New Agriculture Technology: ఇటీవల కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రైతులకు చాలా అనుగుణంగా ప్రోస్తాహం పథకాలు చేపట్టారు తద్వారా వివేకంతో వ్యవసాయంలో కొత్త కొత్త విధానాలు పద్దతులు చేపట్టి అధిక లాభాలు పొందుతున్నారు అలాంటి నూతన విధానాలు ప్రతి రైతుకూ తెలియజేయాలని మా ఈ ప్రయత్నం అవేంటో చూద్దాం రండి.
డ్రోన్ టెక్నాలజీ (డ్రోన్ సాంకేతిక):-
• డ్రోన్ టెక్నాలజీ అనే నూతన విధనం ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రలలో ఊపందుకుంటోంది దీని ద్వారా పురుగు మందులు శీలింద్ర నాషకలు ఎరువులను మరియు కలుపు మందులను సమర్థవంతంగా పిచికారి చేసుకోవచ్చు.
డ్రోన్ టెక్నాలజీ వలన లాభాలు:-
• శ్రమ మరియు సమయం ఆధా అవుతాయి.
• క్లిష్టంగా ఏగుడు దిగుడుగా వున్న నెలలో గల పంటలో రైతులు పిచికారి. చేయడం కష్టంతో కూడుకున్న పని అలాంటి సందర్భంలో ఈ టెక్నాలజీ చాలా సమర్థవతంగా పని చేస్తుంది.
• కూలీల కర్చు తగిస్తుంది.
• దీనికి గల కెమెరా ద్వారా పంట స్థితి గతులు కూడా తెలుసుకోవచ్చు
పరిమితులు:-
• ఖర్చుతో కూడుకున్న పని.
• చిన్న చిన్న కమతాలకు పోటీ ఉపోయాగం అంతగా అవసరం లేదు.
సేంద్రియ వ్యవసాయం:-
• సేంద్రియ వ్యవసాయని అవలంబించడం ద్వారా పంట నడ్వత బాగుండమే కాకుండా నేల సారం కూడా వృది చెందుతుంది నేల చివరి దుక్కిలో FYM వేసి కలయ దున్నటం వలన నేల నిర్మాణం వృద్ధి చెందడమే కాకుండా పంటకు పంటకు పోషకాలు కూడా అందుతాయి పండ్లు,కూరగాయలు, పూలు వంటి పంటలకు ఆఖరి దుక్కిలో వర్మికంపోస్టు (వానపాముల కంపోస్టు ఎరువు) వేసి దున్నుకుంటే పంట నాణ్యత మెరుగుపడుతుంది జనుము,జీలుగా,పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పూత దశలో ఉండగా నేలలో వేసి కలియ దున్నుకోవడం వలన పంటలకు పోషకాలు పుష్టిగా అందుతాయి అంతే కాకుండా జీవామృతం పంచగవ్య లాంటి సేంద్రియ.
ఏరుపులకు ,సేంద్రియ కీటక నాశీనులను కూడ రైతులు విరివిగా వినియోగించుకోవాలి.
మిశ్రమ వ్యవసాయం:-
• కేవలం ఒకటి,రెండు పంటలు మాత్రమే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు,పప్పులు వంటి దినసరి ఆహార పదార్థాలను కూడా రైతులు పందించుకోవడం వలనా ఖర్చులు తగించుకోవచ్చు.
• గేదెలు, గొర్రెలు,కోళ్లు, ఆవులు, ఏద్దులు వంటి పడిపషువులను పెంచుకోవడం వలన అదనపు ఆదాయం పొందవచ్చు మరియు వ్యర్ధాలను పంటలకు ఏరువుగా వినియోగించుకోవచ్చు.
వ్యవసాయంలో యంత్రాంగం పాత్ర:-
• ఇటీవల వస్తున్న ఏన్నో రకాల నూతన యంత్రాంగాలు రైతులకు చాలా శ్రమను తగిస్తున్నాయి దాదాపు ప్రతి పంటకు కావాల్సిన కోత (హార్వెస్టింగ్) యంత్రాలు మార్కెట్లో అందుబాటులో వున్నాయి .
• ఊధారణకు:- పత్తితీసే యంత్రం, మామిడి కాయలను కోసే యంత్రం,మరియు వివిధ పంటలకు సరిపడే కంబైన్ హర్వేస్టర్లు అందుబాటులో వున్నాయి అంతే కాకుండా వీటి కొనుగోలు పై ప్రభుత్వం చాలా రకాల సబ్సిడీలు కూడా ఇస్తుంది కావున రైతు సోదరులు ఇలాంటి యంత్రాంగాలు వినియోగించి కూలీ ఖర్చులు తగించుకొని అధిక లాభాలు పొందగలరు.
వ్యవసాయంలో ద్రవ యూరియా వినియోగం:-
• IFFCO విడుదల చేసిన ద్రయ యూరియా (ననోయురియ) వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది వీటి వినియోగం చాలా సులభం మరియు నిల్వ చేయడం కూడ సులువు నేరుగా పంట పై పిచికారి చేయడం వలన పంటకు పోషకాలు త్వరగా మరియు సమర్థవంతంగా అందుతాయి.
• ఇంతే కాకుండా ఇలా రోజు రోజుకు కొత్తగా వస్తున్న సాంకేతికతను రైతు సోదరులు తెలుసుకొని వివేకంతో అవలంబించాలని మా “ఎరువాక”కథనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
Also Watch: