AP Higher Education Planning: ఆంధ్ర ప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డ్ నాలుగవ మీటింగ్ ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం లాం గుంటూరు ఆడిటోరియంలో ఈరోజు ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి చైర్మన్, APHEPB అధ్యక్షతన ప్రారంభమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి ఒక పలు రాష్ట్రాలనుండి ప్రసంసలు అందుకుంటోంది అని, దీని ద్వారా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ విద్యార్థుల్లో సామాజిక సేవ దృక్పథం కల్పించడం కోసం విశ్వవిద్యాలయాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు రెండు నెలలపాటు తప్పనిసరిగా చేయవలసి ఉంటుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ జి సతీష్ రెడ్డి, సైంటిఫిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచనలకు అనుగుణంగా ఆత్మ నిర్భార్ భారత్, మేక్ ఇన్ ఇండియా వైపు విద్య, విద్యార్థులు పయనించాలని తెలియజేశారు. గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ డి.న్. రెడ్డి, మాజీ ఉపకులపతి, జె ఎన్ టి యు గారు మాట్లాడుతూ యువతలో వృత్తి నైపుణ్యం సాధించే దిశగా విద్యా వ్యవస్థ లో పెను మార్పులు జరగాలని తెలియజేశారు. డాక్టర్ ఎ. విష్ణువర్ధన్ రెడ్డి, గౌరవం ఉపకులపతి, ANGRAU మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిందని, ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదల మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా ఉందని, మొదటి స్థానంలో ఉందని కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత వలన ప్రత్తి మొదలగు పంటలలో నికర ఆదాయం తక్కువగా ఉంది అని తెలియజేశారు.
దీనిని అధిగమించడానికి పంట విత్తిన దగ్గర్నుంచి కోసే వరకు వివిధ రకాల వ్యవసాయం పనులలో యాంత్రీకరణ దిశగా శాస్త్రవేత్తలు సమిష్టి కృషితో సాధ్యమైందని తెలియజేశారు. ప్రత్యేక ఆహ్వానితులైన శ్రీ కోలా శంకర్, ఐ.ఎ.ఎస్ మాట్లాడుతూ విద్యలో నాణ్యత, మౌలిక సదుపాయాలు, సాంకేతికత పెంపొందాలని కోరారు. ఈ సమావేశం లో ఈ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకొని విడతలవారీగా మౌలిక సదుపాయాలు నాణ్యత ప్రమాణాలు అందించాలని పెంపొందించాలని కోరారు. ఈ సమావేశములో రాష్ట్రములోని పలు విశ్వ విద్యాలయాల ఉపకులపతులు హాజరయ్యారు.
Also Read: Training at Guntur Lam 2022: గుంటూరు లాం లో పరిపాలన మరియు ఆర్థిక ప్రణాళికల శిక్షణ ప్రారంభం.!
Also Watch: