Natural Farming: చాలామంది రైతులు పెద్దగా చదువుకున్నవారు కాకపోవచ్చు నేలల గురించి సరైన అవగాహన లేకపోవచ్చు రసాయనిక ఎరువుల వల్ల నేలల్లో కలిగే మార్పులు అర్ధం చేసుకోలేకపోవచ్చు. శాస్త్రీయ పరిజ్ఞానం గలవారు వ్యవసాయ శాస్త్రంలో శిక్షణ పొందినవారు కూడా ఈ పంధాల్లో ఆలోచించకపోవడం శోచనీయం. వ్యవసాయ శాస్త్ర పరిజ్ఞానం పెంపొందించడంలో జరిగిన పొరపాటువల్ల, శాస్త్రజ్ఞుల ఆలోచన సరళిలో సరైన ఆలోచనలు రాకపోవడం వల్ల నేలలకు చాలా నష్టం జరిగింది. ఈ నష్టాలను మన పురాతన మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించుటవలన నెల సారాన్ని కాపాడవచ్చు.
పురాతన వ్యవసాయ పద్దతులు:
భారతదేశంలో వ్యవసాయం 4 నుంచి 5 వేల సంవత్సరాల నాటిది. పంటలు సమృద్ధిగా పండేవి. ఎక్కువ వరదలు, కరవు వచ్చిన సంవత్సరాల్లో తప్పించి పంటనష్టం ఎక్కువగా జరిగేది కాదు. ఆ రోజుల్లో పాటించిన వ్యవసాయ పద్ధతులు అలాంటివి. అయితే అప్పుడు అధిక దిగుబడి వంగడాలు లేవు. వర్షం అధికమైనా, తక్కువైనా నేలల సామర్ధ్యాన్ని కాపాడేవారు కనుక పైరుకు, పంటకు ఎక్కువ నష్టం జరిగేది కాదు. నేలను కాపాడే పద్ధతులు తిరుగులేనివి. ప్రతి సంవత్సరం నేలల్లో భూసారాభివృద్ధికి దోహదపడే ప్రయత్నాలు రైతులు చేసేవారు.
Also Read: Eradication of Parthenium Weed: నిమ్మ తోటల్లో పార్థీనియం కలుపు నిర్మూలన.!
నల్ల నేలల్లో గడ్డయిరవడం, ఎండాకాలం వర్షాలకు నేలలు సాగు చేసి నీటిని ఆదా చేయడం, ఎండకాలంలో పైర్లు లేనపుడు పశువులను పొలాల్లో కట్టి పేడను, మూత్రాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం, గొర్రెలను, మేకలను మంద కట్టడం, చెరువు మట్టి తోలడం, సేంద్రియ ఎరువులు ముఖ్యంగా పశు వుల ఎరువు రెండు సంవత్సరాలకోక్కసారైనా వాడి నేల సారాన్ని తగ్గకుండా సూక్ష్మ క్రిములు, వానపాములకు నష్టం జరుగకూడని పద్ధతులు పాటించేవారు. ఏళ్ల తరబడి ఆచరించిన ఈ పాత పద్ధతులను మరచిపోయాం. ఈ దిశలో ఆలోచించే నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు కూడా తగ్గారు.
ప్రకృతి వ్యవసాయం:
ప్రకృతి వ్యవసాయంలో నేలల యాజమాన్యం సక్రమంగా జరిగి మామిడి, అరటి, సపోటా, రేగు, జామపండ్ల చెట్లు ప్రతి సంవత్సరం మంచి పంటనిస్తాయి. పూర్తిగా అదే విధంగా కాకున్నా మన రైతులు కూడా నేల యాజమాన్యంలో కొన్ని పద్ధతులు ముఖ్యంగా సేంద్రియ ఎరువులు వాడి పంటల దిగుబడి గణనీయంగా పెంచడానికి ఎన్నో మార్గాలున్నాయి. వర్షాభావ ప్రాంతాలు, చిన్న కమతాల్లో పురోగతి సాధించాలంటే వినూత్నంగా ఆలోచించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
మన పూర్వీకులు పాటించిన నేలల యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువులతో శ్రీ సుభాష్ పలేకర్ (మహారాష్ట్ర) పెంపొందించిన జీవా – మృతంతో మన వ్యవసాయం సస్య: శ్యామలం చేయవచ్చు. వీటితో వర్షం ఎక్కువైనా, తక్కువైనా పంట పెద్దగా నష్టపోయే అవకాశం లేదు. జీవా మృతం వల్ల నేలల సారం గణనీయంగా పెరిగి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయి.
నేలల్లో కోటానుకోట్ల జీవరాశులు, దేశీయ (నాటు) ఆవుపేడ వాడినందున సమృద్ధిగా వానపాములు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల నీటి నిలువ శక్తి, గణనీయంగా పెరిగి, నేలల ఉత్పాదక శక్తి పెరిగి, పంటలు బాగా పండు తాయి. జీవామృతం వాడిన రైతులు సాధించిన అధిక దిగుబడులు చిరస్మరణీయం. మిగతా రైతులూ జీవా మృతం విరివిగా వాడి దేశంలోని నేలలు సారవంతం చేసి ఆహార భద్రతలో తోడ్పడతారని ఆశించుదాం.
Also Read: Muskmelon and Watermelon: పుచ్చ, కర్బూజ పంటల్లో సస్యరక్షణ.!