాలు మాయమవుతాయి.

మందారం :
. మందారం కుండిలలోను, నేలపైన పెరుగుతుంది. మందార ఆకులు పువ్వులు, వేర్లలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి.
. మందారం కాషాయం తాగితే ఋతుచక్రం, రక్తసరఫరా క్రమపద్ధతిలో జరుగుతుంది.
. ఆకులు, పువ్వులతో తలపై మర్దన చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది.
. మందారం కాలేయ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
. కీళ్ళనొప్పులు, వాపులతో బాధపడుతున్నవారు మందార రసాన్ని చికిత్సగా ఉపయోగించుకోవచ్చు.
. మందార ఆకులతో తయారు చేసిన టీని తీసుకోవడం వలన శరీరానికి విటమిన్లు అందుతాయి.
. మందార పువ్వులను నూనెలో మరిగించి, వడగట్టి, ఆనూనెజుట్టుకి రాయడం వలన జుట్టు నిగనిగలాడుతుంది.

Also Read: Mango Fruit Covers: మామిడిలో ఫ్రూట్‌ కవర్ల వినియోగం`వాటి ఉపయోగాలు.!

Leave Your Comments

Mango Fruit Covers: మామిడిలో ఫ్రూట్‌ కవర్ల వినియోగం`వాటి ఉపయోగాలు.!

Previous article

Fowl Pox Disease: ఫౌల్‌ పాక్స్‌ వ్యాధి – నివారణా చర్యలు.!

Next article

You may also like