తెలంగాణ

Minister Niranjan Reddy: ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ – మంత్రి నిరంజన్ రెడ్డి

1
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డీ నిరంజన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి అని అన్నారు

‘‘జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్ ’’

అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు ప్రసిద్ధి. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ.అప్పట్లోనే విష్ణు కుండినుల నుండి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల దాక గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయవృద్దికి బాటలు వేశారు.

Also Read: Minister Niranjan Reddy: తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం – కేరళ సదస్సులో మంత్రి నిరంజన్‌రెడ్డి

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

15వ శతాబ్దం నుండి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ది. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించారు అని మంత్రి నిరంజన్ అన్నారు. అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది అని 1956లో ఆంధ్రలో తెలంగాణ విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం అని మంత్రి చెప్పారు.

చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారు .. అప్పుడు కట్టిన ఒక్క ప్రాజెక్టు మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు నిర్ణీత లక్ష్యానికి సాగునీరు అందించిన దాఖలాలు లేవు.

ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగునీరు ఇస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారు. గ్రామాల్లో ఉపాధి కరువై బొంబాయి, దుబాయి బాట పట్టేలా చేశారు. ఆఖరుకు రూ.2కు కిలోబియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రూ.2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటయింది అని చంద్రబాబు చెప్పడం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. మూర్ఖపు అహంకారానికీ పరాకాష్టఅని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Also Read: Sustainable Agriculture: సుస్థిర వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉంది – రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్

Leave Your Comments

Minister Niranjan Reddy: తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం – కేరళ సదస్సులో మంత్రి నిరంజన్‌రెడ్డి

Previous article

International Year Of Millets 2023: తృణ ధాన్యాల ప్రాముఖ్యత మరియు సేద్యం పై అవగాహన ర్యాలీ.!

Next article

You may also like