Napier Fodder Cultivation: పాడిపశువుల పెంపకంలో సుమారు 60 శాతం వరకు పోషణకు ఖర్చవు తుంది. పోషణ ఖర్చు తగ్గించాలంటే పశుగ్రాసాల మేపు తప్పనిసరి. అయితే పశుగ్రాసాల ఉత్పత్తికి భూమి లభ్యత క్రమంగా తగ్గిపోతున్నందువల్ల అధిక దిగుబడి, పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలను పశు పోషకులు తప్పనిస రిగా పెంచాల్సిన అవసరముంది. సాధారణంగా బహువార్షిక పశుగ్రాసాలన్నిం టిలో హైబ్రిడ్ నేపియర్ అధిక దిగుబడి నిస్తుంది. నేడు ఎ.పి. బి.ఎన్-1, కో- 3, కో-4, కో-5, ఎన్. బి-21 హైబ్రిడ్ నేపియర్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అయితే చలికాలం లో పెరుగుదల లేకపోవడం, తక్కువ పోషక విలువలు కలిగి ఉండడం వల్ల పశుగ్రాసాలు పెంచే రైతులు చలికాలంలో పశుగ్రాసం కొరత ఉంటే ప్రత్యామ్నాయ పశుగ్రాసాలు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిందే ‘సూపర్ నేపియర్’ పశుగ్రాసం. దీనిని థాయ్లాండ్ దేశంలో అభివృద్ధి చేశారు. దీన్నే నేపియర్ పాచాంగ్ అని పిలుస్తారు. చలికాలంలో కూడా పెరగడం ఈ గ్రాసం ప్రత్యేకత. అధిక దిగుబడి, అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల సూపర్ నేపియర్ పశుగ్రాసం నేడు రైతులకు ఎంతో ఉపయోగ పడుతుంది.
పెంపకం: సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని మిగిలిన నేపియర్ గ్రాసాల్లాగే పెంచ వచ్చు. ఈ పశుగ్రాసం చౌడు నేలల్లో తప్ప ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లోనూ పెంచవచ్చు. మొదట దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్నిన తర్వాత ప్రతి 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకి సుమారు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు అవసరమవుతాయి. ప్రతి కణుపునకు రెండు నోడ్సు తప్పనిస రిగా ఉండాలి. భూమికి ఆరుతడి పెట్టిన తర్వాత ప్రతి 3 అడుగులకొక కణుపును ఏటవాలుగా ఒక నోడు భూమిలోకి, మరొక నోడు భూమిమీద ఉండేలా గుచ్చాలి.
ఎరువులు: నాటిన తర్వాత 3 వారా లకు నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే గడ్డి త్వరగా పెరుగుతుంది. కాలాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకొకసారి నీటితడి ఇవ్వాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొంటే మొదటికోత రెండు నెలలకు, తదుపరి కోతలు ప్రతి 35-40 రోజులకొకసారి వస్తాయి. ఈ విధంగా సంవత్సరంలో దాదాపు 8 కోతలు వస్తాయి. ప్రతికోతకు సుమారు 20 కిలోల నత్రజని వేయాలి. ప్రతి సంవత్సరం 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 10 కిలోల పొటాష్ ఎరువులు వేస్తూ ఉండాలి. ఈ పశుగ్రాసం భూమినుంచి నిరంతరం పోషక పదార్థాలను తీసుకుంటుంది. కనుక ఎరువుల యాజ మాన్యం జాగ్రత్తగా చేస్తే గడ్డి దిగుబడి ఎక్కువగా ఉండి ప్రతి ఏటా సుమారు ఎకరానికి 200 టన్నులకు పైగా పశుగ్రాసం లభిస్తుంది. బాగా పెరిగిన గడ్డి సుమారు 12 నుంచి 15 అడుగుల వరకు పెరుగుతుంది. ఒకసారి నాటిన గడ్డి జాగ్రత్తగా మధ్యలో దున్నుతూ, చచ్చుదుబ్బులు తీస్తూ పెంచితే సుమారు పదేళ్ల వరకు పశుగ్రాసాన్ని ఇస్తుంది.
పోషక విలువలు: ఇందులో 10-12శాతం మాంసకృత్తులు, 50-55శాతం జీర్ణమయ్యే పదార్థాలు, 28-30శాతం పీచుపదార్థం ఉంటుంది.
మేపే విధానం: ఈ గడ్డిని తప్పనిసరిగా చాప కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కత్తి రించి మేపాలి. లేకుంటే పశువులు ఆకులను మాత్రమే తిని కాండంలో పోషక పదార్థాలను వృథా చేస్తుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కనుక పశువులు ఇష్టంగా తింటాయి. సాధారణంగా నేపియర్ గడ్డిని పూర్తిగా కాకుండా ఒక భాగం కాయజాతి పశుగ్రాసాలు అయిన అల సంద, పిల్లిపెసర, జనుము, ఉలవ వంటివాటితో కలిపి మేపితే పశువుల్లో పాల దిగుబడి, పెరుగుదల అధికంగా ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కనుక సైలేజి పద్ధతిలో గడ్డి ఎక్కువగా ఉన్న ప్పుడు నిలువ చేసుకోవచ్చు. ఒక ఎకరా సూపర్ నేపియర్ పశుగ్రాసం ఉంటే సుమారు పది పాడి పశువులకు ఏడాది పొడవునా పశుగ్రాసాన్ని అందించ వచ్చు.
Also Read: Fodder Cultivation: హైవే డివైడర్లపైన పశుగ్రాస సేద్యం.!
Also Watch:
Must Watch: