Rugose Spiralling Whitefly – లక్షణాలు: రసంపీల్చే జాతికి చెందిన ఈ తెల్లదోమ చిన్న, పెద్ద రెక్కల పురుగులు ఆకుల అడుగు, పైభాగాల్లో చేరి రసాన్ని పీల్చుతాయి. ఇవి విసర్జించే తేనెలాంటి జిగురు పదార్థంపై కాప్నోడియం జాతికి చెందిన బూజు తెగులు నల్లని మసిలా వృద్ధి చెందుతుంది. ఈ దోమ సోకిన ఆకుల అడుగు భాగంలో తెల్లటి దూది వంటి పదార్థం కనిపిస్తుంది. దీనిలోపల సర్పిలాకార తెల్లటి వల యాకారంలో గుడ్లు ఉంటాయి. పురుగు విసర్జించే జిగురు పదార్థం కింది ఆకు లపై పడి నల్లటి మసిమంగుతో కప్పినట్లు ఉంటాయి. ఈ మసివల్ల ఆహారం తయారుచేసుకునే శక్తి సన్నగిల్లుతుంది. ఉదృతస్థాయిలో ఆకుల పైనే గాక రెమ్మ మొదళ్లు, లేతకొబ్బరి కాయలపైన కూడా తెల్లని దూదిలాంటి పదార్థం కప్పి ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల్లో, వేసవిలో సాధారణ ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల సెం.గ్రే. పెరిగిన సమయాల్లో ఈ తెల్లదోమ ఉధృతి పెరిగే వీలుం టుంది.
సహజ శత్రువులు: సర్పిలాకార తెల్లదోమను సమర్థంగా నియంత్రించే ఎన్ కార్సియా పరాన్నజీవులున్నాయి. ఇది తెల్లదోమను 60-70 శాతం వరకు స్తంభింపజేస్తాయి. దక్షిణ భారతదేశంలో, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తెల్ల దోమ నివారణలో వీటిని సమర్థంగా వాడుతున్నారు. దీనివల్ల మిత్రపురుగులైన ఎనా కార్సియా పరాన్నజీవులు సమృద్ధిగా అభివృద్ధి చెంది, తెల్లదోమ నియంత్ర ణలో తోడ్పడ్డాయి. అలాగే పొరుగు రాష్ట్రా లైన కేరళ, తమిళనాడులో రసాయన మందులు పిచికారి చేయని కొబ్బరి తోటల్లో ఎన్కార్సియా గ్వడేలోపే పరాన్నజీవి 70 శాతం వరకు ఈ తెల్లదోమను నియంత్రించినట్లు కేంద్ర వన్యతోట పంటల పరిశోధన సంస్థ (సీపీసీఆర్ ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు.
Also Read: Coconut and Cocoa Crops in September: కొబ్బరి, కోకో పంటలలో సెప్టెంబర్ మాసంలో చేపట్టవలసిన పనులు.!
పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం, కలవలపల్లి గ్రామంలో గత డిసెంబరు, జన వరిలో పలు దఫాలుగా మిత్రపురుగులను విడుదల చేయడం వల్ల ఈ తెల్ల దోమ నియంత్రించే స్థితికి వచ్చింది. దీనికి ప్రధాన కారణం పురుగు మందులు. పిచికారీ చేయకపోవడమే విరివిగా పురుగు మందులు వాడిన తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లదోమ నియంత్రణ ఆశాజనకంగా లేదు.
సర్పిలాకార తెల్లదోమను ఆశించే పలు దేశీయ పరాన్నభుక్కులను కూడా గుర్తించారు. కాబట్టి పరాన్నజీవులు, పరాన్నభుక్కులు గమనించిన తోటల్లో రైతులు వాటికి హానికరమైన పురుగుమందులను పిచికారీ చేయరాదు.
సమగ్ర యాజమాన్యం: తెల్లదోమ తీవ్రంగా ఉన్న ప్రదేశాల నుంచి కొబ్బరి మొక్కలను, కాయలను, మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించరాదు. ఒకవేళ ఎగుమతి చేయాల్సి వస్తే నిశితంగా పరిశీలించి తెల్లదోమ లేదని నిర్ధా రించుకున్న తర్వాతే తరలించాలి. ప్రభుత్వం ఈ విషయంలో పటిష్టమైన చర్యలు చేపట్టాలి.
పసుపురంగు కలిగిన జిగురు అట్టలను చెట్లకు కట్టడం ద్వారా తెల్లదోమ జిగురు అట్టలకు అతుక్కుంటాయి. సుమారుగా 10-15 జిగురు అట్టలను అమర్చాలి.తెల్లదోమను అదుపులో ఉంచే ఎన్కార్సియా మిత్రపురుగుల్ని ప్రయోగశా లలో ఉత్పత్తిచేసే అవకాశం లేనందున సహజసిద్ధంగా ఎక్కడ ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందిన కొబ్బరితోటల్లో నుంచి సేకరించి, బదనికలు లేని తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి. దాదాపుగా 6 నుంచి 8 నెలల్లో ఈ పురుగులు తెల్లదోమను అదుపులోకి తీసుకొస్తాయి.
Also Read: Coconut Fruit Drop: కొబ్బరిలో పిందెలు రాలటాన్ని ఇలా నివారించండి.!
రుగోస్ తెల్లదోమ మనదేశంలోకి వచ్చిన విదేశీ కీటకం గనుక దాన్ని గుర్తించి పూర్తి సమాచారాన్ని రైతులకు, ఉద్యానవన విభాగం అధికారులకు తెలియజేయాలి. దాని నియంత్రణలో తగిన శిక్షణ ఇవ్వాలి.తెల్లదోమ ఆశించిన తోటల్లో కీటకనాశన మందులు వాడటం ఆపేయాలి… దీనివల్ల సహజ శత్రువులైన పరాన్నజీవులు వృద్ధి చెంది, తెల్లదోమను నియం త్రిస్తాయి.పురుగు స్థాయి ఎక్కువగా ఉంటే అజాడిరక్టిన్ 10000 పి.పి.ఎం. 1మి. లీ./లీ. లేదా లీటరు నీటికి 5 మి.లీ. వేపనూనె + 10 గ్రా. సర్స్ కలిపి ఆ అడుగు భాగం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
మసిమంగు నివారణకు ఒక శాతం గంజి ద్రావణాన్ని మసి బూజు ఆశించిన భాగాలపై పిచికారీ చేయాలి. ప్రసార మాధ్యమాలు కూడా ఈ కొత్తరకం తెల్లదోమ గురించి పూర్తి సమా చారాన్ని రైతులకు చేరవేయాలి. ఈ పురుగు ఉనికిని గమనిస్తూ సకాలంలో తగిన సస్యరక్షణ చర్యలు పాటించిన తర్వాత మాత్రమే నర్సరీల నుంచి మొక్కలు సరఫరా చేయాలి. లేదంటే ఈ పురుగు త్వరగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెంది అపార నష్టం కలుగజేస్తుంది.
Also Watch:
Must Watch: