Hanging Vegetables Pest Management: ఆంధ్ర రాష్ట్రంలో పండిరచే పందిరి (తీగ) కురగాయలలో ఆనప, గుమ్మడి, బీర, దోస, పొట్ల, కాకర, బూడిద గుమ్మడి, మరియు దొండ మొదలైనవి ముఖ్యమైనవి. వీటిని ముఖ్యంగా జూన్ – జూలై లలో మరియు డిసెంబర్ నుంచి జనవరి నెలలో విత్తుతుంటారు. తీగ జాతి కూరగాయలను ముఖ్యంగా నష్టపరిచే పురుగులు గురించి తెలుసుకుని తగు నివారణ మరియు యాజమాన్య పద్దతులు పాటించడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చు.
తీగజాతి కురగాయలను ఆశించే పురుగులు:
1. గుమ్మడి పెంకు పురుగులు: ఇవి చూడడానికి ఎర్రని, నల్లని మరియు బూడిద రంగులలో రెక్కలు కలిగి ఉండి, ఎగరే పెంకు పురుగులు. తల్లి పెంకు పురుగులు మొక్కల ఆకులపై చేరి, గుండ్రంగా గీత గీసుకుని అందులో ఆకును కొరికి తిని నష్ట పరుస్తుంది. వీటి వలన మొలకెత్తిన మొక్కలు, ఆకులు తీవ్రంగా నష్ట పోయి పత్రహరితాన్ని కోల్పోతాయి. వీటి పిల్ల పురుగులు తెల్లగా ఉండే మెత్తని శరీరం కలిగి భూమిలో ఉంటాయి. పిల్ల పురుగులు సాధారణంగా మొక్కల వేర్లను తింటూ నష్ట పరుస్తాయి. తీవ్ర దశలో ఆసిన్చినపుడు ఆకులతో పాటు పూలను కూడా పూర్తిగా తిని ఉత్పత్తి ని తగ్గిస్తాయి.
యాజమాన్యము:
వేసవిలో లోతైన దుక్కిలు చేసుకోవటం ద్వార భూమిలో ఉండే గుడ్డు దశలు, ప్యూప దశలను మరయు పిల్ల పురుగులను ద్వంశం చేయవచ్చు.
భూమిలో వేప పిండిని కలిపి కలియ దున్నడం వలన పెంకు పురుగులు గుడ్లు పెట్టకుండా ఆపవోచ్చు.
ఆకులపై తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోఫెనోఫోస్ 2 మీ.లీ. ను లీటర్ నీటికి లేదా మాలాథియాన్ 2 మీ.లీ. ను లీటర్ నీటికి లేదా క్లోరిపైరిఫోస్ 2 మీ.లీ. ను లీటర్ నీటికి చొప్పున ఆకులపైన మరియు మొదల్ల వద్ద కూడా పిచికారి చేసుకోవాలి.
2. పొట్ల ఆకు పురుగు: లద్దె పురుగులు లేత ఆకుపచ్చ రంగుని కలిగి ఉండి తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఇది ఆకులను, పూతను నష్టపరుస్థాయి
యాజమాన్యము:
క్లోరిపైరిఫోస్ 2 మీ.లీ. లేదా క్వినోల్ ఫొస్ 2 మీ.లీ. లేదా థయోదడికార్బ్ 1 గ్రాము ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
Also Read: Rabi Cultivation: రబీ సాగు విస్థరణ పై ఈశాన్య ఋతు పవన ప్రభావం.!
3. పండు ఈగ: ఇది ఎక్కువగా గుమ్మడి, పుచ్చ పంటలలో తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటితోపాటు టమాటో, మిరప, జామ, నిమ్మ మరియు తీగ జాతి కురగాయాలను కూడా ఆశించి తీవ్రంగా నష్టపరుస్థాయి. తల్లి ఈగ గోధుమ రంగులో ఉండి, పసుపు రంగు కాళ్ళని కలిగి ఉంటుంది. ఈ పండు ఈగ కాయలపైన, పూత పైన కన్నం చేసి గుంపులుగా గుడ్లు పెట్టి, జిగురు వంటి పదార్ధం తో కప్పుతుంది. గుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు లేత పసుపు రంగులో కాళ్ళు లేకుండా ఉంటాయి. ఇవి పండ్లని లోపల నుంచి తొలుచుకుని తింటూ పండ్లు / కూరగాయలను కుల్లింప చేయడము వలన ఇతర సూక్ష్మ జీవులు కూడా ప్రవేశించి రాలిపోయేల చేస్తాయి. కుల్లి రాలిన కాయలు నుంచి పిల్ల పురుగులు బయటకి వచ్చి భూమిలో కోసస్త దశకు చేసుకుని వాటినుండి మరల రెక్కల ఈగలు బయటకి వస్తాయి. తొలకరి వర్షాలు పడినప్పుడు వీటి ఉదృతి అత్యధికంగా ఉంటుంది.
యాజమాన్యము:
వేసవిలో లోతైన దుక్కులు చేసుకోటం, కుళ్ళి రాలిన పండ్లను ఏరి నాశనం చేయటము
మిథైల్ యూజినోల్ పండు ఈగ ఎరలను ఏర డబ్బాలలో ఉంచి, ఎకరాకు 2 బుట్టలు చొప్పున పండు ఈగలను ఆకర్షింప చేసి చంపవచ్చు.
మొక్కలు పూత మరియు పిందే దశలో మలాథైను 2 మీ.లీ. లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
విషపు ఎరలను తయారు చేసి (100 మీ.లీ. మలాథైను ం 100 గ్రా చక్కర / బెల్లం పాకం( 1 లీటర్ నీరు) ప్రమిదలలో పోసి పొలంలో అక్కడక్కడా పెట్టుకోవాలి.
తీగజాతి కురగాయలను ఆశించే తెగుళ్లు:
1. బూజు తెగులు: ఆకుల పై బాగాన పసుపు రంగు మచ్చలు మరియు అడుగు బాగాన ఊదా రంగు మచ్చలు మరియు బూజు వంటి పదార్ధం ఉంటుంది.
నివారణ : మాంకోజెబ్ 2.5 గ్రా లేదా మెటాలాక్సీల్ 2 గ్రా చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి
2. బూడిద తెగులు: ఆకులు పై బాగాన తెలుపు లేదా బూడిద రంగు మచ్చలు ఏర్పడి, క్రమేణా తెల్లని పొడి (బూడిద) వంటి పదార్ధం ఏర్పడి ఆకులు పండుబారి ఎండిపోతాయి.
నివారణ: ట్రైడిమార్ఫ్ 1 మి.లీ. లేదా డైనోకాప్ 1 మి.లీ. లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి
3. ఎండు తెగులు: ఈ తెగులు కలుగ చేసే శిలీన్ద్రం భూమిలో ఉండి వేరు వ్యవస్థను దెబ్బతీస్తుంది. కనుక తెగులు సోకిన మొక్కలు అకస్మాత్తుగా వాడిపోయి ఎండిపోతాయి
నివారణ : భూమిలో ట్రై కో డెర్మా విరిడే ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల వద్ద వేసుకోవాలి . ఆశించిన మొక్కలకు బోర్డో మిశ్రమము 1 % లేదా కాపర్ ఆక్సీ క్లోరైడు లీటర్ నీటికి 3 గ్రా. చొప్పున మొక్కల మొదలు చుట్టూ నేల తడిచేలా పది రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పోయాలి.
4. వెర్రి తెగులు: ఆకుల ఈనెలు మధ్య మందంగా చారలు ఏర్పడి, పెళుసుగా మారి, గిడసబారిపోయి పూత, పిందె ఆగిపోతుంది. ఈ తెగులు పేనుబంక అనే రసం పీల్చే పురుగు వలన వ్యాప్తి చెందుతుంది.
నివారణ : పేనుబంక నివారణ: డైమేథోయేట్ 2 మి.లీ. లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆశించిన మొక్కలను తీసి నాశనం చేయాలి.
Also Read: Bio Fertilizers: దుక్కి మందు వాడకపోయినా దిగుబడి తగ్గలేదు.!