Floricultural Production: ఒకప్పుడు పూలను పడగ సమయాల్లోనే ఎక్కువగా వినియో గించేవారు. కాని ఈ మధ్య కాలంలో పూల వాడకం బాగా పెరిగింది. మన రాష్ట్రంలో పండగలు, పూజల సమ యంలో పూలకు గిరాకీ అధికంగా ఉంటోంది. అప్పుడు పూలు స్థానికంగా అందుబాటులో లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని మన అవసరాలను తీర్చుకుంటున్నాం. మన దగ్గర పూలు సాగుచేసే రైతులు ఎంతో కష్టపడి పూలను పండిస్తు న్నారు. కాని ఆ పూలు అవసరమైన సమయంలో మార్కెట్లోకి రావడం లేదు. పండ్లు, కూరగాయలతో పోల్చితే పూలు మార్కెటింగ్ భిన్నమైంది. మార్కె ట్కు వచ్చే పూలకు ఒకరోజు ఉన్నదర మరొక రోజు ఉండదు. పండుగ దినాల్లో మాత్రం పూల ధరలు అధికంగా ఉంటాయి. మరసటిరోజు అంతా షరామామూలే.
ఫ్లవర్ ఫోర్సింగ్: పూల రైతులకు లాభం ఎలా ఉంటుందో నష్టం కూడా అలాగే వస్తుంది. ఒకే సారి పూలు మార్కెట్లోకి ఎక్కువగా వచ్చినప్పుడు ధర తక్కువగా లభిస్తుంది. ఇలాంటి సమయంలో ‘నా పొలంలోని పూలు నాలుగు రోజుల ముందు లేదా నాలుగు రోజుల తర్వాత కోతకొస్తే బాగుండేది’ అని పూలరైతులు బాధపడే సందర్భాలు అనేకం. అలాగే పూలు మనకు అవసరమున్న సమయంలో లభించకపోవడంతో ఇతర రాష్ట్రాలపైన ఆధారపడాల్సి వస్తోంది. అలాంట ప్పుడు మనకు కావాల్సిన సమయంలో పూలు చేతికివచ్చే ఒకే ఒక మార్గం ఉంది. అదే ‘ఫ్లవర్ ఫోర్సింగ్ విధానం.
ఏయే పద్ధతులను ఉపయోగిస్తే పూలను అనుకున్న సమయంలో పుష్పిం పచేస్తామో ఆ పద్ధతులను ఫ్లవర్ ఫోర్సింగ్ విధానాలు అంటారు. ఉదాహర ణకు ప్రేమికుల దినోత్సవం నాడు గులాబీలను, దసరా, దీపావళి సమయంలో బంతి పూలను కొన్ని ముఖ్యమైన పద్ధతులను పాటించి ఆయా సమయాల్లో పూలను పొందవచ్చు.
ఫ్లవర్ ఫోర్సింగ్ ఎందుకు?
ఫవర్ ఫోర్సింగ్ విధానానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి సాధా రణంగా పూలు లభించని సమయంలో (ఆఫ్ సీజన్) పూల ఉత్పత్తి కాగా మరొకటి నిర్దిష్ట తేదీన పూల ఉత్పత్తి.
Also Read: Davanam Cultivation: సుగంధ దవనము పంటలో నర్సరీ యాజమాన్యం.!
ఆఫ్ సీజన్లో పూలఉత్పత్తి: సాధారణంగా బయటి వాతావరణంలో పెరిగే పూలమొక్కలు వార్షిక మొక్కలు నాటుకున్న 3 నెలల నుంచి పూలు పూస్తాయి. రైతులందరూ వర్షాకాలం ప్రారంభంలో నాటుకుంటారు. ఒకనెల అటు ఇటుగా మొత్తం పూలు మార్కెట్ కు వస్తాయి. నెల తర్వాత మళ్లీ ఆ పూలు మనకు మార్కెట్లో కనిపించవు. మనకు ఏ కాలంలో ఆ పూలు లభించవో ఆ కాలాన్ని ఆఫ్సీజన్ అంటారు. ఈ ఆఫ్సీజన్ కూడా ఫ్లవర్ ఫోర్సింగ్ విధానాలు అనుస రించి మనం పూలను పొందవచ్చు.
నిర్ధిష్ట తేదీన పూలఉత్పత్తి: కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని రకాల పూలకు మంచికి గిరాకీ ఉంటుంది.ఉదాహరణకు ప్రేమికుల దినోత్సవంరోజు ఎర్రగులాబీలకు చాలా ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆ రోజు తమ మనసులోని ప్రేమను వ్యక్త పర చడానికి ప్రేమికులు ఎర్ర గులాబీలను ఇస్తూ ఉంటారు. ఆ రోజున ఒక గులాబీ పువ్వు ధర వంద నుంచి రెండువందలు పలుకుతుంది. ఆ రోజున రైతులు కనుక గులాబీ పూలను మార్కెట్కు అందివ్వగలిగితే మంచి లాభం పొందవచ్చు.ఫ్లవర్ పోర్సింగ్ విధానాలు పాటించడం వల్ల పైన చెప్పిన రెండు ప్రయోజ నాలే కాకుండా అనేక లాభాలున్నాయి.
సాధారణ వూల సీజన్లో మిగులు పూలను తగ్గించుకోవచ్చు: చాలాసార్లు మనం మార్కెట్లో చూసే ఉంటాం. అమ్ముడుపోకుండా మిగిలి పోయిన, పాడైపోయిన పూలను కుప్పలుగా చెత్తకుండీల్లో పోస్తూ ఉంటారు. అలా మిగులు పూలను మనం తగ్గించుకోవచ్చు.
చీడపీడల నివారణ: కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఒకే సమయంలో ఆశించే చీడపీడలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మనం సాధారణ సమయంలో పూల మొక్క లను సాగుచేయకుండా సాధారణ సమయంకంటే కొంచెం ముందు లేదా కొంచెం ఆలస్యంగా సాగు చేసుకోవడం వల్ల అలాంటి చీడపీడల బెడదను నివారించుకోవచ్చు.
ఏడాది పొడవునా ఉపాధి: పూలను సాధారణ సమయంలో కాకుండా మిగతా సమయంలో సాగు చేయడం వల్ల కూలీలకు ఏడాది పొడవునా ఉపాధిని కల్పించవచ్చు. దీని వల్ల రైతు మంచి లాభం పొందడమే కాకుండా కూలీలకు కూడా పని లేని సమయంలో ఉపాధిని కల్పించినట్లవుతుంది.
రైతుకు ఆదాయం: రైతులు ఎంత చేసినా, ఏం చేసినా పొట్టకూటి కొరకే సాధారణ సమయంలో సాగు చేసి తక్కువధర పొందడం కంటే పూల ఇవ్వ సరాన్ని అంచనావేసి డిమాండ్ ఉన్న సమయంలో పూలను పొందే విధంగా సాగుచేసుకుంటే అధిక లాభం పొందవచ్చు.
Also Read: Plum Cultivation: ప్లం సాగుతో రైతులకు మంచి ఆదాయ వనరు
Also Watch: