Pest in Tobacco Crop: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీడి మరియు సిగరెట్ నాటు పొగాకును నల్లరేగడి నేలల్లో వర్షాధారపు పంటగాను మరియు తేలికపాటి నేలల్లో నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా పండిరచుచున్నారు. పొగాకును సాగు చేసే రైతుల కోసం అఖిల భారత పొగాకు సమన్వయ పథకం, రాజమండ్రి వారు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల నందు 1992 నుండి బీడి మరియు సిగరెట్ నాటు పొగాకులో దిగుబడి, నాణ్యత, వంగడాల ఎంపిక, భూసార సంరక్షణ అంశాలపై పరిశోధనలు జరుగుచున్నాయి. నల్లరేగడి నేలలకు వర్షాధారపు కింద అధిక దిగుబడి మరియు నాణ్యత కలిగిన బీడి పొగాకు రకం నంద్యాల పొగాకు-1ను 2015 సంవత్సరంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలై ప్రాచుర్యం పొందుతుంది. ఇటీవలికాలంలో ఎ.బి.డి. 132 అను పొగాకులో తక్కువ హానికారకాల శాతం కలిగిన బీడి పొగాకును గుర్తించడం జరిగి విడుదలకు పంపించడం జరిగింది. రైతులు బీడి మరియు సిగరెట్ నాటు పొగాకు లాబధాయకంగా ఉండడానికి ఈ క్రింద సిఫారసు చేసిన సస్య రక్షణ చర్యలను పాటించి అధిక దిగుబడి మరియు ఆకు నాణ్యతను పొందవచ్చను.

Insects in Tobaccco Crop
చీడపురుగుల నివారణ –
పొగాకు లద్దె పురుగు :
. పొగాకు లద్దె పురుగు నారుమడి మరియు నాటువేసిన పొగాకుపై ఆశించి అధికంగా నాశనం చేస్తుంది.
. ఈ పురుగు ఆకులపై గ్రుడ్ల సముదాయము పెట్టి పిల్ల పురుగులు జల్లెడ ఆకులు చేసి నాశనం చేస్తాయి.
. ఈ పురుగు నివారణ ఎర పంటగా ఆముదము నారుమడి చుట్టు మరియు నాటు వేసి పొగాకు చుట్టు 10-15 రోజుల ముందు ఆముదము విత్తుకోవాలి.
. హెక్టారుకి 10 చొప్పున లింగాకర్షక బుట్టలు వాడవలెను.
. వేసవిలో లోదుక్కి చేయవలెను.
. 0.5 శాతం వేపపప్పు ద్రావణం లేదా ఎన్.పి.వి. సోకిన 250 లద్దె పురుగుల నుండి తయారు చేసిన 500 లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేయవలెను. అదేవిధంగా లీటరు నీటికి 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి పిచికారి చేయాలి.
పేనుబంక :
. పేనుబంక ఎక్కువగా చలికాలం మొదట్లోగాని, నవంబరు రెండవ పక్షము, డిసెంబరు మొదటి పక్షంలోగాని ఆశించడం జరుగుతుంది.
. పిల్ల మరియు పెద్ద పురుగులు రసం పీల్చడం వల్ల నల్లని బంక ఏర్పడి నాశనం చేస్తుంది.
. ఆకులు క్యూర్ చేయడానికి పనికిరావు. క్యూర్ చేసిన నాణ్యత బాగా తగ్గిపోతుంది.
. ఎసిఫేట్ 75 శాతం ఎస్.పి. మందు 10 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 ఎస్.ఎల్. మందు 2.5 మి.లీ. లేదా థయోమిధాక్సామ్ 25 డబ్ల్యు.జి. మందు 2 గ్రా. గాని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
పిండి నల్లి (నాంజేడు) :
. బీడి పొగాకుకు 2009 సంవత్సరంలో ఈ పిండినల్లి ఆశించడం జరిగింది. పిల్ల, పెద్ద పురుగులు ఆకు క్రింది బాగాన రసం పిల్చడం వల్ల ఆకులు ఎండిపోవడం జరిగుతుంది.
