తెలంగాణ

Minister Niranjan Reddy: తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం – కేరళ సదస్సులో మంత్రి నిరంజన్‌రెడ్డి

1
Minister Niranjan Reddy Participated in developing value chain in agriculture in kerala
Minister Niranjan Reddy Participated in developing value chain in agriculture in kerala

Minister Niranjan Reddy: కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో ‘వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం’ (developing value chain in agriculture ) అనే అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం అని 65 లక్షల మంది రైతులు 51 శాతం భూ విస్తీర్ణంతో కోటీ 50 లక్షల ఎకరాలలో వ్యవసాయం చేస్తూ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 18.2 శాతం ఆదాయం సమకూరుస్తుండడం గర్వకారణం అని తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలే ఈ విజయానికి కారణం అని ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు అందుకే వ్యవసాయానికి, వ్యవసాయ అనుకూల విధానాలకు తెలంగాణలో పెద్దపీట వేస్తున్నాం అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో అనుసరించిన విధానాల మూలంగా తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపాం అని మంత్రి సగర్వంగా తెలిపారు.

Also Read: Sustainable Agriculture: సుస్థిర వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉంది – రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

గత తొమ్మిదేళ్లలో పెద్ద ఎత్తున రైతాంగం వ్యవసాయం వైపు దృష్టి మళ్లించడంతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. యువత కూడా వ్యవసాయాన్ని ఒక ఉపాధి రంగంగా ఎంచుకుని ఆకర్షితులవుతున్నారు. వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచడానికి వ్యవసాయ ఆధారిత స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నాం. వివిధ రాష్ట్రాలలో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి పండే పంటల ఆధారంగా దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాల్సిన ఆవశ్యకత ఉన్నదని మంత్రి అన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే వ్యవసాయరంగం పట్ల కేంద్రంలోని ప్రభుత్వాల దృక్పధం మారాలి. వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంతో పాటు ఉత్పత్తులకు విలువను జోడించి ఎగుమతుల వైపు దృష్టి సారించాల్సి ఉంది. దేశంలో అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నా సాగు అనుకూల పరిస్థితులు లేని దేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దుస్థితి ఉండడం దురదృష్టకరం.

వ్యవసాయ ఉత్పత్తులకు విలువను పెంచే ఆహారశుద్ది పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం, పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించ లేకపోవడం శోచనీయం. సుస్థిర వ్యవసాయం దిశగా, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి ఈ సదస్సు తగిన సూచనలు చేస్తుందని ఆశిస్తున్నాను. వ్యవసాయ రంగ వృద్ది కోసం, ఉత్పత్తులకు విలువ కోసం కేరళ ప్రభుత్వం సదస్సు నిర్వహించడం అభినందనీయం అని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో ఫిక్కీ కేరళ అధ్యక్షుడు సావియో మాథ్యూ, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు సుధీర్, కేరళ పరిశ్రమల బ్యూరో జీఎం వన్ రాయ్ , తెలంగాణ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Minister Niranjan Reddy: మెట్ట భూములను మెరుగు పరచాలి – మంత్రి నిరంజన్ రెడ్డి 

Leave Your Comments

Sustainable Agriculture: సుస్థిర వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉంది – రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్

Previous article

Minister Niranjan Reddy: ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like