రైతులు

Gardening and Fish Cultivation: టెర్రస్ పై కూరగాయలు, చేపల పెంపకం.!

0
Gardening and Fish Cultivation on Terrace
Gardening and Fish Cultivation on Terrace

Gardening and Fish Cultivation: పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రు మండలం, ఛానమిల్లి గ్రామానికి చెందిన రవిచంద్ర గతంలో ఊబకాయం (బరువు 109కిలోలు), మధుమేహం, రక్త పోటు, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు. దీని నుంచి బయట పడే మార్గాలను అన్వేషించగా ‘ఇంటిపంట’తో ఆరోగ్యం పొందవచ్చు . టెర్రస్ గార్డెన్లో అత్యాధునిక పోకడలను పాటిస్తూ, ఇంటి పంటను తినడం వల్ల నేడు 73 కిలోల బరువుకు తగ్గి మందులు, జబ్బులకు దూరంగా ఉంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు. టెర్రస్పై కూరగాయ లతో పాటు చేపలను కూడా పెంచుతున్నారు. చేపల పెంపకం ద్వారా వచ్చే పోషకాలను ‘రీసైక్లింగ్ పద్ధతి ద్వారా మొక్కలకు అందిస్తున్నారు.

రవిచంద్ర వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వ్యవసాయం, చేపలు, రొయ్యల పెంపకంపై అనుభవముంది. అయితే వ్యవసాయంలో చేసిన కొన్ని తప్పిదాల వల్ల నష్టపోయారు. తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో నివశిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. రెండేళ్ళ క్రితం బెంగళూరుకు ఉద్యోగరీత్యా వెళ్ళారు. అక్కడ ఆయన బసచేసిన హోటల్లో ఒక శాస్త్రవేత్త ఆయన కుంగు బాటుకుగల కారణాలను తెలుసుకున్నారు. ఆయన జబ్బులను, ఆహారపు అల వాట్ల గురించి వాకబు చేశారు. దీనికి ప్రధాన కారణం పురుగు మందుల అవ శేషాలున్న పండ్లు, కూరగాయలు తినటమే అని తేల్చారు. ఆ తర్వాత హైద రాబాద్కు వచ్చిన తరువాత కొన్ని నెలలపాటు ‘ఇంటిపంట’ పెంప కంపై ఎందరినో సంప్రదించి విషయ సేకరణ చేశారు.

Also Read: Benefits of Terrace Gardening: ఇంటి పంటతో ఆరోగ్యానికి మేలు.!

 టెర్రస్ పై మొక్కల పెంపకం:

మొదట పెరటిలో ఆకుకూరలను పెంచడం మొదలుపెట్టారు. ఎర్రమట్టి, పశు వుల ఎరువును వాడి మొక్కలు పెంచగా దానిలో కలుపు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. పెరటిలో పండించిన పంట తినటం వల్ల మలబద్దక సమస్య క్రమంగా తగ్గుతున్నట్లు గమనించారు. పెరటి మొక్కలు పెంచడానికి స్థలాభావ సమస్య కూడా ఏర్పడింది. కలుపు, కూలీల సమస్యను గమనించిన ఈయన స్థలం ఎక్కువ వాడకుండా మొక్కలను ఎలా పెంచాలి అనే విషయంపై ఎంతో మంది అనుభ వజ్ఞులను కలిసి వారి సలహాలను తీసుకుని వ్యవసాయంలో తనకున్న అనుభవా లను కూడా జోడించి టెర్రస్పై మొక్కల పెంపకానికి నాంది పలికారు.

Terrace Gardening

Terrace Gardening

మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటైనర్లపై కూడా సర్వే జరిపారు. మార్కెట్లో దొరికే వివిధ రకాల కంటైనర్లు ఖర్చుతో కూడుకున్నవేగాక ఎక్కువకాలం మన్నిక అయ్యే టట్లు ఆయనకు అనిపించలేదు. ఒక ఫంక్షనుకు వెళ్ళగా అక్కడ వాడి పడేసిన పెరుగు బక్కెట్లను చూశారు. అవి ఎక్కువ కాలం మన్నేవిగా గుర్తించి అతి తక్కువ ఖరీదుతో వాటిని కొనుగోలు చేశారు. టెర్రస్ పైన 150 బక్కెట్లను ఏర్పాటు చేసుకున్నారు.

