ఆరోగ్యం / జీవన విధానం

మునగాకు ఉపయోగాలు..

0

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. మునగ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. ఆకులే కాదు వాటి పువ్వుల్లో కూడా మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. మునగ శాస్త్రీయ నామం “మొరింగ బలిఫెర” ఇది మొరింగేసి కుటుంబంలోనిది. విశేషమైన పోషకాలున్న చెట్టుగా ఇది ప్రసిద్ధి కూడా. 5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. మునక్కాయలు అంటే దక్షిణాది తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా మునగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మునక్కాయలు. వీటిని అందరూ ఇష్టంగా లాంగించేస్తారు. మునక్కాయలు కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. మనగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మునగాకులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.
ఆరోగ్యంతోపాటు అధిక బరువును తగ్గించి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో పోషకాలు లభించే ఆహార పదార్థాల్లో మునగాకులు ముందు స్థానంలో ఉంటాయి. మునగ ఆకు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడమే కాదు, రక్తంలోని అధిక చక్కెరలను నియంత్రించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది.
పెద్ద పేగులను కూడా శుభ్రం చేసి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జీవక్రియలను ఉత్తేజితం చేస్తుంది. మునగ ఆకులో వుండే పోషకాలు, యాంటీ ఆక్సీడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కర, కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. కాలేయం, మెదడు ఆరోగ్యానికి మునగాకులో విటమిన్ -సి ఏడు రేట్లు కంటే 15 రేట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్ – ఎ, కాల్షియం కూడా మునగాకుల్లో విరివిగా లభిస్తాయి.
రక్తపోటును నియంత్రించి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటీస్ లాంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాదు చర్మంలోని మృత కణాలను తొలగించి మృదువుగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల సమతౌల్యతను కాపాడి, కండరాల వాపు తగ్గించి, మంచి కొవ్వును అందిస్తుంది. అలెర్జీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాన్సర్ కణాలతో పోరాడీ ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార, అండాశయ కాన్సర్లను నిరోధిస్తుంది. మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. శరీరంలో నీటి సాంద్రతను సమతాస్థితిలో ఉంచుతుంది.
ఇందులో వుండే కాల్షియంతో ఎముకలు బలంగా తయారవుతాయి. బాలింతలు తీసుకుంటే తల్లిపాలు పిల్లలకు పుష్కలంగా అందుతాయి.
థైరాయిడ్ సమస్యలను కూడా నివారిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ చర్యలను అదుపులో ఉంచుతుంది. దీనిలో అధిక మొత్తంలో వుండే ప్రోటీన్లు, పీచు పదార్థాలు, కాల్షియం, తక్కువ పరిమాణంలో కొవ్వు శరీరానికి సహజమైన శక్తిని అందిస్తాయి. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో మునగాకు రసం సాయపడుతుంది. దీని వల్ల లివర్ పనితీరు సక్రమంగా ఉంటుంది.
రేచీకటి, కంటి సమస్యలు వున్నవాళ్లు క్యారెట్ ఎక్కువగా తింటూ వుంటారు. దీనితో పాటు మునగాకు రసంలో కొంచెం తేనె వేసుకొని బాగా రసాన్నితాగడం వలన రేచీకటి తగ్గడంతోపాటు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మునగ పువ్వులను సేకరించి వాటి రసం తీసుకోవాలి. ఒక స్పూన్ మునగ పువ్వు రసంలో గ్లాస్ మజ్జిగ కలిపి తాగాలి. ఈ ఔషధాన్ని తరుచూ తాగడం వల్ల అజీర్తీ, ఉబ్బసం నుంచి ఉపశమనాన్నిస్తుంది.
మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు మునగాకు రసంలో కొద్దిగా లేతకొబ్బరి నీరు పోసి కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Leave Your Comments

తమలపాకు పంటలో సస్య రక్షణ – నివారణ చర్యలు

Previous article

స్వచ్ఛమైన ఆనందం పేరుతో పాల కేంద్రం ఏర్పాటు..

Next article

You may also like