పండ్ల తోటల్లో ప్రధాన పంట మామిడి. మామిడి సాగులో ఎప్పటికప్పుడు సస్య రక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు. పూత శాతం పెంచడానికి సస్య రక్షణ చర్యలను సూచిస్తున్నారు. పూత, మొగ్గలను ఉత్తేజ పర్చి త్వరగా పూత తెప్పించడానికి ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్, 2 గ్రాముల బోరాన్ కలిపి పిచికారీ చేయాలి.
జనవరి నెలలో మొక్కలు పచ్చి పూత దశలో ఉంటాయి. దీనివల్ల తేనెమంచు ఆవకాశం ఉంటుంది. వీటి నివారణకు లీటరు నీటిలో ఫాస్ఫామిడాన్ 0.5 మిల్లీ లీటరు లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటరు చొప్పున కలిపి పూత మొదలయ్యె సమయం పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపై కాకుండా చెట్టు మొదళ్ళు, కొమ్మలపై పిచికారీ చేయాలి.
మామిడి లేత పూత దశలో తేనెమంచు పురుగు, మిడ్జ్ పురుగు పువ్వు మొగ్గలను తినే గొంగళి పురుగు, పేనుబంక తెగుళ్లలో బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తాయి. చెట్ల మధ్య గాలి వెలుతురు లేకపోవడంతో గాలిలో తేమ అధికంగా వుంది వాతావరణం మబ్బుగా వున్నప్పుడు తేనెమంచు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
పూత దశ నుంచి పిందె దశ వరకు నష్టపరుస్తాయి. ఈ పురుగులు రెమ్మలపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. పిందెలు ఏర్పడే దశలో ఈ పురుగులు పిందెల్లోకి తొలుచుకుపోయి పిందెలు పసుపు రంగుకు మారి రాలిపోయేలా చేస్తాయి.
మామిడి కాపునకు వచ్చిన మామిడి చెట్లకు నీటి పారుదల 3 లేదా 4 తడులు కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. పూత మొగ్గలు ఏర్పడానికి చెట్టు పరిస్థితులను పరిశీలించాలి.
ఫిబ్రవరిలో ఎరువులు వేసిన తర్వాత ప్రతి 15 రోజుల వ్యవధిలో ఒకసారి నీరు పెట్టాలి. ఇలా చేస్తే కాయ ఎదుగుదల బాగుండి నీరందించే తోటల్లో పదేళ్ల వయసుబడిన పెద్ద చెట్లకు 50 నుంచి 80 లీటర్ల నీరు అందేలా చూడాలి. పిందెలు సమయంలో పిందెలు ఎదుగుతున్న సమయంలో నీరు అందించడంతో పాటు, 30 రోజులకొకసారి నీరు అందించాలి. సేద్యం ద్వారా ఎరువులను అందించినట్లయితే ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. పూతను తినే గొంగళి పురుగులు పూలగుత్తులను గూడుగా చేసి అందులో ఉంటూ పూలను తినేస్తాయి. ఈ పురుగులు ఆశించిన పూలగుత్తుల్లో పిందెలు ఏర్పడవు. ఈ లేత దశలో ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు చాలా ప్రమాదకరమైనది. ఈ తెగులు పూరెమ్మల మీద, లేత రెమ్మల మీద, పిందెల మీద బూడిద రంగు వున్న తెల్లటి బూజును వ్యాప్తి చేస్తుంది. చెట్లు పూత ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ చీడల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.5 ఎం.ఎల్) లేదా థయామిథాక్సిన్ ( లీటరు నీటికి 0.3 గ్రాములు )పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం ( లీటరు నీటికి 3 గ్రాములు) కలిపి మొగ్గలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పూర్తిగా ఎదిగిన పూతకు ఈ మందు పిచికారీ చేయవద్దు. అలా చేయడం వల్ల మామిడిలో పిందె కట్టడానికి సాయపడే కీటకాలు, తేనెటీగలు చనిపోతాయి. పూలలో పుప్పొడి మందుకు కొట్టుకుపోతుంది. దీంతో పూలలో సంపర్కం జరగక పిందెలు ఏర్పడవు.
మామిడిలో పూత, పిందె సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..
Leave Your Comments