ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. ఇటువంటి ఆకుకూరలతో మెంతికూర ఒకటి. మనం దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తాము. మెంతులను సువాసనా ద్రవ్యంగా పోపుల పెట్టె మసాలా దినుసులతో ఒకటిగా ఉపయోగిస్తాము. మెంతికూరలో అతి విలువైన పోషకాలు ఉంటాయి. మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువ. పెరటిలో పెంచటం తేలిక. విత్తనాలు చల్లిన కొద్దీ రోజులలో మొక్కల ఆకులను మనం ఆహారంగా వాడుకోవచ్చు. ఇక పచ్చటి మెంతికూర ఆకు ఎంతో రుచికరంగాను, ఔషధ విలువలు కలిగి ఉంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్థాలలో వాడవచ్చు.ఎండిన ఆకుల సైతం ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ముఖ్యంగా మెంతి ఆకు రెగ్యులర్ గా తినడం వల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలగిస్తుంది. శ్వాస కోసం వ్యాధుల్ని తగ్గిస్తుంది.
మెంతులలో కావలసినంత పీచు పదార్థాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ – సి, బి1, బి2, కాల్షియం, విటమిన్ – కె, కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్థాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జీర్ణ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాలనిస్తుంది. మెంతిలో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి వెంట్రుకల చక్కటి ఎదుగుదలకు తోడ్పడతాయి. కనుక కేశ సౌదర్యం కోరే మహిళలకు ఈ ఆకుకూర ఒక వరంగా భావించాలి.
మెంతికూర ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments