PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు బయో ఇన్ పుట్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (BIPA) సంయుక్తంగా “ఆంత్ర ప్రెన్యూర్ షిప్ మరియు కెరీర్ ఆపర్ ట్యూనిటీస్ ఇన్ బయో ఆగ్రో ఇండస్ట్రీస్” అనే అంశం పైన ఒకరోజు కార్యాశాలను (workshop) తేదీ. 20-02-2023 న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి వాతావరణ స్థితిస్థాపకత, రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల వాడకం తగ్గించడానికి సేంద్రీయ వ్యవసాయం ప్రత్యామ్నాయమని తెలుపుతూ, ఈ అంశంలో భారతదేశం 5వ స్థానంలో నిలిచిందని చెప్పారు. అంతేకాకుండా జీవ రసాయనాలు, జీవన ఎరువులు మరియు జీవ ఉత్తేజకాల లభ్యత మరియు నాణ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. అంతేకాకుండా ప్రయోగశాలలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను పరీక్షించి పూర్తిగా సేంద్రియమో కాదో చూడాలన్నారు.
విద్యార్థులు ఉద్యోగాలుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా ఉండాలని, అలా ఉండాలంటే విద్యార్థుల్లో వినూత్న ఆలోచన విధానం, సృజనాత్మకత, వ్యూహాత్మక ప్రణాళిక, ధైర్యం మరియు సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలని తెలియజేశారు. విశ్వవిద్యాలయం NABARD వారి సహకారంతో అగ్రి హబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వ్యవసాయానికి సంబంధించిన 32 అంకురాలు (స్టార్టప్స్) ఏర్పరచడం జరిగిందని తెలియజేశారు. విశ్వాసం, కోరిక, కష్టపడేతత్వం, బలమైన సంకల్పం మరియు నిజాయితీగా ప్రయత్నం కొనసాగిస్తే ఆంత్రపెన్యుర్ గా కాకుండా ఎవరూ ఆపలేరని తెలియజేశారు.
BIPA ప్రెసిడెంట్ డాక్టర్ K.R.K రెడ్డి మాట్లాడుతూ ఈ అసోసియేషన్ 20 సంవత్సరాల క్రితం స్థాపించి జీవ నియంత్రణ ఉత్పత్తుల పై పరిశోధన, వ్యాపారం వంటి అంశాలను చూస్తుందని తెలియజేశారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్. జగదీశ్వర్ మాట్లాడుతూ జీవ వ్యవసాయ ఉత్పాదకాల అవసరం ఎంతో ఉందని, అన్ని ఉత్పాదకాలను నమోదు చేయించాలని, విద్యార్థినీ విద్యార్థులకు ఆయా అంశాలపై పరిశోధన కార్యక్రమాలను రూపొందించుకోవాలని తెలియజేశారు.
రాజ్ కుమార్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, BIPA గారు BIPA గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమం అంతటిని వివిధ సాంకేతిక అంశాల వారిగా చర్చించారు. ఇంకా కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు డాక్టర్ సీమ,డాక్టర్ వి. అనిత, డాక్టర్ జె. సత్యనారాయణ, BIPA వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ రావు, జాన్ పీటర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతటిని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి పర్యవేక్షించగా, డాక్టర్ ఎస్. జె. రెహమాన్, సీనియర్ ప్రొఫెసర్ మరియు హెడ్, ఎంటమాలజీ సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక AELP, PG, మరియు Ph.D విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎస్. జె. రెహమాన్ స్వాగత ఉపన్యాసం చేయగా, సిహెచ్. వి. శ్రీనివాస్ వందన సమర్పణ గావించారు.
Also Read: Minister Niranjan Reddy: దేశానికి నూతన వ్యవసాయ విధానం అత్యవసరం – మంత్రి నిరంజన్ రెడ్డి