Crops on Bunds: కరవు కష్టాలకు గురిచేస్తుంది. కన్నీటిని సెలయేరులా పారిస్తుంది. చివ రికి కడుపు మాడ్చుకునేలా చేస్తుంది. ఇన్ని చేసిన కరవు కొత్త ఆలోచన లకూ దారి చూపిస్తుంది. అలా ఆకలిలోంచి వచ్చిన నూతన ఆలోచన ప్రగ తివైపు పయనించేలా, కాలాన్ని ఎదిరించేలా మనోధైర్యాన్నిస్తుంది. ఈ కోవ లోనే కరవు కోరల్లో చిక్కుకొని నీటిజాడలేక కన్నీటితో బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని వెళ్ళదీసిన రైతన్నలు ఎలాగైనా కరవు రక్కసిని ఎదిరించాలనుకు న్నారు. అందులో భాగంగా సాగులో సరికొత్త ఆలోచనలతో విభిన్న పద్దతులను అనుసరిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులతో పొలం గట్ల వెంట తీగజాతి పంటలను పండిస్తూ.. వచ్చిన ఆదాయంతో ప్రధాన పంటలకు కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఓ చిన్న గ్రామం తుమ్మెనాల సుమారు 700 కుటుంబాలున్న ఈ గ్రామంలోని ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. 63వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ గ్రామంలో రైతు లందరూ కూరగాయలు పండిస్తున్నారు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఈ గ్రామంలోని రైతులందరూ కూరగాయలు పండిస్తూ వాటిని వారపు సంతల్లో, సమీపంలోని మార్కెట్లలో అమ్ముకొంటున్నారు. వరి, మిర్చి, పసుపు, పత్తి ఇక్కడ పండించే ప్రధాన పంటలు ఒక్క బోరుబావి కూడా లేని ఈ గ్రామంలో కేవలం బావుల్లోకి ఊటద్వారా వచ్చే నీటితో రైతులు తమ పొలం గట్లవెంట కాలానుగుణంగా తీగజాతి కూరగాయలు పూ ప్రధాన సమకూర్చుకుంటున్నారు.
ఒకరిని చూసి ఒకరు: ఒకప్పుడు గ్రామంలోని రైతులందరూ సంప్రదాయ పంటలనే పండించే వారు. కాలానుగుణంగా ఈ పంటలసాగుతో రైతులకు లాభాలు రాకపోగా నష్టాలు చవిచూశారు. దీంతో కొంతమంది రైతులు తమ పొలం గట్ల వెంట తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, చిక్కుడు పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని గడించారు. దీన్ని గమనించిన మిగతా రైతులు కూడా తమకున్న పొలం గట్ల వెంట కూరగాయలు పండిస్తూ లాభాలు పొందుతున్నారు కొంత మంది తమకున్న భూమిలో కొంతభా గాన్ని ప్రధాన పంటలకు కేటాయించి మిగతా భూమిలో కూరగాయలు పెంచుతున్నారు. కూరగాయలు పండిస్తున్న ప్రతి ఒక్కరు పొలం గట్ల వెంట తీగజాతి పంటలు పండిస్తున్నారు. పండించిన కూరగాయలను సమీపంలో జరిగే వారపు సంతల్లో, మార్కెట్లో విక్రయిస్తున్నారు.
Also Read: Wild Pigs Destroying Crops: పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను ఇలా తరిమి కొట్టండి..!