. దీని నివారణకు ఎసిఫేట్ 75 శాతం పొడి మందు 15 గ్రా. లేక ప్రొఫినోఫాస్ 50 శాతం ఇ.సి. 20 మిల్లీ లీటర్ల మందును 10 లీటర్ల నీటిలో లేదా లీటరు నీటికి 0.25 గ్రా. డయఫెంతురియన్ కలిపి పిచికారి చేయవలెను.
తెల్లదోమలు :
. ఆకుముడత సోకిన పొగాకు మొక్కలను మరియు ఇతర మొక్కలను పీకి నాశనము చేయాలి. ఎకరాకు 4-5 పసుపురంగు ట్రాపులను ఏర్పాటు చేసి దోమ ఉధృతిని గమనిస్తుండాలి.
. వీటి నివారణకు లీటరు నీటికి 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.25 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 0.25 గ్రా. డయఫెంతురియన్ కలిపి పిచికారి చేసి నివారించవచ్చును.
Also Read: Topping and De-suckering in Tobacco: పొగాకు సాగు లో తలలు నరకటం, పిలకలు తీసివేయటం కలిగే ఉపయోగాలు
తెగుళ్ళ నివారణ –
నారుమళ్ళలో మాగుడు తెగులు :
. వేసవిలో లోదుక్కి చేయాలి.
. ప్రతి సంవత్సరం నారు పోసే స్థలాన్ని మార్చుకోవాలి
. విత్తడానికి ముందు నారుమళ్ళపై నెమ్మదిగా కాలే ఏదైనా వ్యవసాయ వ్యర్థ పదార్థాలను పరచి, కాల్చి, మడిని శుద్ధి (రాబింగ్) చేయవలెను.
. సిఫార్సు చేసిన మోతాదులో విత్తనాలను విత్తాలి.
. మైలతుత్త ద్రావణము 0.4 శాతం గాని కావర్ ఆక్సీక్లోరైడు 0.2 శాతం గాని విత్తనము మొలకెత్తిన రెండు వారాల తర్వాత నాలుగు రోజులకొకసారి మడిపై రోజ్ క్యాన్‌తో చల్లాలి.
. విత్తనము మొలకెత్తిన 20వ రోజున మరియు 30వ రోజున రిడోమిల్ ఎం. జెట్ 72, డబ్ల్యు.పి. మందు 20 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆకుమచ్చ లేక నల్లకాడ లేక మానుకుళ్ళు తెగులు :
. సిఫార్సు చేసిన మోతాదులో విత్తనాలను విత్తాలి. మైలతుత్త ద్రావణము 0.4 శాతం గాని, కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.2 శాతం గాని విత్తనము మొలకెత్తిన రెండు వారాల తర్వాత నాలుగు రోజులకొకసారి మడిపై రోజ్ క్యాన్‌తో చల్లాలి.
. విత్తనం మొలకెత్తిన 20వ రోజున మరియు 30వ రోజున డోమిల్ ఎంజెడ్ – 72 డబ్ల్యు.పి. మంద 20 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
. పొలంలో మొక్క నాటకముందు మొదలులో 100 మి.లీ. 0.2 శాతం. కాపర్ ఆక్సిక్లోరైడ్‌ని పోయాలి.
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు :
. ఆకులపై మరియు కాండముపైన గోధుమ రంగు వలయకారపు మచ్చలు ఏర్పడుతాయి. ఇవి క్రమేపి పెరిగి పెద్దవై ఆకు పూర్తిగా ఎండిపోతుంది.
. నత్రజని అధికంగా వాడరాదు.
. మాంకోజెబ్ 0.3 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
సీతాఫలం తెగులు / టి.యం.వి. :
. తెగులు సోకిన మొక్కలను తాకిన చేతులతో, వ్యవసాయ పనిముట్లతో ఆరోగ్యకరమైన మొక్కలను తాకరాదు.
. వ్యాధి సోకిన మొక్కలు తీసివేసి నాశనమ చేయవలెను.
Also Read: Tobacco Weed Management: పొగాకులో కలుపు యాజమాన్యం.!
Also Watch: