Broccoli Cultivation: శీతాకాలం పండించే కూరగాయల్లో బ్రాసికేసి కుటుంబానికి చెందిన క్యాబేజి (కోసు పువ్వు), కాలీఫ్లవర్ – బ్రకోలి, నూల్‌కోల్ ముఖ్యమైనవి. వీటి అన్నింటిలో పోషక విలువల పంటది మొదటిస్థానం. ఈ బ్రకోలి చూడటానికి కాలీ ఫ్లవర్ లాగే ఉంది, పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. భారతదేశంలో బ్రకోలిని అధికంగా అత్యల్ప ఉష్ణోగ్రతలున్న రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, నీలగిరికొండలు, చదును ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఈ బ్రకోలి పంటకు అల్ప ఉష్ణోగ్రతలు అయిన 18-25 డిగ్రీ సెం.గ్రే. వరకూ అవసరం. దక్షిణ భారతదేశంలో బ్రకోలి చాలా తక్కువగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం రైతులకు సరైన అవగాహన లేకపోవడమే. బ్రకోలి పంటను షేడేటలో బయట పొలాల్లో కూడా పండించవచ్చని శాస్త్రీయంగా నిరూ పితమైంది.
పోషక విలువలు:
- బ్రకోలి పువ్వులో ఫోలిక్ ఆమ్లం, విట మిన్-ఎ, విటమిన్-సి, బీటాకెరోటిన్స్, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి.
- ఇందులో క్యాన్సర్ వ్యాధిని నిరోధించే సల్ఫరోఫెన్ మెండుగా ఉండి, క్యాన్సర్‌ని మన దరిచేరకుండా కాపాడుతుంది.
- 100 గ్రా. బ్రకోలి పువ్వులో 2500 ఐ. యు. విటమిన్-ఎ, 113 మి.గ్రా. విట మిన్-సి, 3.6 గ్రా. మాంసకృత్తులు, 5.9 గ్రా. పిండిపదార్థాలు, 103 మి.గ్రా కాల్షియం, 1.1 మి.గ్రా. ఐరన్, 78 మి.గ్రా పాస్పరస్, 282 మి.గ్రా. పొటాషియం, 1.5 మి.గ్రా సోడియంలను కలిగి ఉంటుంది.
ఉష్ణోగ్రత, నేలలు: బ్రకోలి మూడు నెలల పంట. దీనికి 18-25 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రతలు చాలా అవసరం. 30 డిగ్రీ సెం.గ్రే. ఉష్ణోగ్రతలు | దాటితే పువ్వు రాదు. కావున శీతాకాలంలో డిసెంబర్, జనవరి నెలలు ఆంధ్రప్రదేశ్‌కు మిక్కిలి అనుకూలం. బ్రకోలికి అన్ని రకాల నేలలు అనుకూలమే. మురుగునీరు ఇంకిపోవు వసతిగల | సారవంతమైన ఎర్రనేలలు మిక్కిలి అనుకూలం.
పలం సమృద్ధి: ఇది 85-90 రోజులు కాలపరిమితి కలిగి ఉంటుంది. సరాసరి పువ్వు బరువు 300-400 గ్రా. కలిగి హెక్టారుకు 150- 200 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
Also Read: Vegetables Weed Management: కూరగాయల పంటలలో కలుపు యాజమాన్యం.!
పలం విచిత్ర: ఇది వంకాయ రంగును కలిగిన పువ్వు రకం. 115-125 రోజులు కాల పరిమితి. 400-500 గ్రా. పువ్వు బరువు కలిగి, హెక్టారుకు 225-250 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది.
ఫాంటసీ-ఎఫ్-1: ఇది ఎఫ్-1 హైబ్రిడ్ రకం. కాలప రిమితి 80-90 రోజులు. సరాసరి పువ్వు బరువు 9000 గ్రా. 15000 – గ్రా. ఉంది. హెక్టారుకు 120-150 టన్నుల దిగుబడినిస్తుంది.
బ్రకోలి నారుమొక్కలు ప్రధాన పొలంలో నాటడానికి ఒకనెల ముందు విత్తనాలు ప్రోట్రేస్ కొబ్బరి పొట్టు వేసి నారును తయారు చేసుకోవాలి. నెల వయస్సు ఉన్న నారుమొక్కల్ని డిసెం బర్ మొదటి వారంలో ప్రధాన పొలంలో 50 సెం.మీ. మొక్కల మధ్య 30 సెం.మీ. వరుసల మధ్య దూర ఉండేలా నాటుకుంటే మంచిది. 45-45 సెం.మీ., 80-45 సెం.మీ., కూడా పెట్టుకోవచ్చు.
పొలం తయారు చేసేటపుడు ఎక రాకు 7.5 టన్నుల చివికిన పశువుల పేడను 4 కిలోల భాస్వరం, పొటా ష్ ను, 28 కిలోల నత్రజని (సగం మొత్తం) నేలలో వేసి తయారు చేయాలి.
సస్యరక్షణ-
నారుకుళ్ళు తెగుళ్ళు: నారు మొక్కల కాండపు మొదళ్ళు తయారై, కుళ్ళి, వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎత్తైన మడులపై లేదా ప్రోట్రేలలో నారును పెంచాలి. ఎక్కువ నీటితడులు ఇవ్వరాదు.
నివారణ: నారు మొలిచిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా./ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి
పంట కోత: బ్రకోలి పువ్వులోని మొగ్గలు ఆకుప చ్చగా ఉండి పూర్తిగా విచ్చుకోకముందే పంటను ఉదయం కాని, సాయంత్రం 3 గంటల తర్వాత కానీ కోసుకోవాలి. కోసిన బ్రకోలి పువ్వు బయట ఉష్ణోగ్ర తలో 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండలేవు. కావున పువ్వులన్నీ శీతలీకరణ గదిలో / ఫ్రిజ్‌లో 0 డిగ్రీ ల సెం.గ్రే. ఉష్ణోగ్రత వద్ద 95 శాతం తేమ ఉండేలా ఉంచితే వారం రోజుల వరకు అవి తాజాగా ఉంటాయి.
Also Read: Pests Control In Rice Crop: వరి పంటలో తెగుళ్ళు, లక్షణాలు, నివారణ.!
Also Watch: