వార్తలు

కరీంనగర్ యువరైతు మల్లికార్జున్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అవార్డుకు ఎంపిక..

0

కరీంనగర్ యువరైతు మావురం మల్లికార్జున్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అవార్డుకు ఎంపికయ్యాడు. మల్లికార్జున్ రెడ్డి 17 ఎకరాల వ్యవసాయ భూమిలో జింక్ రైస్, బ్లాక్ రైస్ వంటి దేశీయ వరిసాగుతో పాటు ఇతర పంటలను సేంద్రియ పద్దతిలో సాగు చేసి సఫలం అయ్యాడు. దీంతో ఆయనను ఐసీఏఆర్ ఉత్తమ రైతుగా గుర్తించింది. ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్.. మల్లికార్జున్ రెడ్డిని శుక్రవారం అభినందించారు.
చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి 2006లో హైదరాబాద్ లోని సాప్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. 2010 లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు 2014లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం బాట పట్టారు. తమకున్న 12 ఎకరాల్లో వివిధ పంటలు వేసి ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేశారు. ఆర్గానిక్ వ్యవసాయం మంచి ఫలితాలను ఇవ్వడంతో మరో ఐదు ఎకరాలను లీజుకు తీసుకుని 26 రకాల పంటలను వేసి మంచి లాభాలను గడించారు.
ఐసీఏఆర్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. వినూత్న పద్దతిలో వ్యవసాయం చేసేందుకు ఈ అవార్డు మరింత ఉత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. ఐసీఏఆర్ సంస్ధ దేశవ్యాప్తంగా 35 మందిని ఉత్తమ రైతులుగా ప్రకటించగా అందులో రాష్ట్రం నుంచి మల్లికార్జున్ రెడ్డి ఒక్కడే కావడం విశేషం. ఈ నెల 27 న ఢిల్లీలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా మల్లికార్జున్ రెడ్డి అవార్డు అందుకోనున్నాడు.

Leave Your Comments

“ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్” గా ఎంపికైన హైదరాబాద్ నగరంలో పచ్చదనం..

Previous article

పుట్టగొడుగుల వలన ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like