చీడపీడల యాజమాన్యం

Castor Pests and Diseases: ఆముదం సాగులో చీడపీడలు – నివారణ.!

1
Castor Pests and Diseases
Castor Pests and Diseases

Castor Pests and Diseases – దాసరి పురుగు: ఈ పురుగు అక్టోబర్ మాసం నుండి ఆకుల క్రింద చేరి తినివేయడం వల్ల ఆకుల ఈనెలు మాత్రం మిగులుతాయి. దాసరి పురుగు సహజ సిద్ధ మిత్ర పరాన్న జీవులు (మైక్రో ప్లెటిస్) ఆశించడం వల్ల నియంత్రణలో ఉంటుంది.
నివారణ:
వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ. కలిపి తొలిదశలో పిచికారి చేయాలి. ఎకరానికి 8-10 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువ ఉంటే ఎసిపేట్ 75 ఎస్.పి. 1.5గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు :
ఆకుల క్రింద గుంపులుగా చేరి ఆకులను తినివేస్తాయి. ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు ఉంచి పురుగు ఉనికిని గమనించాలి.
నివారణ:
తొలి దశలో మోనోక్రోటోపాస్ 2 మి.లీ. లేదా నొవాల్యురాన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మలి దశ లద్దె పురుగులను విషపు ఎరను (5 కిలోల తవుడు+అర కిలో బెల్లం + అర లీటరు మోనోక్రోటోపాస్) చల్లి నివారించాలి.

ప్రస్తుతం ఆముదం పంట పూత మరియు కాయ ఏర్పడే దశలో ఉంది. ఈ పంటలో ప్రస్తుతం రసం వీల్చే పురుగులు మరియు ఎండు తెగులు గమనించడమైనది. ఈ క్రింద తెలిపిన సస్యరక్షణ చర్యలు. తీసుకున్న యెడల వీటి నుండి వంటను రక్షించుకోవచ్చును.

పచ్చదోమ :
ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఏండుబారి, కృశించుకు పోతాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా (28° సెం.) ఉన్నప్పుడు పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ:
దీనిని ప్రొఫెనోపాస్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి అరికట్టాలి.

Also Read: Pest Management in Mango: మామిడిలో గూడు పురుగు మరియు ఆంత్రాక్నోస్ తెగులు.!

Castor Pests and Diseases

Castor Pests and Diseases

తెల్లదోమ :
ఇది ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలుగా మారి ఎండిపోతాయి. తెల్లదోమ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ:
వేప నూనె 5 మి.లీ. లీటరు నీటికి లేదా డైమిథోయెట్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు : మొక్క పుష్పించే దశలో పురుగు కొమ్మ మరియు కాయలను తొలిచి నాశనం చేస్తుంది.
నివారణ:
ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎండు తెగులు:
తేలిక నేలల్లో మరియు ఆముదంను ఏక పంటగా ఎక్కువ సార్లు సాగు చేసినప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువ. ఆకులు పాలిపోయి, మొక్కలు వడలి చచ్చిపోతాయి, కాండం చీల్చి పరిశీలించినప్పుడు. శిలీంధ్రం పెరుగుదల గమనించవచ్చును.
నివారణ:
ఈ తెగులు లక్షణాలను గమనించిన వెంటనే తెగులు ఆశించిన మొక్కలను తీసి వేసి ఆ ప్రదేశాన్ని కార్బండాజిమ్ 1.గ్రా. లీటరు నీటిలో కలిపి తడిసేలా పోయాలి.

Also Read: Ethanol Production: జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి.!

Leave Your Comments

Pest Management in Mango: మామిడిలో గూడు పురుగు మరియు ఆంత్రాక్నోస్ తెగులు.!

Previous article

Mango Plantations: మామిడి తోటలలో సస్యరక్షణ చర్యలు.!

Next article

You may also like