కరవు నేర్పిన పాఠం: కొన్నేళ్ల క్రితం వర్షాలు లేకపోవడంతో తీవ్రమైన కరవు వచ్చి గ్రామంలో నీటిజాడ కరవైంది ఇక్కడ బోరుబావులు లేకపోవడంతో రైతులు తమ కున్న బావుల్లోంచి అడపాదడపా వచ్చే నీటితో వరి, పత్తి, పసుపు, మిర్చి మొదలైన పంటలు పండించేవారు. కాని పంటలు సరిగా పండక రైతులు అవసరాలు తీరకపోగా మరింత అప్పులపాలు చేశాయి ఆ సమయంలో కొంతమంది రైతులు తమ పొలాల గట్ల వెంట పాదులు చేసి తీగజాతి కూరగాయలు పండిం చారు. ఇది లాభసాటిగా ఉండటంతో మరింత విస్తీర్ణంలో వాటిని పెంచడం మొదలు పెట్టారు. ఇలా ఉన్న నీటితో గట్ల వెంట తీగజాతి పంటలతో ఆదాయాన్ని పొంది రైతులు సాగులో నిలదొక్కుకు న్నారు. తర్వాతి కాలంలో వర్షాలు పడినప్పటికీ గట్లవెంట తీగజాతి పంటలు సాగుచేయడం మానుకోలేదు. ఒకప్పుడు ఎదురైన తీవ్ర నీటి ఎద్దుడే నేడు వారికి ఆదాయాన్ని గడించి పెట్టే మార్గాన్ని చూపించింది.
కాలానుగుణంగా సాగు: రైతులందరూ ఖరీఫ్‌లో వర్షాలు ప్రారంభం కాగానే ప్రధాన పంటలైన పత్తి, పసుపు, మిర్చి, వరి సాగుచేసుకునే సమయంలోనే పొలం గట్ల వెంట కర్రలు పాతుకొని తీగజాతి కూరగాయలైన బీర విత్తనాలను విత్తుతారు. బీర పంట పూర్తి కాగానే అవే పాదుల్లో కాకరను విత్తి పంట తీసుకుంటారు. కాకర పంట పూర్తికాగానే అదే స్థలంలో చిక్కుడు మొ గింజలు నాటుతారు.
గట్లే కాదు పెరటిలో సైతం: కూరగాయలు పండించే రైతులు నీటి సదుపా యాన్ని బట్టి తమ పెరళ్లలో వివిధ రకాల కూర గాయల్ని పండిస్తున్నారు. ఈ పంటల చుట్టూ ఉన్న గట్ల వెంట కర్రలు పాతి తీగజాతి పంటలను క్రమం తప్పకుండా పండిస్తున్నారు. రోజువారీగా కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళతారు కాబట్టి వాటితోపాటే గట్ల వెంట పండించిన కూరగాయలు కూడా తీసుకెళ్లి అమ్ముకుంటారు. రైతులు పండించే కూరగాయ పంటల్లో ఎక్కడైనా ఖాళీలు 3 ఏర్పడితే స్థలంలో వేరే రకం కూరగాయలు విత్తుతారు. దీంతో పొలం ఎప్పుడూ ఖాళీ ఉండ కుండా పంటలతో అదనపు ఆదాయం లభిస్తుంది.
చాలా మంది రైతులు ప్రధాన పంటలైన పత్తి, మిరప, పసుపులో కొత్తిమీర, పాలకూర, మెంతి కూర, తోటకూర, ఉల్లి, వెల్లుల్లి, టొమాటో, బెండ, సొర, బీర, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు మొద లైన పంటలను అంతర పంటలుగా సాగుచేస్తు న్నారు. దీంతో ప్రధాన పంట చేతికి రాకముందే అంతరపంటలతో ఆదాయం లభిస్తుంది. అలాగే అంతరపంటలు సాగుచేసిన పొలం చుట్టూ తప్పనిసరిగా గట్ల వెంట తీగజాతి కూరగాయ లను పెంచుతున్నారు. దీంతో ఏడాది పొడవునా గపంట, అంతర పంటలు, ప్రధాన పంటలు ద్వారా ఆదాయం లభించి రైతులకు సాగు లాభసాటిగా మారుతోంది.
Must Read: Late Sown Crops: ఆలస్యంగా విత్తేందుకు అనువైన పంటలు ఏవి.!
Also Watch:
Must Watch: