వార్తలు

గిరికోనల్లో సేంద్రియ విప్లవం..

0

గిరికోనల్లో సేంద్రియ విప్లవం మొదలయింది. ఏకలవ్య ఫౌండేషన్ సభ్యుల సూచన మేరకు సేంద్రియ వ్యవసాయంలో ప్రావీణ్యం పొంది, జనాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు దంపతులతో మాట్లాడారు. రసాయనాల వినియోగంతో వ్యవసాయ రంగం క్రమంగా సంక్షోభంలోకి కూరుకుపోతున్న సమయంలో గిరిసీమ మేలుకొంది. ఆర్గానిక్ పంటలు పండిస్తూ మోడ్రన్ అగ్రికల్చర్ కు సవాల్ విసురుతోంది. ఒకరిద్దరు కాదు, ఇరవై గూడేలకు చెందిన 1,500 మందికి పైగా రైతులు రెండు మూడేళ్ళుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ మహాయజ్ఞానికి ఏకలవ్య ఫౌండేషన్ సభ్యులు చేయూతనిస్తూ వస్తున్నారు. వారి సూచనల మేరకు గోమూత్రం, పేడతో సేంద్రియ ఎరువులు తయారుచేసి పంటల్లో వాడుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయం చేయడంలో ఏకలవ్య ఫౌండేషన్ రైతులకు అండగా నిలుస్తోంది. ఆవు పేడ, మూత్రంతో దాదాపు 20 రకాల సేంద్రియ ఎరువులను ఎప్పుడు గిరి రైతులే సొంతంగా తయారు చేసుకుంటున్నారు. గోమూత్రం, ఆవుపేడ, కొన్ని రకాల చెట్ల ఆకులతో అడుగు మందులు, పురుగు మందులు, పలురకాల కాషాయాలు తయారు చేసి పంటకు సీజన్ లో రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 15 సంవత్సరాల క్రితమే ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే పని మొదలుపెట్టింది. గుడిహత్నూరు మండలం లింగాపూర్ గ్రామం కేంద్రంగా గిరిజన రైతులకు సేంద్రియ సాగు విధానాలు, పంటల దిగుబడులపై అవగాహన కల్పించి.. ఒక్కొక్కరిగా మొదలుపెట్టి వందలమందిని తనసాగు దళంలో చేర్చుకుంది. ప్రస్తుతం ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరి కొండ, గుడిహత్నూర్, ఇచ్చోడ. జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో కేవలం సేంద్రియ ఎరువులతో కూరగాయలు, తొగరి, పెసర, మినుములు, మక్కలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు తదితర పంటలు పండిస్తున్నారు.
పండించిన పంటలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ నేచురల్స్ తోపాటు, సేంద్రియ కూరగాయలు, ఆహారాన్ని ఇష్టపడే వారికి విక్రయిస్తున్నారు. గిరిజనులు పండించే సేంద్రియ పంటలను నేరుగా అమ్ముకునేందుకు గత కలెక్టర్ దివ్య దేవరాజ్ రెండేళ్ల క్రితం తన సొంత డబ్బులతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులందరినీ సభ్యులుగా చేస్తూ ఆ కేంద్రానికి ఆదిలాబాద్ నేచురల్స్ అని పేరు పెట్టారు. ఎప్పుడు ప్రతి రైతు అక్కడే తన పంటలను అమ్ముకుంటున్నారు. కొందరు ఔత్సాహికులు తమ పంటలను, ఆవు పాలను నేరుగా కస్టమర్లకు అందజేస్తున్నారు.
ఏకలవ్య ఫౌండేషన్ చేస్తో వస్తున్నా ఈ సేంద్రియ విప్లవానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆది నుంచి దిశానిర్ధేశం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ అభినందించేందుకు ఏకలవ్య ఫౌండేషన్ ఓ బృహత్తర ప్రోగ్రామ్ చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 26 న గుడిహత్నూరు మండలంలోని లింగాపూర్ లో ఈ కోవకు చెందిన దాదాపు 1500 మంది రైతు కుటుంబాలను మోహన్ భగవత్ సన్మానించనున్నారు. జాతీయ స్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో సేంద్రియ వ్యవసాయదారులకు సన్మానం చేయడం ఇదే మొదటిసారి.

Leave Your Comments

“రెయిన్ పైపు” విధానంతో ఉల్లి సాగు..

Previous article

పుదీనా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like