తెలంగాణవార్తలు

Rythu Bandhu: వ్యవసాయ వృద్ది కొరకే రైతుబంధు పథకం – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!

0
Rythu Bandhu
Rythu Bandhu

Rythu Bandhu: రైతుబంధు రెండో రోజు నిధులపై విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. రెండో రోజు రైతుబంధు రూ.1218.38 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. మొత్తం 15.96 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ రైతు బంధు జమ చేసారని మంత్రి వెల్లడించారు.మొత్తం 24 లక్షల 36 వేల 775.07 ఎకరాలకు గాను రూ.1218 కోట్ల 38 లక్షల 75,934 రైతు బంధు సహాయం అందించారని.. వ్యవసాయ వృద్ది కొరకే రైతుబంధు పథకం అమలులోకి తెచ్చామని మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Rythu Bandhu

Rythu Bandhu

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, సాగునీరు, మిషన్ కాకతీయ, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల పథకాలతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తిన్న గత పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేదు.

ప్రభుత్వ చర్యల మూలంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో, పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశమంతా అమలు జరగాలని భారత రైతాంగం డిమాండ్ చేస్తున్నది. దేశంలో కేసీఆర్ గురించి, తెలంగాణ పథకాల గురించి మాట్లాడుకోవడం మొదలయింది. కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని మంత్రి నిరంజన్ రెడ్డి సగర్వంగా చెప్పారు. అబ్ కి బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయి. అందుకే తెలంగాణ అభివృద్దికి అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Also Read: PM Kisan Scheme: పీఎం కిసాన్ అనర్హులు తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే

Also Watch: 

Leave Your Comments

Health Benefits of Green Olives: గ్రీన్ ఆలివ్స్ తో అంతులేనన్ని ప్రయోజనాలు!

Previous article

Mango Peel Health Benefits: తొక్కే కదా అని తీసేస్తే! విలువైన పోషకాలను కోల్పోయినట్టే!

Next article

You may also like