వ్యవసాయ పంటలు

Ginger Crop Cultivation: వేసవి అల్లం సాగులో మెళుకువలు.!

1
How to Grow Ginger
How to Grow Ginger

Ginger Crop Cultivation: వాణిజ్య, సుగంధద్రవ్య పంటల్లో అల్లం ప్రధానమై నది. దేశవ్యాప్తంగా అల్లం పంటను సుమారు 1.6 లక్షల హెక్టార్లలో సాగుచేస్తూ 10.70 లక్షల టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. అల్లాన్ని ఎక్కువగా కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బంగ, అస్సాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సాగులో ఉంది. వాతావరణం:

అల్లం వేడిగా, తేమతో కూడిన వాతా వరణంలో పెరుగుతుంది. సముద్రమట్టం నుంచి 1500 మీ. ఎత్తువరకు వర్షాధారంగా లేదా నీటి వసతిగల ప్రదేశాల్లో సాగుచేసుకో వచ్చు. అల్లం పండించడానికి 19-28 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత అనుకూలం.

నేలలు:

6-6.5 ఉదజని సూచిక, అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర చెల్కా గరపనేలలు అనుకూలం. బరువైన బంకమట్టి మురుగునీటి సౌకర్యంలేని నేలలు అల్లం సాగుకు అనుకూలం కావు. దుంపకుళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది.

Techniques in Summer Ginger Crop Cultivation

Techniques in Summer Ginger Crop Cultivation

రకాలు:

మారన్, ఎర్నాడ్, వైనాడ్ లోకల్, హిమాచల్, నర్సీపట్నం లోకల్, సిద్దిపేట లోకల్, నాడియా, రియో-డి-జెనిరో, దేశీయరకాలు విస్తృతంగా సాగులో ఉన్నాయి. అభివృద్ధి పరిచిన ఐ.ఐ.ఎస్.ఆర్. రకాలు వరద, ఐ.ఐ.ఎస్.ఆర్. మహిమ, ఐ.ఐ. ఎస్. ఆర్. రజిత, సుప్రజ, సురుచి, సురవి, సుభద్ర, హిమగిరి మొదలైనవి.

విత్తే సమయం:

దుంపలు విత్తేందుకు వర్షపాతం లేదా నీటివసతి కావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ రెండు, మూడో వారం నుంచి మే నెల మూడోవారంలోగా విత్తుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేన ప్పుడు భూమి తయారీ ఆలస్యమైన ప్పుడు మే నెల చివరివరకు విత్తుకో వచ్చు. విత్తడం ఆలస్యమైతే దుంప కుళ్ళు ఆశించి తాయి.

Also Read: Vegetables Cultivation: వేసవిలో తీగజాతి కూరగాయల సాగులో మెళుకువలు.!

విత్తన మోతాదు:

విత్తేదూరం, రకాన్నిబట్టి 600-1000 కిలోల విత్తనం ఒక ఎకరాకు అవసరం. మెట్టప్రాంతాల్లో 600-700 కిలోల విత్తనం అవసరం. ఎత్తయి గిరిజన ప్రాంతాల్లో 900-1000 కి విత్తనం వాడాలి. ఆరోగ్యంగా ఉం 2-3 మొలకలు వచ్చి 40-50 గ్రా. బరువున్న దుంపలను విత్తనం కింద వాడుకోవచ్చు.రెండు కణుపులు కలిగిన దుంప లను ఉపయోగించి మొక్కలను ట్రేలలో పెంచి 30-40 రోజుల వయస్సుండే నారును ప్రధాన పొలంలో నాటుకుంటే ఎక రాకు 250-300 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే నారు నాటేటప్పుడు నేలలో సరిపడా తేమ ఉండాలి.

Ginger Crop Cultivation

Ginger Crop Cultivation

విత్తన ఎంపిక:

తెగులు సోకని పంటనుంచి సేకరించిన బలమైన విత్తన దుంపలను ఎన్ను కోవాలి. 2.5-3 సెం.మీ. పరిమాణంలో మొలకవచ్చిన దుంపలను సుమారు 25-30 గ్రా. బరువుండేలా ముక్కలుగా చేయాలి.

లీటరు నీటికి 3గ్రా. రిడోమిల్ ఎం.జెడ్ లేదా 3గ్రా. మాంకోజెబ్ + 5మి. లీ. క్లోరిపైరిఫాస్ ద్రావణాన్ని కలిపి ఆ ద్రావణంలో దుంపలను 30-40 నిమి – షాలు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టాలి. తర్వాత కొత్తగా నీరు తీసుకొని లీటరు నీటికి 4-5గ్రా. చొప్పున ట్రైకోడెర్మావిరిడి కలిపి ఆ ద్రావణంలో దుంప లను 30-40 నిమిషాలు నానబెట్టి తర్వాత విత్తుకోవాలి..

నాటడం:

వేసవిలో వర్షాలు పడిన తర్వాత భూమిని నాలుగైదుసార్లు దున్నాలి. ఇసుక లేదా ఎర్ర చెల్కా నేలలైతే 1.8-1.2 మీటర్లు ఉండేలా ఎత్తయిన సమతల మడులు చేసుకుని నీటిపారుదల, మురుగునీటి కాలువలు ఒకదాని పక్కన ఒకటి ఉండేలా చూసుకోవాలి. దుంపకుళ్ళు, నెమటోడ్స్ ఎక్కువుండే ప్రాంతాల్లోపాలిథీన్ షీట్లను ఉపయోగించి 40 రోజులపాటు సూర్యరశీకరణ చేయాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకిఉండేలా నాటాలి. విత్తనశుద్ధి చేసినప్పుడు, నాటేటప్పుడు మొలకలు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. విత్తన దుంపలు నాటడానికి పదిరోజుల ముందునుంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలకశాతం. కలిగి నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. వరుసల మధ్య 30 సెం.మీ., వరుసల్లో దుంపల మధ్య 20 సెం.. మీ దూరం ఉండేలా నాటుకోవాలి.

Also Read: Flower Farming: సకాలంలో పూల ఉత్పత్తి ఎలా చెయ్యాలి.!

Must Watch:

Leave Your Comments

Solar Dryers: సౌరశక్తితో పనిచేసే పరికరాలు.!

Previous article

Vegetable Cultivation: వేసవిలో తీగజాతి కూరగాయల సాగులో మెళుకువలు.!

Next article

You may also like