చీడపీడల యాజమాన్యంవ్యవసాయ పంటలు

Pests Control Methods in Paddy: వరిలో బాక్టీరియా వేరు మరియు కాండం మొదలు కుళ్ళు తెగులు.!

2
Paddy
Paddy

Pests Control Methods in Paddy: ఈ తెగులు ఏర్వీనియా క్రిసాస్టియ అనే బాక్టీరియా ద్వారా కలుగుతుంది. ఈ తెగులు ఖరీఫ్ పంటకాలంలో – బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మరియు రబీ పంట కాలంలో పొడి వాతావరణంలో నీటి ఎద్దడి పరిస్థితులలో, మురుగునీరు పోనటువంటి ప్రాంతాలలో మరియు మూసి పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా కనబడుతుంది.

తెగులు లక్షణాలు:
తెగులు నాటిన 15-25 రోజులలోపు ఆశించడం వలన లేత మొక్కలు వడలిపోయి వాటి లోపలి కణజాలం కుళ్ళిపోవుట వలన మొక్కలు మెత్తబడి వాలిపోతాయి.

ఒకవేళ ఈ బాక్టీరియా దుబ్బుకట్టే దశలో లేదా ఈనిక దశలో ఆశించినట్లైతే ఆకుల కొసలు ఎండిపోవడం, వేర్లు మరియు దుబ్బు మొదలు కుళ్ళిపోవడం ఈ తెగులు యొక్క ప్రధాన లక్షణం. తెగులు తీవ్రత పెరిగే కొద్ది మొక్కలు పూర్తిగా గుంపులు గుంపులుగా చనిపోతాయి.

మొదలు కుళ్ళు ఆశించిన పిలకలను వేర్ల నుండి నిలువుగా పైన చీల్చి చూసినప్పుడు లోపలి కణజాలం ముదురు ఎరుపు రంగులోనికి మారి మొక్కల మొదళ్ళ వేర్లు బాక్టీరియా ఊజ్తో నిండి ఉంటాయి.

Also Read: Microorganisms and Soil Fertility: నేలల భూసార మరియు సూక్ష్మ జీవుల యాజమాన్యం.!

Pests Control Methods in Paddy

Pests Control Methods in Paddy

తెగులు వ్యాప్తి :

ఈ తెగులును కలుగజేయు బాక్టీరియా భూమిలో జీవిస్తూ మొక్కలలో ఏర్పడిన గాయాల ద్వారా, సాగునీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.

అనుకూల పరిస్థితులు :

అధిక నత్రజని ఎరువుల వినియోగం, కాండం తొలిచే పురుగును సకాలంలో నివారించక పోవటం, మురుగు నీరు పోయే సౌకర్యం లేకపోవటం, నీటి ఎద్దడి ఏర్పడటం ఈ తెగులు వ్యాప్తికి చాలా అనుకూలం.

నివారణ:
ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు కాని లోతు దుక్కులు చేయాలి. మురుగు నీరు పోయే సౌకర్యం కల్పించాలి. వేర్లకు గాలి తగిలే విధంగా కలుపు తీత సమయంలో మట్టిని కదిలించడం ద్వారా కొంత మేరకు తెగులును అరికట్టవచ్చును. కాండం తొలుచు పురుగు ద్వారా
కల్గిన గాయల ద్వారా ఈ బాక్టీరియా ప్రవేశిస్తుంది. కావున తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

Also Read: Rangpur Lime Root Stock: చీని అంట్ల తయారీలో రంగపూరు వేరుమూలం ప్రాధాన్యత.!

Leave Your Comments

Microorganisms and Soil Fertility: నేలల భూసార మరియు సూక్ష్మ జీవుల యాజమాన్యం.!

Previous article

Sweet Orange Pruning: చీని అంట్ల ఎంపికలో మెలకువలు.!

Next article

You may also like