ఆరోగ్యం / జీవన విధానం

Flower Tea: నయా ట్రెండీ ఫ్లవర్ ‘టీ’.!

0
Flower Tea Benefits
Flower Tea Benefits

Flower Tea: మారుతున్న కాలంతో పాటు మన అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి , పెరుగుతున్న కాలుష్యం తగ్గుతున్న మానవుని ఆయుర్దాయం మనలో భయాన్ని, ఆరోగ్యం పట్ల బాధ్యతల్ని పెంచుతున్నాయి. మనలో చాలా మందికి టీ త్రాగటంతోనే రోజు మొదలు అవుతుంది , అలాంటిది ఆ టీ మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిస్తే ఎంత బాగుంటుంది, ఇలా మన ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా పుట్టుకొచ్చినవే ఈ కొత్త తరం ‘టీ’ లు.

అల్లం టీ , మషాలా టీ , శొంఠి టీ , బెల్లం టీ ఇంకా చెప్పుకుంటూ పోతే మరెన్నో… కానీ వీటికి బిన్నంగా ‘ఫ్లవర్ టీ బ్యాగ్స్ ‘ ఇప్పుడు మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫ్లవర్ టీ తయారీ లో వాడేవి మరేవో కావు మనం రోజు చూసే పూలనే , వీటిలో వివిధ రకాల పూలను సమూలంగా లేదా కొన్ని రేకులను ఎండబెట్టి తేయాకుల కలయికతో తయారుచేస్తారు. ఇటువంటి ‘టీ’లను రోజు సేవించడం వలన వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లు , మినరల్స్ తో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.

Also Read: Health Benefits of Ziziphus Oenoplia: చలి కాలంలో లభించే “పరికి పళ్ళ” వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.!

Hibiscus Flower Tea

Hibiscus Flower Tea

ఉదాహరణకు Hibiscus ( మంధారం ) టీ ని సేవించటం వలన మన శరీరంలోని అధిక కొవ్వుని మరియు రక్త పోటును తగ్గిస్తుంది, Rose ( గులాబీ )టీ ని సేవించటం వలన ఉదర సంబంధమైన మరియు ఆడవారిలో రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి , Marigold ( బంతి పువ్వు ) టీ లో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి ,Blue Pea ( నీలం శంఖపుష్పి )టీ ని సేవించటం వలన మన శరీరంలోని అధిక కొవ్వును తగ్గించి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది, Sunflower ( ప్రొద్దుతిరుగుడు ) టీ ని సేవించటం వలన మన గొంతు సమస్యలను మరియు టాన్సిల్స్ నొప్పిని తగ్గిస్తుంది, Jasmine ( మల్లె ) టీ ని సేవించటం వలన కాలేయ వ్యాధులు మరియు వెన్ను నొప్పి సమస్యలు తగ్గుముఖం పడతాయి , ఇలా ఒక్కో పువ్వు ఒక్కో రకమైన రుగ్మతులకి మందుగా పనిచేస్తుంది. ఈ ఫ్లవర్ టీ బ్యాగ్లు ఇపుడు కొన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు అయిను అమెజాన్, ఫ్లిప్కార్ట్ , జియో మార్టు మరియు ఈ – బేలలో అందుబాటులో ఉన్నాయి ,రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తులతో దేశీయ పూల మార్కెట్లకు మరింత ఆదాయం రాబోతుంది.

Also Read: Flax Seeds Health Benefits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు!

Recommended Video:

Suggested Video:

Leave Your Comments

Health Benefits of Ziziphus Oenoplia: చలి కాలంలో లభించే “పరికి పళ్ళ” వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.!

Previous article

Mulching Technique in Chilli Crop: మల్చింగ్‌ పద్ధతిలో మిరపసాగు లాభదాయకం.!

Next article

You may also like