Minister Niranjan Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సంధర్భంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఘణపురం బ్రాంచ్ కెనాల్ 14 కిలోమీటర్ వద్ద వయోడెక్ట్ పనులు పూర్తి చేసి షాపూర్, మానాజీపేట, కందూరు, ఉప్పరిపల్లి, అడ్డాకులకు సాగునీరు అందించే కాలువకు పూజచేసి, కేసీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా రైతులతో కలిసి కేక్ కట్ చేసి, స్వయంగా వడ్డించి, రైతులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు.
రైతు కష్టంలో లీనమై , రైతు కష్టం నుండి బయట పడేందుకు గొప్ప గొప్ప పథకాలు తెచ్చిన నాయకుడు దేశంలో ఎవరూ లేరు. తాగే నీళ్లలో, పొలాలాలో పారే నీళ్లలో, పండే పంటలో.. ధాన్యం కల్లాలలో పంటను అమ్మితే ఖాతాలో పడే డబ్బులో కేసీఆర్ ను చూస్తున్నారు. ప్రతి పథకం, ప్రతి పని, ప్రతి ఫలితంలో కేసీఆర్ కనిపిస్తారు. కొందరి పుట్టుక చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుంది. వర్తమానమే కాదు భవిష్యత్ తరాల చరిత్రకు కారకులుగా మిగులుతారు అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Also Read: Paddy Plantation: యంత్రాలతో వరినాట్లు వేసే విధానం.!
కేసీఆర్ తెలంగాణ పోరాటం, రాష్ట్ర సాధన, రాష్ట్ర అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు, నిర్ణయాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందుండడం విశేషం. మనిషి యొక్క దార్శనికత, పార్టీ యొక్క దార్శనికత చరిత్ర గతిని, కాల గతిని ఎలా మారుస్తాయో తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ ఉదాహరణ. పట్టుబట్టి అసాధ్యమన్న తెలంగాణను సుసాధ్యం చేశారు కేసీఆర్. వనపర్తి సాగునీళ్ల కోసం ఎంతో కష్టపడ్డాం .. ముఖ్యమంత్రిని ఒప్పించి, మెప్పించి సాగునీళ్లు తీసుకొచ్చాం. పెద్దమందడి, ఘణపురం కాల్వల ద్వారా 75 వేల ఎకరాలకు నీరు అందించడం చాలా గర్వకారణం.
25 టీఎంసీల కేటాయింపును 40 టీఎంసీలకు పెంచి సాగునీటిని సాధించాం. సాగునీరు వచ్చాక రైతులలో ధీమా పెరిగింది.. పండే పంటను, పారే నీళ్లను చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. వనపర్తి ప్రాంతానికి సాగు నీళ్లు సాధించేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Also Read: ‘Sri’ Method Cultivation in Paddy: వరి లో ‘ శ్రీ ‘ పద్దతి సాగు వలన లాభాలు.!