వ్యవసాయ పంటలు

Mechanization in Agriculture: సాగులో యాంత్రీకరణ ముఖ్యం.!

0
Mechanization in Agriculture
Mechanization in Agriculture

Mechanization in Agriculture: సాంకేతిక ప్రగతిలో భాగంగా మానవ మేధస్సుతో నేడు అనేక రకాల యంత్రాలు రూపొందుతున్నాయి. రోజురోజుకు పరిశ్రమల్లో యంత్రాల విని యోగం విపరీతంగా పెరుగుతోంది. యంత్రాల వాడకం వల్ల మానవ జీవితం సులభంగా, సౌకర్యవంతంగా సాగిపోతుంది. ఒకప్పుడు చిన్నచిన్నగా మొద లైన యాంత్రీకరణ నేడు అంతరిక్షంలోకి సైతం ఉపగ్రహాలను పంపేస్థాయికి చేరింది. ఇంతగా అభివృద్ధి చెందిన యంత్రాలు వ్యవసాయరంగంలోకి మాత్రం ఆలస్యంగా ప్రవేశించాయని చెప్పవచ్చు. భూ వనరులు విస్తృతంగా ఉండి, మానవ వనరుల కొరత అధికంగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్లంటి దేశాల్లో యంత్రాల వినియోగం మొదటినుంచి ఎక్కువే. భూకమతాలు చిన్నగా ఉండే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వీటి విని యోగం మొదట్లో నామమాత్రంగా ఉండి రైతుకూలీలు, ఎద్దుల వినియోగం అధికంగా ఉండేది.

Mechanization in Agriculture

Mechanization in Agriculture

పెరుగుతున్న యాంత్రీకరణ: నాలుగైదు దశాబ్దాలుగా వ్యవసాయరంగంలో కూడా పెనుమార్పులు వస్తు న్నాయి. సాగులో కూలీల లభ్యత తగ్గింది. ఉన్న కూలీలు కూడా కష్టమైన పనులను చేయడానికి ఇష్టపడటం లేదు. వ్యవసాయ కార్మికుల కూలీరేట్లు, ఎద్దుల బాడుగ తక్కువగా ఉన్నప్పుడు యంత్రాలపై పెట్టుబడి ఖర్చు, వాటి నిర్వహణ, వడ్డీ ఖర్చులు కలిపి అధికంగా అనిపించేది. కాని కూలీరేట్లు, బాడుగ ఖర్చులు పెరిగేకొద్ది రైతులు యాంత్రీకరణకు మొగ్గుచూపుతున్నారు. ఎద్దుల పోషణ ఖర్చు పెరిగేకొద్ది వాటి వాడకాన్ని తగ్గించి ట్రాక్టర్లు, పవరి ల్లర్ల వాడకాన్ని పెంచారు. దీంతోపాటు యంత్రాలకు అద్దె చెల్లించి ఉపయో గించుకునే అవకాశముండటంతో రైతులు యాంత్రీకరణకు అలవాటు పడ్డారు.

శక్తి వినియోగం: హరితవిప్లవం తొలినాళ్లలో సాగులో వినియోగించే శక్తిలో ఎద్దులవాటా 49 శాతం, వ్యవసాయ కార్మికులవాటా 11 శాతం ఉండేది. అదే సమయంలో డీజిల్ ఇంజన్లవాటా 20 శాతం, కరెంట్ మోటార్ల వాటా 10.8 శాతం ఉండగా.. ట్రాక్టర్ల వాడకం కేవలం 8.45 శాతం ఉండేది. హరితవిప్లవం ఫలి తంగా మేలురకం విత్తనాలు, రసాయన ఎరువులు, నీటిపారుదల సదుపాయా లతో పాటు యాంత్రీకరణ కూడా అందుబాటులోకి వచ్చింది. 2009-10 నాటికి భారత వ్యవసాయరంగంలో ట్రాక్టర్ల వాటా 41.7 శాతం, కరెంటు మోటార్ల వాటా 25 శాతానికి పెరగగా, డీజిల్ ఇంజన్ల వాటా 13 శాతం, సంప్రదాయ శక్తి వనరులైన ఎద్దులవాటా 12 శాతం, శ్రామికులవాటా 8 శాతా తగ్గింది. 1971-72లో దేశంలో ట్రాక్టర్ల సంఖ్య 37 వేలు ఉండగా 2010 నాటికి 40 లక్షలకు చేరాయి. అంటే 38 ఏళ్లలో 108 రెట్లు పెరిగాయి. అలాగే పవర్ల సంఖ్య 9500 నుంచి రెండు లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో నేలను దున్నే పశువుల సంఖ్య 8 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గింది. సాగులో శక్తి వినియోగం హెక్టారుకు 0.5 కిలోవాట్ల నుంచి 2 కిలోవాట్లకు చేరుకుంది.పంటల దిగుబడులు కూడా హెక్టారుకు 0.7 టన్నుల నుంచి 2 టన్నులకు చేరాయి. ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.

Also Read: Agriculture and Farming Practices: వ్యవసాయం మరియు వ్యవసాయ పద్ధతులు.!

యంత్రాల వినియోగం: మన వ్యవసాయరంగంలో యాంత్రీకరణ 40శాతానికి చేరుకోగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 95 శాతం, ఇతర వర్థమాన దేశాలైన బ్రెజిల్లో 75 శాతం, చైనాలో 57 శాతం ఉంది. యంత్రాల వినియోగానికి వ్యవసాయ దిగుబడు లకు అవినాభావ సంబంధం ఉంటుంది. శ్రామికులపై పనిభారాన్ని తగ్గించ డంతోపాటు దిగుబడులు పెరగడానికి యాంత్రీకరణ ఎంతో దోహదపడు తుంది. భారతదేశంలో వ్యవసాయ పనులైన పంటకోత, నూర్పిడిలో 65 శాతం, నేలను చదును చేయడంలో 40 శాతం, నీటి వసతి కల్పనలో 37 శాతం, సస్యరక్షణలో 34 శాతం, విత్తనాలు, మొక్కలు నాటడంలో 29 శాతంగా యంత్రాల వినియోగం ఉంది.

Also Read: Modern Agriculture Drones: ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యత.!

Also Watch: 

Leave Your Comments

Rythu Bandhu: రైతుబంధు నిధులు రూ. 426.69 కోట్లు విడుదల.!

Previous article

Hydrophonics System: హైడ్రోఫోనిక్స్ తో రైతులకు వరం.!

Next article

You may also like