ఆరోగ్యం / జీవన విధానం

Amchur Powder (Dry Mango Powder): ‘‘ఆంచూర్‌’’తో పోషకాలు ఉపయోగాలు.!

1
Amchur Powder
Amchur Powder

Amchur Powder (Dry Mango Powder): పచ్చి మామిడికాయల పొడిని ఆంచూర్‌ అంటారు. మామిడి ఉప ఉత్పత్తుల్లో ఆంచూర్‌ ఎంతో ప్రాధాన్యత కలిగింది. మామిడి కాలానుగుణంగా పండే పంట, కూరల్లోను, పచ్చడిగాను ఆ కాలంలోనే చేసుకొంటారు. కాని పొడి రూపం లో (ఆంచూర్‌) రూపంలో నిల్వ చేసుకుంటే, సంవత్సర కాలం పాటు వాడుకోవచ్చు. పైగా మామిడి తోటలు ఉన్న రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల (గాలులు, అకాల వర్షాలు) ఎక్కువగా నష్టపోతున్నారు.

సాధారణంగా మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో సుడిగాలులు, అకాల వర్షాల మూలంగా పక్వానికి రాకముందే కొన్ని సార్లు 50 శాతం మామిడికాయలు రాలిపోవడం సంభవిస్తుంది. ఇలా రాలిపోయిన మామిడికాయలను రైతులు మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోవలసివస్తుంది . దీనివలన రైతులు లాభాలు పొందలేకపోతున్నారు. రాలిపోయిన మామిడికాయలను కూడా ఆంచూర్‌ తయారు చేసేందుకు వినియోగిస్తే కొంతవరకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకొనే అవకాశముంటుంది. మామిడి ఒరుగులు లేదా ఆంచూర్‌ తయారు చేయడం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో చింతపండుకు బదులు అన్ని వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు.

ఆంచూర్‌ కి అనువైన మామిడి రకాలు
అన్ని రకాలను ఆంచూర్‌ తయారీకి వినియోగించు కోవచ్చు. పీచు ఎక్కువగా ఉండి, పులుపుగా ఉన్న కాయలతో తయారు చేసిన ఆంచూర్‌ కి నిల్వ ఉండే గుణం ఎక్కువగా ఉంటుంది. కండ తెల్లగా ఉన్న రకాలు అంచూర్‌ తయారీకి అనుకూలం. సుమారు 10-12కిలోల కాయలకు ఒక కిలో ఆంచూర్‌ తయారవుతుంది. ఆంచూర్‌ కి రంగును బట్టి ధర ఉంటుంది. తెల్లగా ఉన్న ఆంచూర్‌ కి ఎక్కువ రేటు, లేత గోధుమరంగు నుంచి ముదురు కాఫీ రంగు ఉన్న వాటికి తక్కువ ధర పలుకుతుంది. రంగు, నాణ్యతను బట్టి ఒక్కొక్క క్వింటాలుకు రూ. 3,500-8,000 దాకా గిట్టుబాటవుతుంది.

ఆంచూర్‌లోని పోషక విలువలు
పోషకాలు విలువలు
శక్తి 30 కేలరీలు
కొలెస్ట్రాల్‌ 0
కొవ్వు 0
సోడియం 15 మి. గ్రా.
విటమిన్‌ సి 2 గ్రా.
పిండి పదార్ధం 8 గ్రా.

Also Read: Mango Plantations: మామిడి తోటలలో సస్యరక్షణ చర్యలు.!

Amchur Powder (Dry Mango Powder)

Amchur Powder (Dry Mango Powder)

ఉపయోగాలు :
. జీర్ణక్రియను మెరుగుపరచి అజీర్ణం, మలబద్దకం, గ్యాస్‌ వంటి సమస్యల నుండి బయట పడేలా చేస్తుంది.
. మామిడికాయ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడి కేలరీలు బాగా ఖర్చై బరువు కూడా తగ్గుతారు.
. ఈ పొడిలో విటమిన్‌ ‘‘సి’’ సమృద్ధిగా ఉండుట వలన విటమిన్‌ ‘‘సి’’ లోపంతో బాధపడేవారికి మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. అలాగే చర్మాన్ని శుభ్రం చేయటంలో కూడా బాగా సహాయపడుతుంది.
. అంతేకాక కంటి చూపు, కంటి సంబంధిత సమస్యలను తగ్గించటంలో బాగా హెల్ప్‌ చేస్తుంది. మామిడికాయ పొడిలో ఐరన్‌ సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనతతో బాధపడేవారికి అద్భుతంగా పనిచేస్తుంది.
. మామిడిపొడిలో కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా ఉండుట వలన వ్యాధి నిరోధకతను పెంచి ఇన్‌ ఫెక్షన్స్‌ రాకుండా కాపాడుతుంది. అంతేకాక మెగ్నీషియం, భాస్వరం, క్యాల్షియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన బిపి కూడా కంట్రోల్‌ లో ఉంటుంది.

ఆంచూర్‌ తయారుచేసే విధానం :
1. ఎంపిక: పులుపు, తెల్లని కండ గల పచ్చి మామిడి కాయలను ఎన్నుకోవాలి.
2. కాయల తొక్క తీయడం: మంచి నాణ్యత గల స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ పీలర్లు లేదా స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ కత్తులతో తొక్క తీయాలి.
3. ముక్కలు కోయడం: తుప్పు లేని స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో తయారుచేసిన చాకులు వాడాలి. ముక్కలు పలుచగా, సన్నగా కోయాలి.
4. ముక్కలను ఎండబెట్టడానికి ముందు: ఒక లీటరు నీటికి 20గ్రా. ఉప్పు కలపాలి. దీనినే 2 శాతం ఉప్పు నీళ్ళని అంటారు. 2 శాతం ఉప్పు నీళ్ళలో 10 గ్రా. సిట్రిక్‌ యాసిడ్‌ ను కలిపి, ఈ ద్రావణంలో కోసిన ముక్కలను 20-30 నిముషాలు మునిగేటట్లుగా ఉంచాలి.
5. ఎండబెట్టడం : ఉప్పు ద్రావణంలో ముంచిన ముక్కలను గట్టిగా పిండి పరిశుభ్రమైన బట్ట మీద లేదా ప్లాస్టిక్‌ టార్పాలిన్‌ మీద ముక్కలను బాగా పెళపెళ ఎండే దాకా ఎండబెట్టాలి. వీటిని ఒరుగులంటారు. గలగలలాడేట్లుగా ఎండబెట్టడం వల్ల బూజు ఆశించదు కనుక నాణ్యత గల, ఎక్కువ రోజులు నిల్వ ఉత్పత్తి తయారవుతుంది.
గమనిక: ఎండబెట్టటానికి సోలార్‌ డ్రయర్‌ను వాడటం మంచిది. ఎందుకంటే దుమ్ముధూళి పడుకుండా పైన ఉండే అద్దం అడ్డుకుంటుంది.

Also Read: Pest Management in Mango: మామిడిలో గూడు పురుగు మరియు ఆంత్రాక్నోస్ తెగులు.!

Leave Your Comments

Mango Plantations: మామిడి తోటలలో సస్యరక్షణ చర్యలు.!

Previous article

Antirrhinum Cultivation: అంటిరైనమ్‌ పూల సాగు విధానం.!

Next article

You may also like