వ్యవసాయ పంటలు

Turmeric Crop: పసుపులో ఎరువుల యాజమాన్యం.!

2
Nutrient Management in Turmeric crop
Nutrient Management in Turmeric crop

Turmeric Crop: భారతదేశంలో సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు పంట ప్రధానమైనది. మన దేశంలో సగానికి సగం పసుపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతుంది. పసుపు పచ్చదనము (కర్కుమిన్‌, సుగంధతైలము (2-6-1) వలన దీనిని ఆహార పదార్థాలకు, రంగు, రుచి కొరకు, ఔషధాలలో, చర్మ సౌందర్యానికి మరియు రంగుల పరిశ్రమలలో వాడతారు.

ఎరువులు :
రైతులు అధిక మోతాదులో పశువుల ఎరువు లేదా చెరువు మట్టి వేయడం వల్ల నేలలో తేమ శాతం పెరిగి దుంపకుళ్ళు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసిన మేరకే సేంద్రియ ఎరువులను వేసుకోవాలి. నాణ్యమైన వేపపిండిని తప్పకుండా వేసుకోవాలి. ఒక ఎకరా పసుపు ఎకరా పంటకు, మొక్కజొన్నతో అంతరపంటగా వేసినప్పుడు ఏ ఎరువులు ఎంత మోతాదులే వేయాలో క్రింది పట్టికలో సూచించడమైనది. ఎరువులను వేసేటప్పుడు మొక్కలపై పడకుండా, మొక్కలకు 10 నుంచి 15 సెం.మీల దూరంలో వేయాలి.

Also Read: Sweet Orange Pruning: చీని అంట్ల ఎంపికలో మెలకువలు.!

Turmeric Crop

Turmeric Crop

ఫర్టిగేషన్‌ :
సాధారణ పద్ధతితో పోలిస్తే ఫర్టిగేషన్‌ వల్ల అధిక దిగుబడితో పాటు, ఎరువులు కూడా ఆదా అవుతాయి. అందువల్ల డ్రిప్‌ ఫర్టిగేషన్‌
ఆచరించినట్లయితే నిటిని, ఎరువులను ఆదా చేసుకోవడమే కాకుండా దుంప కుళ్ళను తగ్గించుకోవచ్చును.

ఒక హెక్టారుకి సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను మూడు రోజులకి ఒకసారి ఫర్టిగేషన్‌ ద్వారా అందించాలి. సిఫారసు చేసిన 15%. భాస్వరం ఆఖరి దుక్కిలో వేయాలి. సంప్రదాయ రసాయనిక ఎరువులే కాకుండా వీటిలో సులువుగా కరిగే 19:19 .19, 20: 30:20, 14: 35: 14,28.08.0 వంటి ఎరువులు కూడా ఉపయోగించవచ్చు.

డా. కె. శైలజ, డా. కె. పవన్‌ చంద్రారెడ్డి. డా. ఎస్‌. హెచ్‌ . కె. శర్మ
మరియు డా. జి. జయశ్రీ
ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం
వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్‌.

Also Read: Pests Control Methods in Paddy: వరిలో బాక్టీరియా వేరు మరియు కాండం మొదలు కుళ్ళు తెగులు.!

Leave Your Comments

Sweet Orange Pruning: చీని అంట్ల ఎంపికలో మెలకువలు.!

Previous article

Moringa Powder Health Benefits: హిమోగ్లోబిన్ పెంపొందిస్తున్న మునగాకు పొడి.!

Next article

You may also like