ANGRAU: ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ పల్లి సుబ్బారెడ్డి, యూకే లోని కెంటకి విశ్వవిద్యాలయంలో స్టేట్ ఎంటమాలజిస్ట్ గా పని చేస్తున్నారు. వారు ఈరోజు గుంటూరు లామ్ లోని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవ ఉపకులపతి విశ్వ విద్యాలయంలో పరిశోధన, విస్తరణ మరియు వ్యవసాయ విద్యలోని ప్రగతిని, వివరించారు. 1964లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం నుండి సుమా రు 32,000 మంది పట్టభద్రులు, 1100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వివిధ రంగాలలో పనిచేస్తున్నారని, జాతీయ స్థాయిలో 11 వ స్తానములో ఉన్న విశ్వవిద్యాలయం నుండి విడుదల ఐదు వంగడాలు దేశములో 34% లో విస్తరించాయని, ప్రస్తుత వ్యవసాయంలో కూలీల కొరతని అధికమించడానికి యాంత్రికంణలో తీసుకున్న చర్యలు, డ్రోన్స్ తదితర విషయాల గురించి తెలియజేసారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మరియు పీజీ డీన్ అయిన డాక్టర్, జి. రామారావు గారు కంటకి విశ్వవిద్యాలయంతో విద్యార్థులను మరియు పరిశోధనం కొలాబరేట్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు వారి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు ముఖ్యంగా జీన్ ఎడిటింగ్, సేంద్రియ వ్యవసాయం, పురుగు మందు లేకుండా పురుగుల నియంత్రణ పద్ధతులు, వంధ్య మగపురుగులను జీన్ ఎడిటింగ్ ద్వారా తయారుచేసి వాతావరణంలోకి విడుదల చేసి దోమలు మరియు కత్తెర పురుగు మొదలగు వాటిని నివారించే పద్దతులు తెలియజేశారు.
విశ్వవిద్యాలయంలో ప్రగతిని కొనియాడుతూ వారి విశ్వవిద్యాలయంతో లింకేజెస్ పెంచుకునే మార్గాలను తెలియజేశారు. ఈ సందర్భముగా డాక్టర్ పల్లి సుబ్బారెడ్డి గారిని డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవ ఉపకులపతి సన్మానించారు.
కార్యక్రమములో పరిశోధన సంచాలకులు డా. ఎల్. ప్రశాంతి గారు, విస్తరణ సంచాలకులు డా. పీ. రాంబాబు గారు, వ్యవసాయ ఇంజినీరింగ్ పీఠాధిపతి డాక్టర్ ఏ. మణి గారు, సామాజిక విజ్ఞాన పీఠాధిపతి డాక్టర్ సి. హెచ్. చిరంజీవి గారు, డీ.ఎస్.ఎ. డా.పి.సాంబశివరావు గారు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి. సుధాకర్ గారు, విశ్వవిద్యాలయ కంట్రలర్ డాక్టర్ ఏ. వి. రమణ గారు, డైరెక్టర్ సీడ్స్ డా.ఎ.సుబ్బరామి రెడ్డి గారు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ.పి. రవి గారు మరియు టేక్నికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
Also Read: National Livestock Mission Subsidy Scheme: గొర్రెలు, మేకల పెంపకంపై రూ.50 లక్షల సబ్సిడి.!