Goat & Sheep Farming Guide: ప్రస్తుతం మన రాష్ట్రంలో మాంసానికి ఉన్న డిమాండ్ మరియు మాంసం ధరలను దృష్టిలో ఉంచుకొని జీవాల పెంపకం ప్రారంభించాలనుకునే వారు తమ వద్ద ఉన్న వనరులను గమనించి జీవాల్ని సాంద్ర పద్దతిలో లేదా పాక్షిక సాంద్ర పద్దతిలో పోషిస్తే లాభాలార్జించగలుగుతారు. అందుకుగాను క్రింది సూచనలు పాటించాలి.
జీవాల పెంపకం ప్రారంభించే వారు గొర్రెల్ని పెంచడమా లేదా మేకల్ని పెంచడమా అనేది ముందే నిర్ణయించుకోవాలి. శీతల పరిస్థితులున్న ప్రాంతాల్లో ఉన్ని ఉత్పత్తి చేసే జీవాల పెంపకం అనుకూలంగా ఉంటుంది. మార్కెట్టు కూడాబావుంటుంది. కాని మన రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, మాంసంఉత్పత్తికి అనుకూలంగా ఉండే జీవాల పెంపకానికి ప్రాముఖ్యతనివ్వడ మంచిది.పెంపకానికి గొర్రెల్లో నెల్లూరు, దక్కని, బళ్ళారి జాతుల్ని, మేకల్లో స్థానికంగా లభించు మేకలు ఉస్మానాబాది, మహబూబ్నగరి, సిరోహి, జక్రానా, బ్లాక్బెంగాల్ జాతుల్ని ఎంపిక చేసుకోవాలి.
జీవాల్ని దృఢంగా, ఆరోగ్యంగా, పిల్లల్ని కనే శక్తి ఉండి పుష్కలమైన జాతి లక్షణాలున్న వాటిని, 2 సంవత్సరాలు వయస్సు ఉన్న వాటిని కొనాలి. చూడి కట్టిన జీవాల్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.
జీవాల్ని అక్టోబరు, నవంబరు లేదా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కొనుక్కోవడం మంచిది. మండుటెండల్లో, వర్షాలధికంగా ఉండే సమయంలో, అంటువ్యాధులు ప్రబలి ఉన్న సమయాల్లో కొనకూడదు. జీవాల్ని సంతలో కాకుండా మంద దగ్గరికి స్వయంగా వెళ్ళి ఎంపిక చేసుకుంటే మంచిది.జీవాల పెంపకం ప్రారంభించే ముందు కొన్ని ఫారాలను స్వయంగా సందర్శించి, పెంపకందార్ల అనుభవాల్ని తెలుసుకోవాలి.తక్కువ పెట్టుబడితో, మంద పెద్దది కాకుండా 100 గొర్రెలు/మేకలతో, చిన్న మందతో జీవాల పెంపకం ప్రారంభించడం మంచిది.పశుగ్రాసాల సాగుకు, పశుగ్రాసాన్నిచ్చే చెట్ల పెంపకానికి అనుకూలంగా ఉన్న స్థలం ఎంచుకోవాలి. జీవాలు త్రాగడానికి, పాకల్ని శుభ్రం చేయడానికి గ్రాసం పెంచుకోవడానికి నీళ్ళ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి.
Also Read: Goat Plague Disease: మేకలలో ప్లేగు వ్యాధి ఎలా వస్తుంది.!
జీవాల కొట్టాలను, పశుగ్రాసాలు సాగు చేయడం వీలు కాని వృథా భూమిలో ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. పాకను తూర్పు పడమర దిశలో, తక్కువ ఖర్చుతో తాటాకులు వేసి నిర్మించుకోవాలి. ఒకవేళ పర్మనెంటు పాక వేయాలనుకుంటే, సిమెంట్ రేకులు లేదా పెంకులతో పాకలు నిర్మించుకోవాలి.పాకల్లో దాణా తొట్లు, నీటి తొట్లు, ఖనిజ లవణ ఇటుకలు సిద్ధంగా ఉంచుకోవాలి. పేడ కుప్ప వేయడానికి, పాకకు దూరంగా స్థలం కేటాయించాలి.100 గొర్రెలు / మేకలు పెంపకానికి నీటి సౌకర్యం ఉన్న 8 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. 6 ఎకరాల భూమికి సంవత్సరం పొడవునా పశుగ్రాసాలు సాగు చేయడానికి నీటి సౌకర్యం ఉండాలి. ఒకటిన్నర ఎకరం స్థలం పశుగ్రాసాన్నిచ్చే చెట్ల సాగుకు (సిల్విపాశ్చర్) కు కేటాయించాలి. పాక కోసం జీవాలు తిరగడానికి చుట్టూ స్థలం కలిపి అర ఎకరం అవసరముంటుంది.
జీవాలు కొని తెచ్చే ముందే 6 మాసాలకు సరిపోవు పశుగ్రాసాన్ని, 2 వారాలకు సరిపోవు దాణాను నిలువ ఉంచాలి. ముందుగానే పశుగ్రాసాల సాగు ప్రారంభించాలి. చాఫ్కట్టర్ను కొని పెట్టుకోవాలి.లారీ సైజును బట్టి 60-100 జీవాల్ని ఎలాంటి గాయాలు తగలకుండా, జాగ్రత్తగా రవాణా చేసి తీసుకు రావాలి. ప్రయాణ సమయం తక్కువగా ఉండాలి. ఎండలేని సమయాల్లో రవాణా చేసుకోవాలి. దారిలో జీవాలకు మేత, నీరు | ఇవ్వాలి. కొత్త జీవాలు పాకల్లో అలవాటు కావడానికి, వాటిని రోజూ 3-4 గంటలు బయట తిప్పుతూ క్రమక్రమంగా పాకల్లో ఉంచి నీరు, గడ్డి, దాణా అందిస్తూ అలవాటు చేయాలి. జీవాలన్నింటికి తప్పనిసరిగా బీమా చేయించాలి.జీవాల కొట్టాలను నివాస ప్రాంతాలకు, శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండేటట్టు ఎంచుకోవాలి.
జీవాలను బంజరు భూములలో, అటవీ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో మేపుకు పంపడం ద్వారా మేత ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదే విధంగా స్థానికంగా లభించు వ్యవసాయ ఉప ఉత్పత్తులను (ఉదా|| వేరుశనగ చెత్త, గింజ తీసిన పొద్దు తిరుగుడు తలలు, శెనగ తీగలు) దాణా తయారీలో ఉపయోగించడం ద్వారా మేత ఖర్చును తగ్గించుకోవచ్చు.పండ్ల తోటలు ఉన్నవారు, జీవాల పెంపకం చేపట్టినట్లయితే అదనపు ఆదాయం పొందవచ్చు.జీవాల వివరాలు వ్రాసి ఉంచడానికి రిజిస్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
Also Read: Sheep Farming: యూనివర్శిటీలో చదువుకుని గొర్రెల పెంపకం చేపట్టిన ఖమ్మం వాసి
Also Watch: