వార్తలు

పీఎం కిసాన్ యోజన పథకంలో ఉన్నవారికి మరికొన్ని సేవలు..

0

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం రైతులకు చేయూత అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులందరికీ చేయూత అందించే విధంగా పీఎం కిసాన్ సరికొత్త స్కీమ్ తెరమీదకి తెచ్చింది. ఈ పథకంలో సంవత్సరానికి రూ. 6 వేలు లభిస్తాయి. ఇప్పటికే రైతులకు 7 విడతల వారీగా నగదు జమచేసింది. ఇక 8వ విడత డబ్బులు మార్చి నెలలో వారి ఖాతాలలో జమచేయనుంది కేంద్రం. ఈ పథకంలో ఉన్న రైతులకు డబ్బుల బెనిఫిట్ మాత్రమే కాకుండా మరిన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ కార్డు, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన
పీఎం కిసాన్ యోజన రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. వీటి ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రూ. 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభంకానుంది.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకంలో ఉన్న రైతులకు ప్రత్యేకంగా ఫార్మర్ ఐడీ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ కార్డులతో రైతులకు వారి భూములను కూడా లింక్ చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వాలు తీసుకువచ్చే స్కీమ్ లలో రైతులకు నేరుగా ప్రయోజనం కలుగజేయనుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఉన్న రైతులకు ఇవే కాకుండా మరొక బెనిఫిట్ కూడా ఉంది. అదే కిసాన్ మాన్ ధన్ యోజన. ఇందులో చేరిన రైతులకు రూ. 6 వేల నుంచే నెలవారీ డబ్బులు కూడా కట్టొచ్చు.

Leave Your Comments

రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

బయట కూరగాయలు కొని దాదాపు ఐదేళ్లవుతుందంట..

Next article

You may also like