ఆరోగ్యం / జీవన విధానం

కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు ..

0
Curry Leaves
Curry Leaves

భారతీయ వంటకాల్లో కరివేపాకు లేనిదే వండరనేది అతిశయోక్తి కాదు. దీంతో వంటకాలు మంచి వాసన కలిగి ఉండడంతో పాటు ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉంటాయి. కరివేపాకు ఎన్నో సహజ సిద్ధ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కరివేపాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది కూరలో కరివేపాకు రాగానే తీసి పక్కన పెడతారు. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరానికి అవసరమయ్యే విటమిన్ – ఎ, సి లు కరివేపాకులో ఉంటాయి. కరివేపాకు వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్ ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తోంది.
కరివేపాకులో మెదడుతో సహా మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. కరివేపాకులో అధిక స్థాయిలో ఉండే విటమిన్ ఎ .. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి ఉపరితలం మీద ఉన్న కార్నియాను రక్షించే కెరోటినాయిడ్స్ విటమిన్ ఎ లో ఉంటుంది.
కరివేపాకులో కార్బోహైడ్రేట్లు. ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులో ఉన్న కార్బజోల్ ఆల్కలాయిడ్లలో అతిసారమును నిరోధిస్తుంది. కరివేపాకు ఆకులు లేదా పేస్ట్ తినడం వల్ల డమేరియాను నియంత్రించవచ్చు. కరివేపాకు వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కరివేపాకులో వుండే పోషకాలు కాలేయాన్ని కాపాడుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది.
ఇక కరివేపాకుతో జుట్టు మూలలను బలపరుస్తుంది. కరివేపాకు పొడిని ఆయిల్ లో కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. కరివేపాకు చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. కరివేపాకు ఆకుల రసం లేదా పేస్ట్ కాలిన గాయాలు లేదా తెగిన గాయాలు చర్మం దురదలు వంటి వాటిని తగ్గించేందుకు సహాయపడుతుంది.

Leave Your Comments

మొక్కకు ఈ బాక్స్ పెడితే చాలు.. నీళ్లు పొసే అవసరం లేదు

Previous article

మొక్కల్లో పోషకాలు వృద్ధి పరిచే మిశ్రమాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి

Next article

You may also like