టెర్రస్ మొక్కలను పెంచేటప్పుడు నీరు నిలిస్తే లీకేజీలు ఏర్పడి భవన నిర్మాణం దెబ్బతింటుందని గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలవైపు ఆలోచిం చారు. టెర్రస్పైన ఒక చుక్కనీరు కూడా పడకుండా విధంగా పి.వి.సి. పైపు లపైన డబ్బాలను ఏర్పాటు చేసుకున్నారు. అంగుళంన్నర పి.వి.సి. పైపులను ఏర్పాటు చేసి, ప్రతి 24 అంగుళాలకు ఒక రంధ్రం ఏర్పాటు చేసి దానిని బకె ట్టుకు అనుసంధానం చేశారు.

Also Read: Organic Farming in Terrace Garden: టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ వ్యవసాయం

Backyard Fish Farming

Backyard Fish Farming

చేపల పెంపకం కోసం కంటైనర్ ఏర్పాటు:

టెర్రస్ పై చేపల పెంపకం కోసం వాడే కంటైనర్ (1000 లీటర్లు) మూడు అడుగుల ఎత్తులో అమర్చుకున్నారు. గ్రావిటీఫోర్సుతో నీటిని డ్రిప్ ద్వారా మొక్కలు ఉన్న కుండీలకు పంపి ఆ కుండీల నుంచి బయటకు వచ్చిన నీరు టెర్రస్ పైన పడకుండా ఒకటిన్నర అంగుళాల పి.వి.సి. పైపులో పడేటట్లు ఏర్పాటుచేసుకున్నారు. మొక్కల నుంచి వచ్చే నీటిని ఫోమ్ ఫిల్టర్ లేదా శాండ్ ఫిల్టర్లోకి పంపి దానినుంచి వచ్చే యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కి పంపించాలి. అక్కడ నుంచి వచ్చే నీటిని స్టోరేజ్ ట్యాంక్లోకి పంపించాలి. దీని నుంచి మోటార్ ద్వారా పైన చేపలు కంటైనర్లో పడే విధంగా అమర్చుకున్నారు. డ్రమ్ములో తిలాపియా చేపలను పెంచుతున్నట్లు తెలిపారు. ఈయన చేసుకున్న ఈ ఏర్పాట్ల వల్ల 5 లాభాలను గుర్తించారు.

Fish Farming

Fish Farming

1) మాములుగా బక్కెట్టుతో, మగ్గుతో నీటిని పోస్తే రోజుకు 300లీటర్ల లెక్కన నెలకు 9 వేల లీటర్ల నీరు అవసరం. అయితే ఈ రీసైక్లింగ్ పద్ధతి ద్వారా నెలకు 750-800లీటర్ల నీరు సరిపో తుంది. దీనితో నీటిని ఆదా చేసుకోవచ్చని అన్నారు.

2) వంటింటి వ్యర్థాలను చెత్త చెదారాలను చెత్త డబ్బాల్లో పడేయకుండా కంపోస్టింగ్ చేసుకోవడం ద్వారా ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడమే గాక, పరి సరాల పరిశుభ్రతను కాపాడుకోవచ్చు.

3) చుట్టు పక్కల ఉన్న వాళ్ళకు స్వచ్ఛమైన గాలి, పచ్చదనాన్ని పంచ వచ్చు.

4) టెర్రస్ గార్డెనింగ్ వల్ల బిల్డింగ్ చల్లబడి కరెం ట్పై పెట్టే ఖర్చును 35 శాతానికి తగ్గించుకున్నట్లు తెలి పారు. 5) వ్యాయామానికి ప్రత్యేక సమయం కేటాయిం చాల్సిన అవసరం లేదని, మందుల అవసరం లేకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు.

Also Watch:

Must Watch:

Must Watch:

Leave Your Comments

Jasmine Cultivation: మల్లెతోటల్లో మంచి దిగుబడి రావాలంటే ఇలా చెయ్యండి.!

Previous article

Capsicum Cultivation: హరితగృహాల్లో కాప్సికం సాగు.!

Next article

You may also like