తేనె చేసే మంచి అంతా ఇంతా కాదు. అందాన్నీ, ఆరోగ్యాన్నీ పెంచడంలో తేనె కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. అజీర్తి, నోటి దుర్వాసన వంటి సమస్యలకు తేనె మంచి పరిష్కారం.
తేనెకు కొవ్వును కరిగించే గుణం ఉంది. ప్రతి ఉదయం ఒక గ్లాసెడు గోరువెచ్చని నీళ్లలో కాసింత తేనె కలుపుకొని తాగితే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది.
తేనె కలిపినా నీరు తీసుకోవడం వల్ల గొంతులోని కఫం తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉపశమిస్తాయి.
అల్లం ముక్కను తేనెలో బాగా నానబెట్టి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహరం త్వరగా జీర్ణమవుతుంది.
చిన్న గ్లాసెడు నీళ్లలో అర టీస్పూన్ తేనె కలిపి పుక్కిలిస్తే నోటిలోని సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
అయితే.. బాగా ఎండలో తిరిగొచ్చిన తర్వాత, వ్యాయామం చేశాక తేనె తీసుకోకూడదు.
తేనె వలన కలిగే ఉపయోగాలు..
Leave Your Comments